చలికాలం వచ్చిందంటే చాలు ఉసిరికాయ ఈ సీజన్లో బాగా లభిస్తుంది. ఇది ఎంత రుచిగా ఉంటుందో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది మన శరీరాన్నిలో విటమిన్ సి ని అందించి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ కి హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది. దీన్ని ప్రతి రోజు మనం ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు.
ఉసిరికాయలు పావు కేజీ, ఉప్పు రుచికి తగినంత. చింతపండు నిమ్మకాయ సైజు. కారం 100 గ్రాములు .జీలకర్ర ఒక టీ స్పూన్. ఆవాలు ఒక టీ స్పూను. వెల్లుల్లి 100 గ్రాములు. పసుపు ఒక టీ స్పూన్.
తాలింపు కోసం. పల్లి నూనె 150 ml ఆవాలు అర టీ స్పూన్, ఎండుమిర్చి రెండు కరివేపాకు కొంచెం ,ఇంగువ అర టీ స్పూన్.
Vastu Tips: ఇంటి హాలులో టీవీ ఏ దిక్కున ఉండాలి?
తయారి- ముందుగా ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయాలి. వీటిని పది నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఉసిరికాయ మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఉసిరికాయలను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయల్లో పావు కేజీ కారం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు రుచికి సరిపడినంత పసుపు వేసి కలపాలి. తర్వాత కడాయిలో పల్లీ నూనె తీసుకొని అందులో కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఆ నూనెను కాస్త చల్లారని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంత చింతపండును తీసుకొని నానబెట్టుకొని దాన్ని పులుసు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రసాన్ని ఉసిరికాయ ముక్కలకు కూడా పట్టించాలి. ఇప్పుడు నూనె చల్లారాక ఆ నూనెను ఉసిరికాయ మిశ్రమంలో వేయాలి. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ .వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకొని తింటే చాలా బాగుంటుంది .ముఖ్యంగా ఈ కాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది.ఈ టేస్టీ రెసిపీని ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు.