Cow Hug Day: ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై కేంద్రం యూ టర్న్! ఎందుకంటే??
అయితే, ఈ రోజును ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలంటూ కేంద్రం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అయిన కేంద్రం తన ప్రకటనను ఉపసంహరించుకుంది.
Newdelhi, Feb 11: ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా (Valentine's Day) జరుపుకుంటారు. అయితే, ఈ రోజును ‘కౌ హగ్ డే’గా (Cow Hug Day) జరుపుకోవాలంటూ కేంద్రం (Centre) ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’ జరుపుకోవాలంటూ ఇటీవల కేంద్ర పశుసంవర్థక బోర్డు (ఏవీబీఐ) ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవు వెన్నెముక అని, దానిని కౌగిలించుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆ ఉత్తర్వుల్లో ఏవీబీఐ (AVBI) పేర్కొంది.
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం వాయిదా.. కారణమిదే! (వీడియోతో)
అయితే, ఈ ఉత్తర్వులపై సోషల్ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వాలెంటైన్స్ డే నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ‘కౌ హగ్ డే’ను కేంద్రం ప్రకటించిందంటూ సోషల్ మీడియా దుమ్మెత్తి పోసింది. రాజకీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ‘కౌ హగ్ డే’ను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్, శివసేన, టీఎంసీ దుమ్మెత్తి పోశాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఏవీబీఐ తన ప్రకటనను ఉపసంహరించుకుంది.