Cricket

Ravi Ashwin Covid: విమానం ఎక్కని రవిచంద్రన్ అశ్విన్, కరోనా పాజిటివ్‌తో హోం క్వారంటైన్‌లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్

Hazarath Reddy

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 ఐదవ టెస్టు మ్యాచ్ కోసం యూకేకు రవిచంద్రన్ విమానం ఎక్కలేదు

India, South Africa T20I Series: సౌతాఫ్రికాతో ఐదో టీ-20 మ్యాచ్ వర్షార్పణం, 2-2 తో సిరీస్ సమం, సమవుజ్జీలుగా నిలిచిన భారత్- సౌతాఫ్రికా

Naresh. VNS

వాన (Rain) కారణంగా మ్యాచ్‌ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. ఐదు టీ20ల సిరీస్ 2-2తో సమం అయింది. టాస్‌ (Toss)పడిన కాసేపటికే ప్రారంభమైన వర్షం మ్యాచ్‌ను ఆలస్యం చేసింది. దీంతో ఆటను 19 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గిన తర్వాత భారత ఓపెనర్లు బ్యాటింగ్‌కు దిగారు.

India vs South Africa, 4th T-20: వరుసగా రెండో మ్యాచ్ గెలిచిన భారత్, సిరీస్‌ పై ఆశలు సజీవం, ముంబై టీ-20లో ఘన విజయం సాధించిన టీమిండియా, కీలకంగా మారనున్న లాస్ట్ మ్యాచ్

Naresh. VNS

సౌతాఫ్రికాతో నాలుగో టీ 20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండో విజయం సాధించి సిరీస్‌ రేసులో నిలబడింది. ఐదు టీ20ల సిరీస్‌ను భారత్‌ 2-2తో సమం చేసింది. శుక్రవారం రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

India vs Ireland T20I: టీమ్‌ఇండియా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా, ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, 17 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ

Hazarath Reddy

భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బీసీసీఐ బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన ప్లేయర్లనే దాదాపుగా కొనసాగిస్తూ కొన్ని మార్పులు చేసింది.

Advertisement

ENG vs NZ, 2nd Test 2022: టెస్టుల్లో ఇదేమి బాదుడు సామి, కేవలం 75 ఓవర్లలోనే 300 పరుగులు, టెస్టు క్రికెట్‌లో నయా రికార్డు సృష్టించిన జానీ బెయిర్ స్టో, కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్

Hazarath Reddy

ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ అద్భుతం చేసింది. ఆ జట్టు ఆటగాడు జానీ బెయిర్ స్టో (92 బంతుల్లో 136.. 14 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ కు రెండో టెస్టులో విజయంతో పాటు సిరీస్ ను కూడా సాధించిపెట్టాడు.

IND vs SA 3rd T20I: దక్షిణాఫ్రికా వరుస విజయాలకు బ్రేక్, మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం, 48 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా విక్టరీ

Hazarath Reddy

దక్షిణాఫ్రికా వరుస విజయాలకు భారత్‌ బ్రేక్‌ వేసింది. సిరీస్‌లో గెలిస్తేనే నిలువాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో రిషబ్‌పంత్‌ నేతృత్వంలోని భారత్‌ సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 48 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.

IND vs SA 2nd T20: తీరు మారని టీమిండియా, రెండో టీ-20లోనూ ఓటమి, ఆల్‌ రౌండ్ ఫర్మామెన్స్‌తో అదరగొట్టిన డేవిడ్ మిల్లర్, 2-0 తో ఆధిక్యంతో సఫారీలు

Naresh. VNS

భారత్ తీరు మారలేదు. మరో ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికాతో (South Africa) రెండో టీ20లోనూ టీమిండియా (Team India) పరాజయం పాలైంది. కటక్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో సఫారీలు అదరగొట్టారు. 4 వికెట్లతో గెలుపొందారు. తొలి టీ20లో టీమిండియా పాలిట డేవిడ్ మిల్లర్ (Miller), వాన్ డర్ డుసెన్ విలన్లలా పరిణమిస్తే, ఈసారి ఆ పాత్రను వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ పోషించాడు.

Aiden Markram: దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం, స్టార్‌ బ్యాటర్‌ ఐడెన్ మార్క్రమ్‌ కు కోవిడ్

Hazarath Reddy

భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ ఐడెన్ మార్క్రమ్‌ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలలో మార్క్రమ్‌ కు పాజిటివ్‌గా నిర్థరాణైంది. దీంతో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు మార్క్రమ్‌ దూరమయ్యాడు.

Advertisement

Kane Williamson: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌కు క‌రోనా, ఇంగ్లండ్‌తో జ‌ర‌గాల్సిన రెండ‌వ టెస్టుకు కేన్ దూరం

Hazarath Reddy

భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టులో.. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ ఐడెన్ మార్క్రమ్‌ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలలో మార్క్రమ్‌ కు పాజిటివ్‌గా నిర్థరాణైంది. దీంతో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు మార్క్రమ్‌ దూరమయ్యాడు.

IND v SA, 1st T20I 2022: తొలి‌మ్యాచ్ లోనే బోల్తా పడిన టీం ఇండియా, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా

Hazarath Reddy

ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. స్టార్‌ క్రికెటర్ల గైర్హాజరీ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తమ గెలుపు జోరును కొనసాగించలేకపోయింది. గురువారం ఆఖరి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Mithali Raj Announces Retirement: అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్ బై చెప్పిన మిథాలీ రాజ్, అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

Hazarath Reddy

భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు బుధవారం (జూన్ 8) రిటైర్మెంట్ ప్రకటించింది. మిథాలీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన సందేశంలో, "ఈ రోజు నేను అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్న రోజు" అని రాసింది.

APL 2022: జూలై 6 నుంచి 17 వరకు ఏపీఎల్ 2022, విశాఖ YSR స్టేడియంలో జూలై 17న ఫైనల్, సీఎం జగన్‌ను ఆహ్వానించిన ఏసీఏ బృందం

Hazarath Reddy

జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ టోర్నమెంట్‌ను ఏసీఏ నిర్వహించనుంది. జూలై 17న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ను ఏసీఏ బృందం ఆహ్వానించింది.

Advertisement

Ben McDermott Blast: ఇదేమి బాదుడు సామి, 30 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లుతో 83 పరుగులు, తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ఆటగాడు మెక్‌డెర్మాట్

Hazarath Reddy

ఆస్ట్రేలియా ఆటగాడు మెక్‌డెర్మాట్ మిడిల్‌సెక్స్‌పై బ్యాట్‌తో సరికొత్త తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. జూన్ 7న జరిగిన మ్యాచ్‌లో, ముందుగా బ్యాటింగ్ చేసిన మిడిల్‌సెక్స్ హాంప్‌షైర్ ముందు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ మెక్‌డెర్మాట్ బ్యాటింగ్ దెబ్బకు, లక్ష్యం చాలా చిన్నదైంది.

Ind vs SA 3rd T20I: వైజాగ్ అంటే మాములుగా ఉండదు, హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టీమిండియా- దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ టికెట్లు, నేటి నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయం

Hazarath Reddy

టీమిండియా- దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌కు విశాఖపట్నంలోని వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల(జూన్‌) 14న జరుగనున్న మ్యాచ్‌ కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయానికి పెట్టగా హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి.

Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్, 20 కోట్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్న తొలి భార‌తీయుడిగా ఘనత, ఇన్‌స్టా స‌పోర్ట‌ర్ల‌కు థ్యాంక్స్ చెప్పిన మాజీ కెప్టెన్

Hazarath Reddy

సోష‌ల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 20 కోట్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్న తొలి భార‌తీయుడిగా ఘ‌న‌త సాధించాడు. క్రీడారంగానికి చెందిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు లియోన‌ల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డోలు మాత్ర‌మే కోహ్లీ క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఫాలోవ‌ర్లు క‌లిగి ఉన్నారు.

Dhruv Jurel Catch Video: నేను క్యాచ్ పట్టానా అంటూ షాకయిన వికెట్ కీపర్, స్టన్నింగ్ క్యాచ్ చూసి ఆశ్చర్యపోయిన క్రికెట్ ప్రేమికులు, మీరు కూడా వీడియో చూసేయండి

Hazarath Reddy

బ్యాట్స్మన్ ముందుకెళ్లడంతో స్టంప్ ఔట్ చేయాలన్న మూమెంట్‌లో కీపర్ ఉన్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ద్రువ్ జురేల్ తన గ్లోవ్స్‌ని పైకి లేపడంతో, బంతి చేతికి చిక్కింది. ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్ళు మాత్రమే కాదూ.. స్వయంగా కీపర్ కూడా ఆశ్చర్యపోయాడు.

Advertisement

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో సంచలనం, ఇన్‌స్టా‌గ్రాంలో 200 మిలియన్ల పాలోవర్స్‌ని సొంతం చేసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్

Hazarath Reddy

విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. సోషల్ మీడియాలో అత్యధిక పాలోవర్లతో దూసుకుపోతున్న దిగ్గజం, మాజీ ఇండియా కెప్టెన్ ఇన్‌స్టా‌గ్రాంలో 200 మిలియన్ల పాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు. దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఓ వీడియోను తన ఖాతాలో పోస్ట్ చేశాడు.

Deepak Chahar Wedding Pics: దీపక్‌ చహర్‌ పెళ్ళి ఫోటోలు వైరల్, చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్‌ఫ్రెండ్‌ జయా భరద్వాజ్‌ను పెళ్లాడిన టీమిండియా క్రికెటర్‌

Hazarath Reddy

టీమిండియా క్రికెటర్‌ దీపక్‌ చహర్‌ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్‌ఫ్రెండ్‌ జయా భరద్వాజ్‌ను కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మనువాడాడు. ఆగ్రాలోని జైపీ ప్యాలెస్‌లో బుధవారం అర్థరాత్రి దాటిన వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Mondli Khumalo: దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై UKలో దాడి, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు

Hazarath Reddy

సౌతాఫ్రికా క్రికెటర్‌ మొండ్లీ ఖుమాలోపై గుర్తు తెలియని వ్యక్తులు UKలో దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరొక రోజు గడిస్తే కానీ ఖుమాలో పరిస్థితి చెప్పలేమన్నారు.

IPL 2022 Winner: తొలి సీజన్‌లోనే కప్పు కొట్టిన గుజరాత్, ఆల్‌ రౌండర్‌గా ప్రతిభ చాటిన హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ ఫైనల్‌లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం, చాహల్ ఖాతాలో అరుదైన రికార్డు

Naresh. VNS

ఐపీఎల్‌లో (IPL)కెప్టెన్‌గా అడుగు పెట్టడమే తనేంటో నిరూపించుకున్నాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya). జట్టును ముందుండి నడిపిస్తూ అందరి కన్నా ముందే ప్లేఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత తొలి క్వాలిఫైయర్‌లో అద్భుతమైన ఆటతీరుతో.. ఫైనల్ చేర్చాడు. చివరి మ్యాచ్‌లో కూడా బంతితో, బ్యాటుతో రాణించి జట్టుకు తొలి సీజన్‌లోనే ఐపీఎల్ టైటిల్ (IPL Title)అందించాడు.

Advertisement
Advertisement