పుష్ప మూవీకి అర్జున్ కు జాతీయ అవార్డు రావడంపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? అంటూ మండిపడ్డారు. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదన్నారు. కానీ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి ఆక్షేపించారు.
మానవ హక్కులను కాపాడే లాయర్ జీరో అయినప్పుడు... స్మగ్లింగ్ చేసే నటుడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. సినిమాలో స్మగ్లర్ హీరో అని, కానీ స్మగ్లింగ్‌ను కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయన్నారు. రెండు మర్డర్లు చేసిన వ్యక్తిని పుష్ప-2 థియేటర్లో పట్టుకున్నారని వెల్లడించారు.సందేశాత్మక చిత్రాలు తీస్తేనే ప్రజలు ఆదరించాలని సూచించారు. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాల్సి ఉందన్నారు.
Minister Seethakka on Allu Arjun Pushpa Movie
స్మగ్లర్ హీరోకు అవార్డులా.. బన్నీపై మరోసారి సీతక్క ఫైర్!@seethakkaMLA #Telangana #minister #seethakka #comments #AlluArjun #RTV pic.twitter.com/rH2pfkVIYq
— RTV (@RTVnewsnetwork) December 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)