క్రికెట్
IPL 2020: బౌల్ట్‌ బౌలింగ్ దెబ్బ..వికెట్ రెండు ముక్కలైంది, ప్రాక్టీస్ సెషన్‌లో అదరరగొడుతున్న న్యూజీలాండ్ బౌలర్, లసిత్ మలింగ స్థానంలో ముంబై జట్టుకు ఎంపిక
Hazarath Reddyన్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (Trent Boult) ఐపీఎల్‌లో ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్ లో బాల్ తో నిప్పులు చెరుగుతున్నాడు. లసిత్‌ మలింగ స్థానంలోకి ముంబై జట్టులో చేరిన ఈ ఫాస్ట్ బౌలర్ లసిత్‌ మలింగ లేని లోటును తీర్చేందుకు రెడీ అయ్యాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో (Mumbai Indians Training Session) వికెట్లను విరగొట్టేస్తున్న బౌల్ట్‌.. తాను ఫామ్‌లోనే ఉన్నా అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లకు కాచుకోమంటూ సవాల్ విసురుతున్నాడు.
IPL 2020 Schedule Announced: సెప్టెంబర్ 19 నుంచి నవంబర్‌ 3 వరకు ఐపీఎల్‌ 13, ముంబై వర్సెస్ చెన్నై మధ్య తొలి మ్యాచ్‌, సెప్టెంబర్ 21న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్
Hazarath Reddyఎన్నో తర్జనభర్జనల అనంతరం ఐపీఎల్‌ 2020 వేడుక ప్రారంభానికి ముహూర్తం (IPL 2020 Schedule Announced) కుదిరింది. ఐపీఎల్‌ 13వ సీజన్ షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ తాజా సీజన్‌ నవంబర్‌ 3 వరకు కొనసాగుతుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్‌ 2020లో (Indian Premier League 2020) సెప్టెంబర్‌ 19న ముంబై వర్సెస్ చెన్నై మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది.
IPL 2020 Update: కారణమదేనా..రైనా ఐపీఎల్ నుంచి అర్థాంతరంగా ఎందుకు తప్పుకున్నారు? రైనాకు ఎప్పుడైనా అండగా నిలుస్తామని తెలిపిన సీఎస్‌కే యజమాని ఎన్‌. శ్రీనివాసన్‌
Hazarath Reddyఐపీఎల్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో సురేశ్‌ రైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) యజమాని ఎన్‌. శ్రీనివాసన్‌ 24 గంటల్లోపే తన మాటలను మార్చుకున్నారు. రైనా గురించి తాను చెప్పిన మాటలను వక్రీకరించారని, అతనికి ఎప్పుడైనా అండగా నిలుస్తామని చెప్పారు. ‘ఇన్నేళ్లుగా చెన్నై జట్టుకు (Chennai Super Kings) రైనా చేసిన సేవలు అసమానం. నేను చేసిన వేర్వేరు వ్యాఖ్యలను ఒక చోట జోడించి కొందరు తప్పుగా ప్రచారం చేశారు. సురేష్ రైనా ( Suresh Raina) మానసిక పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని అతనికి మనం అండగా నిలవాలని, మా ఫ్రాంచైజీ ఎప్పుడైనా అతనికి తోడుగా ఉంటుందని తెలిపారు.
IPL 2020: క్వారంటైన్‌లో ధోనీ సేన, చైన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ దీపక్‌ చహర్‌కు కరోనా పాజిటివ్, సెప్టెంబర్‌ మొదటి వారంలో నెట్స్‌కు వెళ్లే అవకాశం
Hazarath Reddyచెన్నై సూపర్‌కింగ్స్‌ను (Chennai Super Kings) కరోనావైరస్ మహమ్మారి చుట్టేసింది. చెన్నై సహాయక బృంద సభ్యులతో పాటు భారత ఆటగాడు దీపక్‌ చహర్‌కు కరోనా సోకడం ఇప్పుడు ఆ జట్టులో కలకలం రేపుతోంది. దీంతో ఆటగాళ్లంతా క్వారంటైన్‌ లోకి (Quarantine) వెళ్లిపోయారు. చెన్నై కోవిడ్‌ కేసులపై బయటకు తెలిసిపోయినా సదరు ఫ్రాంచైజీ మాత్రం మొదట నోరే మెదపలేదు. అధికారికంగా ఎంతమంది మహమ్మారి బారిన పడ్డారో తెలియడంలేదు. అనధికార వర్గాల సమాచారం మేరకు 12 మంది కోవిడ్‌ పాజిటివ్‌ (12 CSK Squad Members Test Positive) బాధితులున్నట్లు తెలిసింది.
IPL 2020 Sponsorship Deal: డ్రీమ్‌ 11 కంపెనీకి ఐపీఎల్ 13వ సీజన్‌ హక్కులు, రూ.222కోట్లతో బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న డ్రీమ్‌ 11, నాలుగు నెలల 13 రోజుల పాటు ఐపీఎల్ 13 స్పాన్సర్‌ గా కొనసాగనున్న కంపెనీ
Hazarath Reddyఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌కు సంబంధించిన హక్కులను (IPL 2020 Sponsorship Deal) 250 కోట్ల రూపాయలకు డ్రీమ్‌ 11 కంపెనీ (Dream11) దక్కించుకుంది..ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ 11 ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ (IPL 2020 Sponsorship) హక్కుల కోసం రూ.222కోట్లతో బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నది. డ్రీమ్‌ 11 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ హక్కులను దక్కించుకుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు. డ్రీమ్‌ 11 నాలుగు నెలల 13 రోజుల పాటు ఐపీఎల్ 13 స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ప‌తంజ‌లి, అడిడాస్‌, జియో క‌మ్యూనికేష‌న్స్‌, అన్అకాడ‌మీ, టాటా గ్రూప్‌ తదితర దిగ్గజ కంపెనీలు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం పోటీపడ్డాయి.
MS Dhoni Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు ఎం.ఎస్ ధోనీ వీడ్కోలు, అభిమానుల ప్రేమకు ధన్యవాదాలంటూ సంక్షిప్త సందేశం, ఐపీఎల్‌లోనైనా ఆడతాడా, లేదా? అని అభిమానుల్లో ఉత్కంఠ
Team Latestlyభారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆగష్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం రోజున సంచలన ప్రకటన చేశారు. తాను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్....
IPL 2020 Sponsor: ఐపీఎల్-2020 స్పాన్సర్‌షిప్, రేసులో బాబా రాందేవ్ పతంజలి గ్రూపు, బిడ్డింగ్‌లో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపిన సంస్థ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా
Hazarath Reddyఐపీఎల్-2020 స్పాన్సర్‌షిప్ నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో తప్పుకున్న నేపథ్యంలో రేసులోకి యోగా గురువు బాబా రాందేవ్‌కు (Baba Ramdev) చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి (Patanjali Ayurved) వచ్చింది. తన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చే వ్యూహంలో పంతాంజలి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ (IPL 2020 Sponsor) కోసం ప్రయత్నిస్తోంది. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామంటూ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా ధృవీకరించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని చెప్పారు.
IPL 2020 Dates Announced: యూఏఈలో ఐపీఎల్ 13, సెప్టెంబర్‌ 19నుంచి ప్రారంభం, ఈ ఏడాది ఐపీఎల్ రద్దు చేస్తే రూ. 4 వేల కోట్ల నష్టం, మరిన్ని వివరాలు కథనంలో..
Hazarath Reddyక్రికెట్‌ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌పై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) షెడ్యూల్‌పై స్పష్టత (IPL 2020 Dates Announced) వచ్చింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) వేదికగా సెప్టెంబర్‌ 19న లీగ్‌ ఆరంభంకానుందని (Scheduled to Begin on September 19 in UAE) నవంబర్‌ 8న ఫైనల్‌తో టోర్నీ ముగియనుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌బ్రిజేష్‌‌ పటేల్‌ (Brijesh Patel) శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. ఈసారి పూర్తిస్థాయి టోర్నమెంట్‌ను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
ICC T20 World Cup 2020: ఈ ఏడాది జరగాల్సిన టీ20 క్రికెట్ ప్రపంచ కప్ వాయిదా, అధికారికంగా ప్రకటించిన ఐసీసీ, ఐపీఎల్ 2020 నిర్వహణకు లైన్ క్లియర్
Team Latestlyఅదే సమయంలో ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్ చేయబడి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ పై కొంత అస్పష్టత నెలకొని ఉంది, ప్రస్తుతం ప్రపంచకప్ వాయిదా పడటంతో బీసీసీఐ ముందు ఉన్న ఒక అడ్డు తొలగిపోయినట్లయింది. ఐపీఎల్ వేదికకు తొలి ప్రాధాన్యం...
IPL 2020: యూఎఈలో ఐపీఎల్ 2020! అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో బీసీసీఐ నిర్ణయం, భారత ప్రభుత్వం అనుమతిస్తేనే అడుగు ముందుకు
Team Latestlyఐపీఎల్ 2020 టోర్నమెంట్ నిర్వహించడం తమ ప్రథమ ప్రాధాన్యత అని ఇప్పటికే బిసిసిఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిసిసిఐ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ 2020 నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. భారతదేశంలో నిర్వహణ సాధ్యం కాకపోతే విదేశాల్లోనైనా నిర్వహించాలని ఆయన దృఢ నిశ్చయం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో కొవిడ్ తీవ్రత తక్కువగా ఉన్న యూఎఈ
Ganguly In Home Quarantine: సౌరవ్‌ గంగూలీ సోదరునికి కరోనా, హోం ఐసోలేషన్‌కి వెళ్లిన దాదా, బెల్లెవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగూలీ సోదరుడు స్నేహాశీష్‌
Hazarath Reddyభారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్వీయ నిర్బంధంలోకి (Ganguly In Home Quarantine) వెళ్లాడు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) సంయుక్త కార్యదర్శి, గంగూలీకి సోదరుడైన స్నేహాశీష్‌ గంగూలీ (Snehasish Ganguly) బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో దాదా కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నాడు. బెంగాల్‌ మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ అయిన స్నేహాశీష్‌ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు క్యాబ్‌ అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియా తెలిపారు.
Asia Cup 2020 postponed: ఆసియా కప్‌ 2021కి వాయిదా, వచ్చే ఏడాది శ్రీలంకలో నిర్వహించే అవకాశం
Hazarath Reddyకరోనా కారణంగా ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్‌ను వచ్చే ఏడాది 2021కు వాయిదా వేస్తున్నట్లు (Asia Cup 2020 postponed) ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) ప్రకటించింది. ఆసియా ఖండంలో కోవిడ్‌–19 (COVID-19) తీవ్రత పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేసింది. ‘అన్ని రకాల పరిస్థితులను అంచనా వేసిన తర్వాత సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను వాయిదా వేయడమే మంచిదని ఏసీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు భావించింది.
1983 World Cup Memories: అంచనాలు లేకుండానే విశ్వవిజేత, భారత్ తొలి ప్రపంచకప్ సాధించి నేటితో 37 ఏళ్లు, ఈ తీపి గుర్తులపై స్పెషల్ స్టోరీ
Hazarath Reddyహాకీతో దూసుకుపోతున్న భారత్ ప్రజానీకాన్ని క్రికెట్ బాట పట్టించిన రోజు నేడు. ప్రపంచ యవనికపై ప్రపంచ కప్ ను (1983 Cricket World Cup) అందుకుని నేటికి 37 ఏళ్లు. ఎటువంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన భారత్ మహామహులను మట్టి కరిపించి విశ్వ విజేతగా (1983 World Cup) మారిన రోజు నేడు. ఆర వీర భయంకరులను ఓడించి క్రికెట్‌కు పుట్టినిల్లయిన లార్డ్స్‌లో సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత జట్టు అందించిన మధురస్మృతులు నాలుగు దశాబ్దాలు దాటినా ఇంకా అభిమానుల గుండెల్లో అలాగే ఉన్నాయి.
IPL 2020: విదేశాల్లో ఐపీఎల్ 2020, కరోనా నేపథ్యంలో ఆలోచన చేస్తోన్నబీసీసీఐ, త్వరలో స్పష్టత వచ్చే అవకాశం
Hazarath Reddyకరోనావైరస్ లాక్‌డౌన్‌ కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)-2020 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అనేక దేశాలు లాక్‌డౌన్‌ (Lockdown) సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో క్రికెట్‌ (Cricket) కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇంగ్లండ్‌, శ్రీలంక వంటి దేశాలు ఇప్పటికే శిక్షణ శిబిరాలు ప్రారంభించాయి. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ (IPL 2020) ను విదేశాల్లో నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
Shoaib Akhtar on Brett Lee: బ్రెట్ లీకి బ్యాటింగ్ అంటే చచ్చేంత భయం, తను చాలా నిజాయితీగా ఉండేవారు. బ్రెట్‌లీ వీడియోని షేర్ చేసి అనుభవాలు పంచుకున్న షోయ‌బ్ అక్త‌ర్
Hazarath Reddyక్రికెట్ మీద అవగాహన ఉన్నవారికి బ్రెట్ లీ, షోయ‌బ్ అక్త‌ర్ (Shoaib Akhtar and Brett Lee)పేర్లను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారి వారి జనరేషన్లలో ఇద్దరూ నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్లను హడలెత్తించారు. గంట‌కు 160 కిలోమీట‌ర్ల వేగంతో బంతులు విసిరే ప్ర‌త్యేక‌త వీరికి మాత్ర‌మే ఉండేది. అయితే బ్యాటింగ్ విషయం వచ్చేసరికి ఇద్దరికీ వణుకుపుట్టేది. ఈ విషయాలను పాక్ మాజీ పేసర్ షోయ‌బ్ అక్త‌ర్ చెప్పుకొచ్చారు.
IPL 2020: కరోనావైరస్ ఔట్ స్వింగర్.. ఐపీఎల్ 2020 క్లీన్ బౌల్డ్. టోర్నమెంట్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
Team Latestlyఐపీఎల్-2020 టోర్నమెంట్ గనక రద్దయితే బీసీసీఐ సుమారు రూ.3800 కోట్లు నష్టపోనుందని అంచనా. ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ షెడ్యూల్ చేయబడి ఉంది. ఒకవేళ ఆ టోర్నమెంట్ ను గనక వాయిదా వేస్తే ఆ సమయంలో .....
IPL 2020 Update: కరోనావైరస్ ప్రభావం.. ఐపీఎల్ వాయిదా! మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ 2020 ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన బీసీసీఐ
Vikas Mandaఅందరూ అనుమానిస్తున్నట్లుగానే ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ సీజన్ 2020 వాయిదా పడింది. COVID-19 మహమ్మారి నేపథ్యంలో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 టోర్నమెంట్ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది......
ICC Women's T20 World Cup 2020 Final: తడబడిన ఇండియా, మరోసారి చాంఫియన్‌గా అవతరించిన ఆస్ట్రేలియా, మొత్తం 5 సార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు
Hazarath Reddyఇండియా తడబడింది. చాంపియన్‌ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహిళా క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో అభిమానులు హాజరైన ప్రపంచకప్‌-2020 తుది సమరంలో ఆస్ట్రేలియా జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది.
ICC Women's T20 World Cup: ప్రపంచ కప్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో, ఫైనల్‌కి చేరిన భారత మహిళా జట్టు, వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ రద్దు, నేడు తేలిపోనున్న భారత్ ఫైనల్ ప్రత్యర్థి
Hazarath Reddyభారత్ మరో ప్రపంచకప్ సాధించేందుకు అడుగుదూరంలో నిలిచింది. మహిళల టి20 ప్రపంచ కప్‌ ( ICC Women's T20 World Cup) చరిత్రలో భారత జట్టు (India Team) తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్‌ వరకే పరిమితమైన భారత మహిళలు (India Women's National Cricket Team) ఈసారి మాత్రం తుది పోరుకు అర్హత సాధించారు.
David warner: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్, బాల్ ట్యాంపరింగ్‌లో 9 నెలలు పాటు నిషేధం ఎదుర్కున్న ఆస్ట్రేలియా దిగ్గజం, వార్నర్ నాయక్వంలో 2016లో ఐపీఎల్ ట్రోఫి కైవసం చేసుకున్న హైదరాబాద్
Hazarath Reddyమండు వేసవిలో, మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 (IPL 20200 సీజన్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ (Sunrisers Hyderabad) అనూహ్య నిర్ణయం తీసుకుంది. జట్టు సారథ్య బాధ్యతలను మరోసారి డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు (David warner) అప్పగిస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. దీంతో గత రెండు సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేన్ విలియమ్సన్ స్థానంలో వార్నర్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు.