కడప నగర కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం వేళ హై టెన్షన్ వాతావరణం నెలకొంది.సోమవారం ఉదయం 11 గంటలకు నగర కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది.మేయర్ సురేశ్‌కు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ వేశారు. దీంతో మేయర్ సురేశ్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి వాగ్వాదానికి దిగారు. సీటు కేటాయించకపోవడంతో మేయర్ పోడియం దగ్గరే నిల్చొని నిరసన తెలిపారు.
మహిళలను మేయర్ అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యేకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.గత సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ మేయర్ తనకు కుర్చీ వేయకుండా అవమానించారని ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కడప కార్పొరేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. కాగా ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో 8 మంది కార్పోరేటర్లు చేరారు.
Chair Politics In Kadapa Muncipal Corporation
కడప రెడ్డమ్మ vs వైసీపీ మేయర్,
కడపలో కాక రేపుతున్న కుర్చీ రాజకీయం..
ఇవాళ కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ సమావేశం,
వేదికపై కుర్చీ కోసం టీడీపీ, వైసీపీ మధ్య వార్..#kadapaReddamma #Vs #mayor #TDPvsYCP #kadapa #AndhraPradesh #RTV pic.twitter.com/gog03Lc0R3
— RTV (@RTVnewsnetwork) December 23, 2024
కడప కార్పొరేషన్లో మరోసారి కుర్చీ ఫైట్
కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి గందరగోళం నెలకొంది. మేయర్ సురేశ్‌కు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ వేశారు. దీంతో మేయర్ సురేశ్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి వాగ్వాదానికి దిగారు. సీటు కేటాయించకపోవడంతో మేయర్ పోడియం దగ్గరే… pic.twitter.com/cogQ8h2uUO
— ChotaNews (@ChotaNewsTelugu) December 23, 2024
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దేవుని కడప ఆలయంలో మేయర్ సురేష్ బాబు ప్రమాణం
ఈ నేపథ్యంలో నేడు కార్పొరేషన్ సమావేశం..
గత సమావేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నగర పాలక సంస్థ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వన్ టౌన్ పట్టణ సీఐ రామకృష్ణ ప్రకటన.#kadapa #mayor #sureshbabu #RTV https://t.co/x4Ftg9KofO pic.twitter.com/CWIASZaA9E
— RTV (@RTVnewsnetwork) December 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)