PM Modi Bangladesh Tour: క‌రోనా నుంచి కాపాడు తల్లీ, బంగ్లాదేశ్ జెశోరేశ్వ‌రి కాళీ ఆల‌యాన్నిసంద‌ర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్‌ 50వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో అతిథిగా వెళ్లిన భారత ప్రధాని

రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ వెళ్లిన భార‌త‌ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi Bangladesh Tour) అక్క‌డ ప‌లు పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఉద‌యం ఆయ‌న సత్కిరా జిల్లా ఈశ్వరీపూర్ లోని జెశోరేశ్వ‌రి కాళీ ఆల‌యాన్ని (PM Narendra Modi Offers Prayers at Jeshoreshwari Kali Temple) సంద‌ర్శించుకున్నారు. దుర్గామాత శ‌క్తి పీఠాల్లో జెశోరేశ్వ‌రి ఆల‌యం ఒక‌‌టి.

PM Narendra Modi Offers Prayers at Jeshoreshwari Kali Temple in Ishwaripur (Photo-ANI)

కాళీ మాత‌ను ద‌ర్శించుకున్న అనంత‌రం మోదీ మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజు ఇక్క‌డి కాళీ మాత‌కు పూజ చేసే అవ‌కాశం ల‌భించిందని చెప్పారు. మాన‌వాళిని క‌రోనా నుంచి కాపాడాలని తాను జ‌గ‌న్మాత‌ను కోరుకున్నాన‌ని మోదీ చెప్పారు. కాగా, బంగ్లాదేశ్‌ 50వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో అతిథిగా పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్క‌డకు వెళ్లారు. అలాగే, ఆయ‌న ప‌లు కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటున్నారు.

Here's PM Narendra Modi Offers Prayers at Jeshoreshwari Kali Temple in Ishwaripur

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now