రాష్ట్రీయం
KTR: కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపిన కేటీఆర్, డిచ్‌పల్లి బెటాలియన్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సమస్యను పరిష్కరించాలని వినతి
Arun Charagondaడిచ్ పల్లి బెటాలియన్ ముందు ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా వారి సమస్యను విన్నారు కేటీఆర్. అనంతరం బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు కేటీఆర్. సాధ్యమైనంత త్వరగా కానిస్టేబుళ్ల సమస్యలను తీర్చాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పారు.
Andhra Pradesh: ఒంగోలు బస్టాండ్‌లో దారుణం, ఓ మహిళను కర్రతో చితకబాదిన వ్యక్తి, అందరు చూస్తుండగానే ఘటన...షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaఒంగోలు లో దారుణం చోటు చేసుకుంది. ఒంగోలు బస్టాండ్‌లో మహిళను కర్రతో చావబాదాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగానే మహిళను చితక బాది, దుర్బాషాలాడుతు జుట్టుపట్టి లాగిపడేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Congress MLA Adluri Laxman: గంజాయి మత్తులో మర్డర్లు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో విలువ లేకుండాపోయిందన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, బూతులతో ఫైర్ అయిన ఎమ్మెల్యే..వీడియో ఇదిగో
Arun Charagondaజగిత్యాల కాంగ్రెస్ నేత హత్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ విప్ అడ్లూరి లక్ష్మణ్. గంజాయి తాగి మత్తులో మర్డర్లు చేస్తున్నారని బూతులతో విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో నాకు ఏం విలువ లేదు.. జగిత్యాల జిల్లా అధ్యక్షుడిని అయినా ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ పక్కన కూడా తిరగలేదు.. సీఎం రేవంత్ రెడ్డికి, సంజయ్ గురించి ఫిర్యాదు చేశానని చెప్పారు.
Tummala Nageshwarrao: రెండోరోజు మలేషియాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన, పామాయిల్ రిఫైనరీ ప్లాంట్‌ను పరిశీలించనున్న తుమ్మల
Arun Charagondaరెండో రోజు మలేషియాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సాగుతోంది. పహాంగ్ రాష్ట్రం జెరంటుట్ లో ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ .. అర్.అండ్ ఢీ సెంటర్ పరిశీలించనుంది మంత్రి తుమ్మల బృందం. కుయంటన్ పోర్ట్ లో పామాయిల్ రిఫైనరీ ప్లాంట్ పరిశీలించనున్నారు. తెలంగాణ లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ అధ్యయనం కోసం వ్యవసాయ హార్టికల్చర్ అధికారులతో కలసి మంత్రి తుమ్మల పర్యటన సాగుతోంది.
Telangana: కుక్కల దాడిలో 35 మేకల మృతి...రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఘటన, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడి ఆవేదన
Arun Charagondaరంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకరయ్య అనే వ్యక్తి 35 చిన్న మేక పిల్లలను 5 పెద్ద మేకలను మేకల దొడ్డిలో వదిలేసి మిగతా మేకలను మేపడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం సమయంలో 12 కుక్కలు మేకల దొడ్డిలో చొరబడి 30 మేక పిల్లలను 5 మేకలను కరిచి చంపేశాయి. ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితుడు.
Andhra Pradesh: ట్రాన్స్‌ఫార్మర్ పక్కన పార్కింగ్...చెలరేగిన మంటలు, దగ్దమైన మూడు బస్సులు...వీడియో ఇదిగో
Arun Charagondaవిజయనగరంలో జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ట్రాన్స్ ఫార్మర్ పక్కన పార్కింగ్ చేయగా కాలి బూడిదయ్యాయి బస్సులు. విజయనగరం రాజీవ్ స్టేడియం వద్ద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు పడటంతో మూడు బస్సులు దగ్దమయ్యాయి.
Ponnam Prabhakar: బీజేపీది అవకాశవాద రాజకీయం, నిరసనల పేరుతో ముసలి కన్నీరు కారుస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మూసి పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి
Arun Charagondaబీజేపీ మూసి సందర్శనకు పోయింది..ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి , పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా..మూసి ప్రజలకు సంబంధించిన సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వండి.. వారికి జరగాల్సిన న్యాయం గురించి చెప్పాలన్నారు.
Cyclone Dana Live Updates: తీవ్ర తుఫాన్‌గా బలపడిన దానా, తీరం దాటే సమయంలో 120 కిమీ వేగంతో ఈదురు గాలులు, 200 రైళ్లు రద్దు, 10 లక్షల మంది పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు
Arun Charagondaబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా బలపడింది దానా. వాయవ్య బంగాళాఖాతంలోకి ఏర్పడగా ఒడిశా, బెంగాల్ తీరాలకు అలర్ట్ జారీ చేశారు. 15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతోంది దానా. పారాదీప్‌కు 280 కి.మీ, ధమర 310 కి.మీ దూరంలో.. సాగర్ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది.
ED Questions Amoy Kumar: ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ, ఏడు గంటల పాటు ప్రశ్నల వర్షం...భూదాన్ భూముల బదిలీపై విచారణ
Arun Charagondaఈడీ కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు అమోయి కుమర్ ని విచారించింది ఈడి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై విచారించగా వందల కోట్ల విలువైన 42 ఎకరాలు అక్రమంగా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి.
RS Praveen Kumar: భార్యలు ఆందోళన చేస్తే కానిస్టేబుల్‌లను సస్పెండ్ చేస్తారా?, ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా..సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్లను డ్యూటీలోకి తీసుకోవాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
Arun Charagondaభార్యలు ఆందోళన చేస్తే కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్‌పీ. ఇది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు.. కానిస్టేబుల్ భార్యలు వాళ్ళ బాధలు చెప్పుకోడానికి శాంతియుతంగా నిరసన తెలిపుతుంటే అరుగురు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు. వాళ్లను అర్జెంటుగా డ్యూటీలోకి తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
Ponguleti Srinivas Reddy: దీపావళి ముందే పొలిటికల్ బాంబ్...ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో కీలక నేతలపై చర్యలు, సంచలన కామెంట్స్ చేసిన మంత్రి పొంగులేటి
Arun Charagondaదక్షిణకొరియాలోని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి అని తెలిపారు. ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు.. సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధమయ్యాయిన్నారు. కక్ష సాధింపు కోసం కాదు, సాక్ష్యాధారాలతోనే చర్యలు ఉంటాయని తెలిపారు పొంగులేటి. ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలు తీసుకుంటామన్నారు.
Vangalapudi Anitha on Jagan: వారానికి 3 రోజులు ఏపీకి వచ్చి జగన్ టైంపాస్ రాజకీయాలు, జగన్ పై హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత వైఎస్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వారానికి 3 రోజులు ఏపీకి వచ్చి జగన్ టైంపాస్ రాజకీయాలు. టైంపాస్ రాజకీయాల కోసం ఏపీకి వచ్చి అసత్యాలు చెబుతున్నారు. గతంలో సీఎం అని చెప్పుకుని కోర్టు వాయిదాలు ఎగ్గొట్టారు. ఇప్పుడు రాజకీయ సమావేశాలను సాకుగా చూపుతున్నారు. ఐదేళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసి నీతి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
AP Cabinet Meeting Highlights: ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోవడం కుదరదు, ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయం, ఏపీ కేబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వినియోగదారులు నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్‌లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు.
APPSC New Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధ, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyచంద్రబాబు సర్కారు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను బుధవారం నియమించింది. మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో అనురాధను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు
Nalgonda: కోమటిరెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదు మున్నాభాయ్ ఇంజనీర్, బస్తాలు అమ్ముకుని బీర్లు తాగేవాడు...బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ ఫైర్
Arun Charagondaకోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాటలతో ర్యాగింగ్ చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. సిమెంట్ బస్తాలు అమ్ముకుంటూ అక్కడే కూర్చొని బీర్లు తాగే వాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదు మున్నా భాయ్ ఇంజనీర్ అని ఎద్దేవా చేశారు.
Guntur Nurse Murder Case: జగన్‌కు ఇంకా తగ్గని క్రేజ్, వైసీపీ అధినేత వస్తున్నాడని జనసంద్రమైన గుంటూరు, వీడియో ఇదిగో..
Hazarath Reddyరౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిందుకు వైఎస్ జగన్ జీజీహెచ్‌కు వెళ్లారు. వైఎస్ జగన్ జీజీహెచ్‌కు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
Bandi Sanjay On KTR Notices: కేటీఆర్ ఇచ్చిన నోటీసులకు భయపడేది లేదు?, మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తానన్న బండి సంజయ్
Arun Charagondaకేటీఆర్ పంపిన నోటీసులకు బదులిచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు అని...రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా? అని ప్రశ్నించారు. విమర్శలకు నోటీసులే సమాధానమా?, నేను కూడా నోటీసులు పంపిస్తా...కాచుకో అన్నారు. నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన అని చెప్పిన బండి..మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తానని చెప్పారు.
Andhra Pradesh: వచ్చేది మన ప్రభుత్వమే, నిందితులను వెంటాడి జైల్లో పెడతాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో మహిళల భద్రతలను కూటమి నేతలు ప్రశ్నార్థకంగా మార్చేశారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. అన్ని వర్గాల మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jagan Slams Nara Lokesh: దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా? నారా లోకేష్‌ని పప్పు అనడంలో తప్పే లేదంటూ మండిపడిన జగన్
Hazarath Reddyరాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్‌ను పప్పు అనడంలో అసలు తప్పే లేదన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా దిశా చట్టం, ప్రతులను కాల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ని దారుణాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదన్నారు.
KTR: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
Arun Charagondaకేంద్రమంత్రి బండి సంజయ్‌కు షాకిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.