'Pushpa 2' Stampede: వీడియో ఇదిగో, రేవతి కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కు అందించిన మైత్రీ మూవీ మేకర్స్

పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు అందజేశారు.

'Pushpa 2' Stampede: వీడియో ఇదిగో, రేవతి కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కు అందించిన మైత్రీ మూవీ మేకర్స్
Pushpa 2 makers donate Rs 50 lakh to Hyderabad Sandhya Theatre stampede victims family

పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు అందజేశారు. సోమవారం నాడు ఆయన బాధిత కుటుంబాన్ని కలిసి చెక్కును అందజేశారు. ఈ నెల 4న సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందారు. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని నటుడు అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో మైత్రీ మూవీస్ సంస్థ బాధిత కుటుంబానికి రూ.50 లక్షలను అందించింది.  వీడియో ఇదిగో, ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? పుష్ప సినిమాపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి సీతక్క

Pushpa 2 makers donate Rs 50 lakh to victims family

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 23, 2024 08:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).