Adani Enterprises AGM 2023: హిండెన్‌బర్గ్ నివేదిక పూర్తిగా దురుద్దేశపూరితం, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఈ నిరాధార ఆరోపణలని తెలిపిన అదాని
తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. ఈ రోజు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సమావేశం (ఏజీఎం)లో షేర్ హోల్డర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
అదాని సంస్థలపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ ‘హిండెన్‌బర్గ్’ ఇచ్చిన నివేదిక పూర్తిగా దురుద్దేశపూరితమని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. ఈ రోజు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సమావేశం (ఏజీఎం)లో షేర్ హోల్డర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
భారత చరిత్రలోనే అతిపెద్ద ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీవో)ను ప్రారంభించేందుకు మేం సిద్ధపడుతున్న వేళ.. హిండెన్‌బర్గ్ ఈ నివేదికను ప్రచురించింది. తప్పుడు సమాచారం, అసత్య ఆరోపణలతో ఆ నివేదికను రూపొందించారు. మా ప్రతిష్ఠను దెబ్బతీయడం, మా స్టాక్ ధరలను తగ్గించి లాభాలను ఆర్జించాలన్న లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం అది’’ అని గౌతమ్ అదానీ మండిపడ్డారు. మోసపూరిత లావాదేవీలు, స్టాక్ ధరల తారుమారు వంటి అవకతవకలకు అదానీ గ్రూప్ పాల్పడిందంటూ గతంలో హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)