Sports

Rohit Sharma Dismissal Video: యువ స్పిన్నర్ చేతికి చిక్కిన రోహిత్ శర్మ వీడియో ఇదిగో, ఇంగ్లండ్‌ అరంగేట్ర స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ ట్రాప్‌లో పడి పెవిలియన్ చేరిన టీమిండియా కెప్టెన్‌

Hazarath Reddy

విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ యువ స్పిన్నర్‌ ట్రాప్‌లో చిక్కుకుని ఔట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ అరంగేట్ర స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో లెగ్‌ స్లిప్‌ ఫీల్డర్‌ను పెట్టుకుని మరి రోహిత్‌కు బౌలింగ్‌ చేశాడు.

Sachin Tendulkar: వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతున్న అభిమానిని పిలిచి సర్ ప్రైజ్ చేసిన సచిన్, తమ దేవుడిని రోడ్డు మీద చూడగానే అ అభిమాని రియాక్షన్ ఏంటంటే..

Hazarath Reddy

సచిన్ టెండూల్కర్ ఎక్స్ ద్వారా ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. 'సచిన్ ఇవాళ టెండూల్కర్ ను కలిశాడు' అంటూ తన పోస్టుకు హెడ్డింగ్ పెట్టారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... సచిన్ కారులో వెళుతుండగా, టెండూల్కర్ అనే పేరుతో ఉన్న నెం.10 ముంబయి ఇండియన్స్ జెర్సీని ధరించి బైక్ పై అదే రూట్లో ఓ వ్యక్తి వెళ్లడం చూడొచ్చు.

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ, అగ్రస్థానంలో కొనసాగుతున్న కేన్ విలియమ్సన్, బౌలింగ్ ర్యాంకుల్లో నెంబర్ వన్ గా అశ్విన్

Hazarath Reddy

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాటింగ్ ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.

India vs England 2nd Test: భారత్‌తో రెండవ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదిగో, గాయపడిన స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో షోయబ్ బషీర్

Hazarath Reddy

ఇంగ్లండ్ 2వ టెస్టుకు తమ జట్టును ప్రకటించింది . మోకాలి సమస్యల కారణంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. మొదటి టెస్టులో ఓడిపోయిన తర్వాత, ఫిబ్రవరి 2న రెండో ఎన్‌కౌంటర్ ప్రారంభంకానుండగా, రోహిత్ శర్మ సేన విశాఖపట్నంలో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది.

Advertisement

Jay Shah Re-Elected As ACC President: ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా మళ్లీ హోమంత్రి అమిత్ షా కొడుకు, వరుసగా మూడోసారి ఏసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న జే షా

Hazarath Reddy

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) సెక్రటరీ జే షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) ఛైర్మన్‌గా మళ్లీ నియమితులయ్యారు, ఐసిసి చీఫ్ పదవికి పోటీ చేయడానికి అతను పదవి నుండి వైదొలిగినట్లు వచ్చిన పుకార్లకు స్వస్తి పలికారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు 35 ఏళ్ల ఆయన వరుసగా మూడోసారి ఏసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

T20 World Cup 2021, NZ vs AFG: భారత్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్గనిస్థాన్‌, సెమీఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్‌, టీమిండియాకు తప్పని ఇంటిదారి..

sajaya

నేటి మ్యాచ్‌లో కనుక ఆఫ్ఘనిస్థాన్ గెలిచి ఉంటే భారత సెమీస్ అవకాశం ఉండేది. కానీ విలియమ్సన్ సేన ఆల్‌రౌండర్ ప్రతిభతో అదరగొట్టడంతో కోహ్లీ సేన ఆశలు అడుగంటిపోయాయి.

Sarfaraz Khan in India’s Squad: టీమిండియాకు ఎంపిక అయిన సర్ఫరాజ్ ఖాన్, సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్‌ అంటూ అభినందనలు తెలిపిన సూర్యకుమార్ యాదవ్

Hazarath Reddy

గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ కు భారత జట్టులోకి ఎంట్రీ లభించింది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండు టెస్టుకు సర్ఫరాజ్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వైజాగ్‌ టెస్టుకు కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా దూరం కావడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Dean Elgar on Virat Kohli: విరాట్ కోహ్లీ నాపై ఉమ్మేశాడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డీన్‌ ఎల్గర్‌ సంచలన వ్యాఖ్యలు, ఆ తర్వాత మందు తాగుతూ సారీ చెప్పాడని వెల్లడి

Hazarath Reddy

2015లో ప్రొటీస్‌.. భారత పర్యటనలో మొహాలీలో జరిగిన తొలి టెస్టులో విరాట్‌ కోహ్లి తనపై ఉమ్మివేసాడని (Virat Kohli Spat on Me) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డీన్‌ ఎల్గర్‌ షాకింగ్‌ సంఘటనను పంచుకున్నాడు.

Advertisement

Ben Duckett Dismissal Video: వీడియో ఇదిగో, కంట్రోల్ కోల్పోయిన బుమ్రా చేతిలో బలైన డకెట్, టీమిండియా పేసర్ ఇన్ స్వింగ్‌ దెబ్బకు క్లీన్ బౌల్డ్ అయిన ఇంగ్లండ్ బ్యాటర్

Hazarath Reddy

టీమిండియా స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా ఎప్పుడూ కూల్​ గా ఉంటాడనేది తెలిసిందే. అయితే ఇంగ్లండ్​తో​ జరుగుతున్న తొలి టెస్ట్​లో బుమ్రా కీపర్ కేఎస్ భరతపై కోపాన్ని ప్రత్యర్థి జట్టు బ్యాటర్ మీద చూపించాడు.బుమ్రా కోపానికి బెన్ డకెట్ (47) బలయ్యాడు.

Trent Boult Catch Video: ఇదేమి క్యాచ్ బాబోయ్, వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్ అందుకున్న ట్రెంట్ బౌల్ట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా ఎంఐ ఎమిరేట్స్‌, అబుదాబి నైట్ రైడర్స్‌ మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. అబుదాబి ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన ఫజల్హాక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఎవాన్స్‌ లాంగ్‌ ఆఫ్‌ మీదగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు

ICC Reprimands Bumrah: ఇంగ్లండ్ బ్యాటర్ ఆలీ పోప్‌తో అనుచిత ప్రవర్తన, భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను మందలించిన ఐసీసీ

Hazarath Reddy

హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు జరిగిన ఘటనలో ఐసిసి ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ అధికారికంగా మందలించింది.

IND Vs ENG: ఉప్ప‌ల్ టెస్ట్ సూప‌ర్ హిట్, చాలా గ్యాప్ త‌ర్వాత జ‌రిగిన మ్యాచ్ కు భారీగా స్పంద‌న‌, ఫ‌స్ట్ టెస్టుకు ఏకంగా లక్ష‌మంది హాజ‌రు

VNS

నాలుగు రోజులలో మొత్తంగా లక్షకు మందికి పైగా ఈ మ్యాచ్‌ను స్టేడియం నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మధ్యకాలంలో భారత్‌ స్వదేశంలో ఆడిన టెస్టులకు ఇంతమంది హాజరవడం బహుశా ఇదే ప్రథమం. 2018 తర్వాత టెస్టులకు ఉప్పల్‌ స్టేడియం తొలిసారి ఆతిథ్యమిచ్చింది.

Advertisement

India vs England 1st Test: ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి, 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ విజయం, ఒకరోజు ముందుగానే తేలిన ఫలితం

sajaya

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Lionel Messi: ట్రాఫిక్ మధ్యలో అభిమాని జెర్సీపై సంతకం చేసిన లియోనెల్ మెస్సీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

లియోనెల్ మెస్సీకి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అక్కడ అతను తన కారులో కూర్చొని ట్రాఫిక్ మధ్యలో రోడ్డుపై అర్జెంటీనా అభిమాని జెర్సీపై సంతకం చేయడం చూడవచ్చు. వీడియోలో, అభిమానులు మెస్సీకి జెర్సీని అందజేయడాన్ని చూడవచ్చు,

Ben Stokes Dismissal Video: వీడియో ఇదిగో, బుమ్రా మ్యాజిక్ స్వింగ్ దెబ్బకి క్లీన్ బౌల్డ్ అయిన బెన్‌ స్టోక్స్‌, ఏమి బాల్‌ వేశావు బ్రో అంటూ బిత్తరపోయిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌

Hazarath Reddy

ఉప్పల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన బంతితో మెరిశాడు. సంచలన బంతితో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌65 ఓవర్‌లో బుమ్రా వేసిన మూడో బంతిని స్టోక్స్‌.. ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి వికెట్లను వదిలేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.

IND vs ENG 1st Test 2024: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ జెర్సీతో రోహిత్ శర్మ పాదాలను తాకిన అభిమాని, ఇండియా vs ఇంగ్లండ్ 1వ టెస్ట్ సందర్భంగా ఘటన

Hazarath Reddy

2024లో జరిగిన ఇండియా vs ఇంగ్లండ్ 1వ టెస్ట్ 1వ రోజు సందర్భంగా విరాట్ కోహ్లీ జెర్సీని ధరించిన అభిమాని పిచ్‌ లోకి దూసుకువచ్చి రోహిత్ శర్మ పాదాలను తాకాడు. వైరల్‌గా మారిన వీడియోలో, ఆ అభిమాని రెండవ సమయంలో భారత కెప్టెన్ పాదాలను తాకినట్లు కనిపించింది

Advertisement

Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర, 4వ సారి ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్న టీమిండియా స్టార్, ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు గెలుచుకున్నది కూడా కోహ్లీనే..

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్నాడు. యాభై ఓవర్ల క్రికెట్‌లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది. విరాట్‌ కోహ్లి ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి

Mary Kom on Retirment: రిటైర్మెంట్ వార్త‌లపై స్పందించిన‌ మేరి కోమ్, తప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆవేద‌న‌, ఇంత‌కీ రూమ‌ర్ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందంటే?

VNS

నా మాట‌ల్ని మీరు మ‌రోలా అర్థం చేసుకున్నారు. ఒక‌వేళ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాలి అనుకున్న‌ప్పుడు క‌చ్చితంగా మీడియా ముందుకు వ‌చ్చి నా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాను’ అని గురువారం వివ‌ర‌ణ ఇచ్చింది. ‘బుధ‌వారం నేను ఒక స్కూల్ ఫంక్ష‌న్‌కు వెళ్లాను. అక్క‌డ వాళ్ల‌లో స్ఫూర్తి నింపాల‌నే ఉద్దేశంతో నాకు ఇంకా ఆట‌లో చాలా సాధించాల‌ని ఉంది

BCCI Awards 2024 Winners: బీసీసీఐ అత్యుత్తమ ఆటగాళ్లుగా అవార్డు అందుకున్న శుభమాన్ గిల్, దీప్తి శర్మ...రవిశాస్త్రికి జీవితకాల సాఫల్య పురస్కారం

sajaya

మంగళవారం హైదరాబాద్‌లో బీసీసీఐ వార్షిక అవార్డుల పంపిణీ జరిగింది. 2019 తర్వాత తొలిసారిగా బోర్డు ఆటగాళ్లకు అవార్డులు అందజేసింది. 2023 సంవత్సరానికి భారత అత్యుత్తమ ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. మహ్మద్ షమీకి 2019-20కి, రవిచంద్రన్ అశ్విన్‌కి 2020-21కి, జస్ప్రీత్ బుమ్రాకి 2021-22కి ఈ అవార్డు లభించింది.

ICC T20I Team of the Year 2023: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఔట్, ఐసీసీ 2023 అత్యుత్తమ టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, భారత్ నుంచి అయిదుగురికి చోటు

Hazarath Reddy

2023 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు చోటు దక్కలేదు

Advertisement
Advertisement