క్రికెట్
Moeen Ali Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మొయిన్ అలీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ రికార్డు ఇదే..
Vikas Mఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు గాను సెలక్టర్లు అలీని పక్కనబెట్టిన కొద్దిరోజులకే అతడు ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
AFG vs NZ Test: న్యూజిలాండ్-అఫ్గనిస్థాన్ మధ్య టెస్ట్, ఒక్క బంతి కూడా పడకుండానే తొలి రోజు ఆట రద్దు
Vikas Mన్యూజిలాండ్(Newzealand), అఫ్గనిస్థాన్(Afghanistan) జట్ల మధ్య టెస్ట్ ఒక్క బంతి కూడా పడకుండానే తొలి రోజు ఆట రద్దయ్యింది. భారీ వర్షాల కారణంగా గ్రేటర్ నోయిడాలోని స్టేడియం తడిసిముద్దైంది. ఔట్ ఫీల్డ్ పూర్తిగా తడిగా ఉండడంతో అంపైర్లు టాస్ వేయకుండానే తొఒలి రోజు ఆటను రద్దు చేశారు
Sourav Ganguly on Rishabh Pant: భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు
Vikas Mటీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ను భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పరిగణిస్తున్నట్టు మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. పంత్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, అతడు టెస్టుల్లో భారత్‌కు ఆడుతూనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా రిషబ్ పంత్ ఎదగాలని గంగూలి అన్నాడు.
Andhra Cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవం, వరద బాధితులకు రూ. కోటి విరాళం
Arun Charagondaఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నికయ్యారు. తొలి నిర్ణయంగా వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లోని నైపుణ్యం గల ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం అని తెలిపారు చిన్ని.
IPL 2025: మళ్లీ ఐపీఎల్‌లోకి రాహుల్ ద్రావిడ్, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ద్రావిడ్
Arun Charagondaమిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ కోచ్ అవతారం ఎత్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఇటీవలె ద్రావిడ్ భారత హెడ్ కోచ్ పదవి కాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీతో ఒప్పందం చేసుకున్నారు ద్రావిడ్.
World Test Championship 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులోకి బంగ్లాదేశ్, ఆ మూడు టీంలకు సవాల్ విసిరేందుకు రెడీ అయిన డార్క్ హార్స్
Vikas Mపాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నెగ్గి చరిత్ర సృష్టించిన ‘డార్క్ హార్స్’ బంగ్లాదేశ్ అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లోకి దూసుకొచ్చింది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి విదితమే. ఈ రేసులో ఇండియా, ఆస్ట్రేలియాకు సవాలు విసిరేందుకు బంగ్లా సిద్దమైంది.
Ajay Ratra: బీసీసీఐ కొత్త సెలెక్టర్‌గా అజయ్ రాత్రా, సలీల్ అంకోలా స్థానాన్ని భర్తీ చేయనున్న అజయ్, కీలక విషయాన్ని వెల్లడించిన బీసీసీఐ
Vikas Mభారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త సెలెక్టర్‌గా అజయ్ రాత్రా(Ajay Ratra) ఎంపికయ్యాడు. ప్రస్తుతం సెలెక్టన్ ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన సలీల్ అంకోలా(Salil Ankola) స్థానాన్ని అజయ్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని మంగళవారం బీసీసీఐ (BCCI) వెల్లడించింది.
Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి
Vikas Mటెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో బంగ్లా విజయం నమోదు చేసింది. అయిదో రోజు టీ బ్రేక్‌కు ముందే.. బంగ్లా మ్యాచ్‌ను ముగించేసింది. స్వంత గడ్డపై దాయాది దేశానికి ఘోర పరాభవం ఎదురైంది.పాక్‌పై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి.
ICC World Test Championship 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీ వచ్చేసింది, తొలిసారి వేదిక కానున్న లార్డ్స్ మైదానం, పూర్తి వివరాలు ఇవే..
Vikas Mప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది.
Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024, భారత్ ఖాతాలో మరో పతకం, బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో రజత పతకం గెలుచుకున్న తులసిమతి మురుగేషన్
Vikas Mపారిస్ పారాలింపిక్స్ 2024లో సోమవారం, సెప్టెంబర్ 2న జరిగిన మహిళల సింగిల్స్ SU5 పారా-బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో తులసిమతి మురుగేషన్ ఫైనల్‌లో చైనాకు చెందిన యాంగ్ క్యూ జియా చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెలుచుకుంది.
Aarti Wins Bronze Medal: ప్రపంచ U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఆర్తీ, ఈ ఎడిషన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం
Vikas Mఆర్తి దుబాయ్‌లో జరిగిన ఆసియా U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 10,000 M రేసు నడక ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ U20 క్వాలిఫికేషన్ సమయాన్ని 49 నిమిషాలకు మెరుగుపరచడానికి ఆమె 47:45.33ని పూర్తి చేసింది.
Joe Root: రికార్డులను తిరగరాస్తున్న జో రూట్, ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డు, టెస్టు కెరీర్‌లో 33వ సెంచరీ నమోదు
Vikas Mఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) మరోసారి శతకంతో మెరిసాడు. తనకెంతో ఇష్టమైన లార్డ్స్ స్టేడియంలో శ్రీలంక(Srilanka) బౌలర్లను ఉతికేస్తూ 33వ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో బ్యాటర్‌గా రూట్ రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకులు విడుదల, అగ్రస్థానంలో కొనసాగుతున్న జో రూట్, 6, 7, 8 ర్యాంకుల్లో కొనసాగుతున్న టీమిండియా ప్లేయర్లు
Vikas Mఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 751 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ (740) ఒక స్థానం మెరుగుపరచుకుని ఏడో ర్యాంక్ దక్కించుకున్నాడు.
Dawid Malan Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్, ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి పెట్టనున్నట్లుగా వార్తలు
Vikas Mఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 2017లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం స్టార్, అత్యంత తక్కువ కాలంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెం. 1 స్థానం దక్కించుకున్నాడు. చాలా కాలంపాటు అగ్రస్థానంలో కొనసాగాడు. 2022లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలవడంలో మలన్ కీరోల్ పోషించాడు.
Zaheer Khan: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జహీర్ ఖాన్, ముంబైని వదిలేసిన టీమిండియా మాజీ పేసర్
Vikas Mలక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మెంటార్‌గా టీమిండియా మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ఎంపికైనట్లు ఆ ఫ్రాంచైజీ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక వీడియోను విడుదల చేసింది.
Shreyas Iyer Imitates Sunil Narine's Action: వీడియో ఇదిగో, సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించిన శ్రేయాస్ అయ్యర్, నవ్వులే నవ్వులు
Vikas Mఆగస్ట్ 27న బుచ్చి బాబు క్రికెట్ టోర్నమెంట్‌లో TNCA XI vs ముంబై మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ తన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహచరుడు సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తూ బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు, 89వ ఓవర్‌లో భారత బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయడానికి వచ్చారు.
Jay Shah ICC New Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా..డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జైషా.
sajayaభారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జై షాకు పెద్ద బాధ్యత లభించింది. ఆయన అత్యున్నత క్రికెట్ బాడీ అయిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ అయ్యాడు. మంగళవారం స్వతంత్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Carlos Brathwaite: హెల్మెట్‌ను సిక్సర్‌గా కొట్టిన వెస్టిండీస్ ఆటగాడు, అంపైర్ పై కోపంతో..వీడియో వైరల్!
Arun Charagondaకరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూయార్క్ స్ట్రైకర్స్ తో గ్రాండ్ కేమన్ జాగ్వార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ పై కోపంతో హెల్మెట్‌ను సిక్స్‌గా కొట్టాడు బ్రాత్ వైట్. న్యూజాగ్వార్ బౌలర్ జోష్ లిటిల్ బౌలింగ్ లో బ్రాత్ వైట్ భారీ షాట్ కు ప్రయత్నించగా ఆ బంతి భుజానికి తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లింది.
PAK vs BAN 1st Test 2024: పాకిస్తాన్‌కు స్వదేశంలో ఘోర పరాభవం, టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుచేసిన బంగ్లాదేశ్, 8 గంటలపాటు క్రీజులో నిలిచిన ముష్ఫికర్ రహీమ్
Hazarath Reddyబంగ్లాదేశ్ క్రికెట్ టీమ్.. పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి పెను సంచలనాన్ని నమోదు చేసింది. ఆదివారం ముగిసిన రావల్పిండి టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి పాకిస్థాన్‌పై తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది
Shikhar Dhawan Retirement: క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన 'గబ్బర్'.. ఎమోషనల్ వీడియో
Rudraటీమిండియా ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ ఫార్మెట్ ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ఈ ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.