Vijayawada, DEC 22: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) మనవడు నారా దేవాన్ష్ (Nara Devansh ) చదరంగంలో (Chess) వేగంగా పావులు కదపడంలో రికార్డు సృష్టించాడు. చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించడంతో వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ (London) నుంచి నారా దేవాన్స్ ధ్రువపత్రం సాధించారు. నారా దేవాన్ష్ రికార్డు సాధించడం పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దేవాన్ష్ తండ్రి మంత్రి నారా లోకేష్ స్పందించారు. దేవాన్ష్ చెస్‌ను ఎంతో ఇష్టంగా స్వీకరించి, కొన్ని వారాలుగా ఈ రికార్డు కోసం శ్రమించాడని పేర్కొన్నారు. చదరంగంలో శిక్షణ ఇచ్చిన రాయ్ చెస్ అకాడమీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానని, ఈ ఘనత పట్ల నారా లోకేశ్ (Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. ‘‘దేవాంశ్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు. గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు. ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5..6 గంటలు శిక్షణ పొందాడు. చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు’’ అని లోకేశ్ తెలిపారు.
Nara Devansh Set A Record In Chess
- మంత్రి #NaraLokesh తనయుడు #Devansh చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు.
- 9 ఏళ్ల నారా దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్" ప్రపంచ రికార్డును సాధించాడు.
- ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను… pic.twitter.com/WqC4wt9daf
— Gulte (@GulteOfficial) December 22, 2024
దేవాంశ్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి అని కోచ్ కె.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 175 సంక్లిష్టమైన ఫజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం అతని సొంతమన్నారు. దేవాంశ్ చదరంగ ప్రయాణంలో ఇదొక మైలురాయి అని వెల్లడించారు.