Viral
Chhattisgarh Train Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం, గూడ్స్ రైలును ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్, ఇద్దరికి గాయాలు, వీడియో ఇదిగో..
Team Latestlyఛత్తీస్‌గఢ్ (Chattishgarh)లోని బిలాస్‌పూర్ (Bilaspur)లో ఘోర రైలు ప్రమాదం (Train accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు.. జయరామ్ నగర్ స్టేషన్ వద్ద ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు
Faridabad Shocker: వీడియో ఇదిగో, లైబ్రరీ నుండి తిరిగి వస్తున్న బాలికపై దుండగుడు కాల్పులు, హర్యానాలో నడిరోడ్డుపై దారుణ ఘటన
Team Latestlyహర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలోని ఒక ప్రైవేటు లైబ్రరీ వెలుపల చోటు చేసుకుంది. వీరిద్దరు నిత్యం ఆ లైబ్రరీకి వస్తున్నట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.
Health Alert: ఈ 7 లక్షణాలు కనపడితే జాగ్రత్త, పురుషుల శరీరంలో క్యాన్సర్ ముదురుతున్న సంకేతాలు కావచ్చు, వెంటనే అలర్ట్ కాకుంటే ప్రాణాలకే ప్రమాదం
Team Latestlyమనలో చాలామంది క్యాన్సర్ అనేది కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే వస్తుందని భావిస్తారు. కానీ వైద్య పరిశోధనలు చెప్పే దాని ప్రకారం కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర లేకపోయినా, జీవనశైలి, వయస్సు, ఆహారపు అలవాట్లు, పర్యావరణ ప్రభావాలు వంటి అంశాలు భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
Digital Arrest Scam Alert: ఆ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తకండి, డిజిటల్ అరెస్ట్ స్కాంలపై ఎన్పీసీఐ హెచ్చరిక, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని వెల్లడి
Team Latestlyదేశవ్యాప్తంగా సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా ప్రకటనతో ప్రజలకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని NPCI స్పష్టం చేసింది.
India’s Hidden Health Crisis: భారత్‌లో భారీగా పెరుగుతున్న అంటువ్యాధులు, ఐసీఎంఆర్ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి.. అలర్ట్ కాకుండా అంతే సంగతులిక..
Team Latestlyభారతదేశంలో అంటువ్యాధుల వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రజారోగ్యానికి కీలకమైన వైరల్ ఇన్ఫెక్షన్లను గుర్తించే లక్ష్యంతో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీస్ (VRDL) నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాలపై విశ్లేషణ జరిపింది
Tamil Nadu Shocker: తమిళనాడులో దారుణం, కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి ముగ్గురు వ్యక్తులు, ఎయిర్‌పోర్ట్ సమీపంలో లాక్కెళ్లి సామూహిక అత్యాచారం
Team Latestlyతమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసి కలకలం రేపింది. కేరళ సరిహద్దుకు సమీపంలోని కోయంబత్తూరులో ఓ ప్రైవేట్ కాలేజీలో పీజీ చదువుతున్న విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఆ యువతి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరింది.
ICC Women’s World Cup 2025: తొలిసారి వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత్, దేవుని ప్రణాళిక అంటూ హృదయానికి హత్తుకునే పోస్ట్ పెట్టిన షఫాలీ వర్మ, అభినందనల వెల్లువ
Team Latestlyఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ దరిచేరింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. షెఫాలీవర్మ, దీప్తిశర్మ అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న భారత్..స్ఫూర్తిదాయక పోరాటంతో కదంతొక్కింది. లక్ష్యఛేదనలో సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీ పోరాటం సఫలం కాలేకపోయింది.
Jaipur Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, మద్యం మత్తులో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనానాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన ట్రక్ డ్రైవర్,10 మంది మృతి, 50 మందికి గాయాలు
Team Latestlyరాజస్థాన్‌లోని జైపూర్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్ డ్రైవర్ లోహమండి రోడ్‌పై ఆగి ఉన్న అనేక వాహనాలను బీభత్సంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో..మూడేళ్ల పాప పైకి దూసుకెళ్లిన కారు, అయినా కూడా దెబ్బలు తగలకుండా కారు కింద నుండి మెల్లిగా బయటకు..
Team Latestlyఅహ్మదాబాద్‌లోని నోబెల్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన సిసిటివిలో రికార్డైంది. ఇందులో ఒక టీనేజర్ నడుపుతున్న కారు ఢీకొట్టడంతో మూడేళ్ల బాలిక తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో, వేగంగా వస్తున్న నంబర్ ప్లేట్ లేని కారు ఆమెపైకి దూసుకెళ్లింది.
ICC Women's World Cup 2025: మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత మహిళలు, వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన బ్లూ ఉమెన్స్, శతకంతో ఆసీస్ బౌలర్ల భరతం పట్టిన జెమీమా రోడ్రిగ్స్
Team Latestlyనవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో గురువారం రాత్రి భారత మహిళల జట్టు చరిత్ర రాసింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదిస్తూ, భారత మహిళలు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై భారత్ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
Ikkis Trailer Out: ఇక్కీస్ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.. హీరోగా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా మూవీ
Team Latestlyభారత సైన్యంలో అత్యంత వీరోచిత సాహసాలను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం‘ఇక్కీస్’ (Ikkis). ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో దేశభక్తి భావాలను రగిలిస్తోంది.
Shreyas Iyer: గాయం తర్వాత మొదటిసారిగా స్పందించిన భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కోలుకునే దశలో ఉన్నానని వెల్లడి, అభిమానుల మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ నోట్
Team Latestlyసిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడో వన్డేలో తీవ్రమైన గాయానికి గురైన తర్వాత భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదటిసారిగా స్పందించారు. ప్లీహ (spleen) గాయం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు వచ్చి కోలుకునే దశలో ఉన్నారని తెలిపారు.
Amazon Layoffs: అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపులు, సీనియర్ స్థాయి అధికారులతో కలిపి దాదాపు 14 వేల మంది బయటకు, ఏఐ రాకతో ఉద్యోగులకు దినదిన గండం
Team Latestlyఅమెజాన్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సారి సీనియర్ స్థాయి అధికారులను కూడా కలుపుకొని దాదాపు 14 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని నివేదికలు చెబుతున్నాయి.
Andhra Pradesh Formation Day 2025: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా అందరికీ ఏపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి
Team Latestlyఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు.
Helmet Rule Violation: వైరల్ వీడియో ఇదిగో, హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపిన ట్రాఫిక్ పోలీసుకు షాక్, కుర్రాడి దెబ్బకు రూ.2 వేల ఫైన్ విధించిన అధికారులు
Team Latestlyథానేలో చోటుచేసుకున్న వైరల్ వీడియో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాగ్వాదం చేస్తూ కనిపించాడు. విచారణలో తెలిసిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తికి గతంలో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు జరిమానా విధించబడింది, దానిపట్ల అతనికి పగ పెరిగి, మళ్లీ అదే అధికారిని ఎదుర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Delhi High Court: వృద్ధ అత్తమామలను కోడలు పట్టించుకోకపోవడం క్రూరత్వమే..భార్య క్రూరత్వం కారణంగా భర్తకు విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు, కేసు ఏంటంటే..
Team Latestlyఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఒక తీర్పు వైవాహిక సంబంధాలపై కీలక చర్చకు దారితీసింది. వృద్ధ అత్తమామల పట్ల భార్య చూపిన కఠినత్వం, నిర్లక్ష్యం కూడా వైవాహిక చట్టం ప్రకారం "క్రూరత్వం" కిందకు వస్తుందని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం, భర్త అత్తమామల పట్ల భార్య ప్రవర్తన కారణంగా మానసిక వేదనకు గురైతే, ఆయన విడాకులకు అర్హుడు అవుతారు.
Narrow Escape in Hyderabad: గుండెలు ఝలదరించే వీడియో ఇదిగో, కదులుతున్న రైలు నుంచి దిగుతూ జారిపడిన ప్రయాణికుడు, వెంటనే ముందుకు దూకి కాపాడిన తోటి ప్రయాణికులు
Team Latestlyహైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నిస్తూ జారిపడిన ఒక వ్యక్తి ఘోర ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. అక్టోబర్ 26న జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది, వరంగల్‌కు చెందిన 31 ఏళ్ల మణిదీప్‌గా గుర్తించబడిన ఈ ప్రయాణికుడు బ్యాలెన్స్ కోల్పోయి రైలు కింద పడిపోతున్నట్లు చూపబడింది.
Turkey Earthquake: టర్కీని వణికించిన భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు, ఇండ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం, వీడియో ఇదిగో..
Team Latestlyటర్కీలోని పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం (Turkey Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదయింది. రాత్రి 10.48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి (Sindirgi) పట్టణాన్ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు. ఇస్తాంబుల్, ఇజ్మీర్, బుర్సా, మానిసా వంటి నగరాల్లో భూకంప ప్రభావానికి వణికిపోయాయి.
Karimnagar Road Accident: వీడియో ఇదిగో.. కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొట్టుకున్న రెండు బైక్‌లు, ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
Team Latestlyకరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతంలో కలకలం రేపింది. రహదారిని దాటుతున్న సమయంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాద తీవ్రతతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.రెండు బైకులు కూడా అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా, మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది.
Telangana Shocker: వీడియో ఇదిగో.. పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు, టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన
Team Latestlyరంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తూ ఒక యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కి దూకాడు. స్థానికులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నించినా, అతడు వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మరియు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.