రాష్ట్రీయం
Telangana: సద్దిబువ్వ వద్దన్నందుకు తండ్రిని చితకబాదిన కొడుకు, కోడళ్లు...జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తండ్రి
Arun Charagondaసద్దిబువ్వ వద్దు అన్నందుకు తండ్రిని చితకబాదారు కొడుకు, కోడళ్లు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని జల్లాపురం గ్రామానికి చెందిన గుర్రంబండి కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు. గుర్రంబండి నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో తన ఇంట్లోనే జీవనం చేస్తూ కొడుకుల దగ్గరే ఉంటున్నాడు. సద్ది అన్నం మెత్తగా ఉంది అని చెప్పడంతో కొడుకు, కోడళ్లు చికతబాదారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు ఆ తండ్రి.
AP Liquor Shops: మా గ్రామంలో వైన్స్ షాపు వద్దు, మహిళల ఆందోళన...జనావాసాల మధ్య మద్యం అమ్మకాలేంటని నినాదాలు...వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీని కూటమి సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామంలో నూతనం గా మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం దుకాణం వద్ద గ్రామస్తులు ధర్నా చేశారు.
Nara Lokesh America Tour Details: నేటి నుండి అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామిక వేత్తలతో భేటీ
Arun Charagondaనేటి నుంచి మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. జార్జీయా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో లో రేపు ఒరాకిల్ ప్రతినిధులతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ ఉన్నారు.
Techie Suicide in Hyderabad: పని ఒత్తిడి తాళలేక, చేసిన అప్పులు తీర్చలేక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన
Rudraపని ఒత్తిడి తాళలేక ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఏడు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో ఈ విషాదం చోటుచేసుకున్నది.
TDP MLA Chadalavada Aravinda Babu:ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నాం కానీ అధికారంలోకి వచ్చాకే భయపడాల్సి వస్తోంది..టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు
Arun Charagondaటీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నాం... అధికారంలోకి వచ్చినా అణిగిమణిగి ఉండాల్సి వస్తుందన్నారు. ప్రతి వ్యవస్థలోనూ వైసీపీ ఉద్యోగులే ఉన్నారు... ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అన్నారు. కార్యకర్తలు, నేతలు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు కానీ అలాంటివి కుదరదని గుర్తుంచుకోవాలన్నారు.
Bomb Threat To Tirupati Hotels: తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపు, ఉగ్రవాదుల బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు, అనుమానితుల సమాచారం ఇవ్వాలని పోలీసుల ఆదేశాలు
Arun Charagondaతిరుపతిలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతోంది.తిరుపతిలో డాగ్ , బాంబ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదుల బాంబు బెదిరింపు నేపథ్యంలో పలు హోటల్స్ లో తనిఖీ చేపట్టగా పలు హోటల్స్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేశారు పోలీసులు. అనుమానితులు హోటల్ కు వస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆదేశాలు చేశారు.
Kidnapper Rampage in Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో బాలుడి కిడ్నాప్ కు యత్నం.. దుండగుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో బాలుడి కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. హైదర్ గూడలో ఆడుకుంటున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఓ యువకుడు యత్నించాడని స్థానికులు ఆరోపించారు.
Fire Accident in Tupran: మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో తెల్లవారుజామున కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం (వీడియో)
Rudraమెదక్ జిల్లాలోని తూప్రాన్ లో ఈ తెల్లవారుజామున ఓ కారు షెడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
Union Cabinet Meeting Highlights: అమరావతికి హైదరాబాద్, చెన్నై, కోల్ కతాతో కనెక్టివిటీ, రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, కేంద్ర కేబినెట్ మీటింగ్ పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) మొత్తం రూ.6,798 కోట్ల అంచనా వ్యయంతో (సుమారుగా) రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
KTR: రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా, చిట్టినాయుడు రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదన్న కేటీఆర్, రాష్ట్రంలో హౌలా సీఎం ఉన్నాడని ఆగ్రహం
Arun Charagondaకాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడే పనులు అక్కడ ఆగిపోయినయ్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్‌లో జరిగిన రైతు మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్... ఆదిలాబాద్‌కు వచ్చేటప్పుడు డిచ్‌పల్లి దగ్గర పోలీసుల భార్యలు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు అన్నారు. కాంగ్రెస్ పాలనలో పోలీసుల కుటుంబాలను పోలీసులే గుంజుకుపోయే పరిస్థితి ఉంది...ఇక్కడికు వస్తుంటే ఉట్నూరులో పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని జోగు రామన్న చెప్పారు అన్నారు.
Prakasam Barrage: మరోసారి వార్తల్లో విజయవాడ ప్రకాశం బ్యారేజీ, రెయిలింగ్ వంగి ప్రమాదకరంగా మారిన రక్షణ గోడ...వీడియో ఇదిగో
Arun Charagondaకృష్ణా జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజి మరోసారి వార్తల్లో నిలిచింది. బ్యారెజ్ రక్షణ గోడ కుంగగా రెయిలింగ్ వంగి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Nalgonda: పెట్రోల్ బంకు మోసం, పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎస్సై ఉల్టా బెదిరింపు..నయీమ్ బతికుంటే మీ ఆటలు సాగేవి కావు అనవసరంగా ఎన్‌కౌంటర్ చేశానని ఎస్సై కామెంట్..ఆడియో వైరల్
Arun Charagondaకట్టంగూరు మండలం NH 65 రహదారిపై గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ బాధితుడికి చేదు అనుభవం ఎదురైంది. టాటా టియాగో కారు ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు కాగా రీడింగ్‌లో 42 లీటర్లు చూపించడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad: చైతన్యపురి శిల్పి ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన కూరగాయలు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన నిజాలు..కిచెన్‌లో బొద్దింకలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తింపు
Arun Charagondaచైతన్యపురిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శిల్పి ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిపోయిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు, ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉందని చెప్పిన అధికారులు... ఫుడ్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు.
YS Jagan Slams AP Govt: డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన జగన్, అక్రమాలు బయటపెడుతున్నందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపాటు
Hazarath Reddyచంద్రబాబు కూటమి సర్కార్ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు వైఎస్ జగన్. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila: కనీసం చెల్లెలుగా కూడా చూడటం లేదు, నాపై ట్రోలింగ్ వెనుక జగనన్న, వదిన ఉన్నారన్న షర్మిల, రాక్షస ముఠాతో ట్రోల్స్ చేస్తున్నారని మండిపాటు
Arun Charagondaనాపై ట్రోలింగ్ వెనుక మా అన్నయ్య, వదిన , సజ్జల ఉన్నారు అన్నారు వైఎస్ షర్మిల. వీళ్లంతా ఓ రాక్షస ముఠాను తయారు చేసి సోషల్ మీడియాలో నాపై ట్రోల్స్ చేపిస్తున్నారు అన్నారు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి భార్యను కూడా అవమానించే స్థాయికి దిగజారారు అన్నారు. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు తోడుగా ఉన్నాను.. కానీ ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని పక్కన పెట్టారు అని మండిపడ్డారు.
Lorry Accident Video: ఆగి ఉన్న మద్యం లారీని ఢీకొట్టిన మరో లారీ, ఒకదాని వెంట ఒకటి ఢీకొట్టుకున్న మరో నాలుగు లారీలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyమహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం జాతీయ రహదారిపై లిక్కర్ లోడుతో వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ భోజనానికి అని రోడ్డు పక్క ఆపడంతో వెనకాల వేగంగా వస్తున్న మరో లారీ డీ కొట్టింది. దీంతో మద్యం లారరీ బోల్తా పడింది. దాదాపు నాలుగు లారీలు ఒకదాని వెంట ఒకటి డీ కొనడంతో జాతీయ రహదారి పై ఒక్కసారిగా అయో మాయ పరిస్థితి నెలకొంది.
Deepadas Munshi: బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా, ఎమ్మెల్యే టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నారన్న కామెంట్లపై ఫైర్
Arun Charagondaబీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై పరువు నష్టం దావా వేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ. ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం దీపాదాస్ మున్షీ బెంజ్ కార్లు తీసుకుందని వ్యాఖ్యలు చేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఈ నేపథ్యంలో కేసు దాఖలు చేయగా పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాలేదు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దీంతో నవంబర్ 5న విచారణకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు.
Congress MLC Jeevan Reddy: నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారా?..కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బహిరంగ లేఖ, పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ చెప్పిందెంటీ , జరుగుతుంది ఏంటని ప్రశ్న?
Arun Charagondaతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై హైకమాండ్ కు సంచలన లేఖ రాశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారో చెప్పాలన్నారు. తీవ్ర ఆందోళన మానసిక వ్యధ బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నట్టు వెల్లడించారు జీవన్ రెడ్డి. తన రాజకీయ భవిష్యత్ ను మీరే నిర్దేశించండి అని కాంగ్రెస్ అధిష్టానాన్ని అడిగారు జీవన్ రెడ్డి.
Cyclone Dana Update: దానా తుపాన్ తీవ్రత తెలిపే వీడియోలు ఇవిగో, అల్లకల్లోలంగా సముద్రం, వణుకుతున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు
Hazarath Reddyతూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘దానా’ తుఫాన్ (Cyclone Dana) వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ఇది నేటి అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
Mahabubabad: తహసిల్దార్‌పై రెచ్చిపోయిన ఇసుక మాఫియా, అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నందుకు బూతు మాటలు తిట్టిన వైనం, పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసిల్దార్
Arun Charagondaతహసిల్దార్ పై బూతులతో రెచ్చిపోయింది ఇసుక మాఫియా. మహబూబాబాద్ - నెల్లికుదురు మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు తహసిల్దార్ రాజు. దీంతో తహసిల్దార్ పై బూతులతో రెచ్చిపోయారు ఇసుక ట్రాక్టర్‌కు సంబంధించిన వ్యక్తులు. తనను అడ్డుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తహసిల్దార్.