Happy Diwali 2022 Messages: దీపావళి శుభాకాంక్షలు మెసేజెస్, మీ బంధువులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా దివాళి శుభాకాంక్షలు చెప్పేయండి, దివాళి వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం..
పెద్దలకు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి.
Hyderabad, October 24: దేశంలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. పెద్దలకు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నిమ్పేదే దీపావళి . దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబం అంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, దీపాలను వెలిగించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగ దీపావళి.
దీపావళి రోజున చేసే లక్ష్మీ దేవి పూజలో ఈ తప్పులను చేశారో, ధన లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు..
దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీనిని దీవాళి అని దీపావళి అని కూడా పిలుస్తారు. ప్రజలు తమ ఇళ్లలో,దుకాణాలలో దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి, సంపద, అదృష్టం , శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.లేటెస్ట్‌లీ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా దివాళి శుభాకాంక్షలు చెప్పేయండి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)