astrology

జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు ఒక శుభగ్రహంగా కొలుస్తారు. దీనికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చంద్రుడు ఇతర గ్రహాలతో పోలిస్తే అన్ని శుభ ఫలితాలను ఇస్తాడని నమ్మకం. జ్యోతిష శాస్త్రం ప్రకారం డిసెంబర్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం చంద్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. మూడు రాశుల వారికి కలుగుతుంది ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి- మేష రాశి వారికి చంద్రుని రాశి మార్పు కారణంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. మనసులో ఏర్పడిన ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. వీరికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మొదటి స్థానంలో నిలుస్తారు. వైవాహిక జీవితము మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం. వివాహం కాని వారికి కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వివాహమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

తులారాశి- తులారాశి వారికి చంద్రుని సంచారం అనుకూలమైన ప్రయోజనాలను అందిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు తీసుకున్న రుణాన్ని సులభంగా చెల్లిస్తారు. వ్యాపారస్తులు తమ పేరు మీద కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. దుకాణదారులు కు ఆర్థికపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చలికాలంలో వచ్చే సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు.

సింహరాశి- సింహరాశి వారికి చంద్రుని సంచారం శుభ ఫలితాలను అందిస్తుంది. వీరికి వ్యాపారంలో కొత్త కొత్త ఆర్డర్లు వస్తాయి. వారి వ్యాపారం గణనీయంగా లాభాలను ఇస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేసిన శ్రద్ధగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. పూర్వికుల నుంచి రావాల్సిన ఆస్తులు వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. దీని ద్వారా దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.