ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీని కలిసేందుకు వెళ్ళారు. కాగా ఆమె ఈరోజు ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నేపద్యంలో అక్కడికి వెళ్ళిన చంద్రశేఖర్ రెడ్డి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీడియా సమావేశం అనంతరం తన ఛాంబర్ లోకి వెళ్లిన ఆమెను చంద్రశేఖర్ రెడ్డి అనుసరించారు. చాంబర్లోకి వెళ్లిన తర్వాత ఆయనతో మాట్లాడేందుకు దీపా దాస్ మున్షీ నిరాకరించారు.

సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించిన విజయశాంతి, బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుందంటూ మండిపాటు

ఈ విషయంపై మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గాంధీభవన్‌లో తమ ప్రెస్‌మీట్‌ జరుగుతుండగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడకు వచ్చారని తెలిపారు. ఆయన బయటకు వెళ్లిపోయాక తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. మళ్లీ వచ్చి తనను కలుస్తానని చెప్పారని మహేష్ కుమార్ గౌడ్‌ అన్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తన పాత మిత్రుడు, కాంగ్రెస్ వాది అని తెలిపారు. చంద్ర శేఖర్ రెడ్డితో తప్పకుండా మాట్లాడుతానని.. ఏదైనా విషయాలు ఉంటే చర్చించుకుంటామని మహేష్ కుమార్ గౌడ్‌ అన్నారు.

Kancharla Chandrasekhar Reddy in Gandhi Bhavan

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)