రాష్ట్రీయం
Hyderabad: గోషామహల్‌లో భారీగా కుంగిన నాలా , అర్థరాత్రి కావడంతో తప్పిన ప్రమాదం...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ గోషామహల్‌లో నాలా రోడ్డు కుంగింది. దారుసలామ్ రోడ్డు నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగింది. అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో శివరేజ్ పెద్ద నాలా కుంగగా ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Kaleswaram Project Public Hearings: కాళేశ్వరంపై మళ్లీ విచారణ, ప్రతి రోజు రెండు సెషన్స్ లలో కొనసాగనున్న ఓపెన్ కోర్టు విచారణ..ఈ నెలాఖరులోగా తుది నివేదిక సిద్ధం!
Arun Charagondaనేటి నుంచి కాళేశ్వరంపై మళ్లీ విచారణ ప్రారంభించనుంది కమిషన్. ప్రతి రోజు రెండు సెషన్స్ లలో కొనసాగనుంది ఓపెన్ కోర్టు విచారణ. పలువురు ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు నేటి విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లతో విచారణ పూర్తి చేయాలనే యోచనలో కమిషన్ ఉండగా ఆ తర్వాత తుది నివేదికను సమర్పించనుంది.
Pulivendula Road Accident: వీడియో ఇదిగో, పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడిన బస్సు, 25 మంది ప్రయాణికులకు గాయాలు
Hazarath Reddyఏపీలోని వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.
Yadagirigutta Temple: యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం...ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించడం సరికాదన్న ఈవో, ఇకపై చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలని హెచ్చరిక
Arun Charagondaయాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలపై నిషేధం విధించారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి జ్ఞాపకార్థంగా భద్రపర్చుకుంటే అభ్యంతరం లేదని...చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Seethakka Worships Lord Balaji: తిరుమలలో తెలంగాణ మంత్రి సీతక్క, ప్రియాంక గాంధీ విజయం కోసం ప్రత్యేక పూజలు..తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్ష
Arun Charagondaతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. బుధవారం వేకువజాము శ్రీవారికి పుష్పాలు అలంకరించే తోమాల సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మహిళా నేత ప్రియాంక గాంధీ వయనాడ్ లో నామినేషన్ వేస్తున్న శుభసందర్భంలో ఆమె ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడంతో చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
Andhra Pradesh: నడిరోడ్డుపై మొసలి కలకలం, పిల్లుట్ల జంక్షన్ సమీపంలోరోడ్డుపైకి వచ్చిన మొసలి, భయాందోళనలో ప్రజలు
Arun Charagondaనడిరోడ్డుపై మొసలి కలకలం కలకలం రేపింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బైపాస్ పిల్లుట్ల జంక్షన్ సమీపంలో రోడ్డుపై అటుఇటు తిరిగింది మొసలి. పొలాల్లో నుంచి రోడ్డుపైకి వచ్చిన మొసలిని చూసి ప్రజలు భయాందోళనకు గురికాగా స్థానికుల సమాచారంతో మొసలి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు అటవీ శాఖ అధికారులు.
Vasireddy Padma Resigns YSRCP: వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా, జగన్‌పై తీవ్ర విమర్శలు, రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదు అని మండిపాటు
Arun Charagondaవైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకురాలు, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రిలీజ్ చేసిన వాసిరెడ్డి పద్మ...జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ పార్టీ అంటే వ్యాపార కంపెనీ కాదని మండిపడ్డారు. పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యత లేదని, పరిపాలన చేయడంలో, సమాజం పట్ల అంతకన్న బాధ్యత లేదని మండిపడ్డారు.
Telangana Assembly: త్వరలో కొత్త అసెంబ్లీ భవనం, రూ.49 కోట్లతో నిర్మిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి, మండలి భవన రిపేర్లపై సమీక్ష సందర్భంగా వెల్లడి
Arun Charagondaరాష్ట్రంలో త్వరలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించనున్నట్లు వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రూ.49 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. మండలి భవన రిపేర్లపై సమీక్ష సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ కౌన్సిల్ కు ఒకే దగ్గర భవనాలు ఉంటాయని తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి.. మండలి భవన రిపేర్లపై సమీక్ష నిర్వహించారు.
Pinipe Viswaroop Son Srikanth Arrest: మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్ట్ , 14 రోజులు రిమాండ్, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
Arun Charagondaమాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. గతంలో అరెస్ట్ అయిన ముద్దాయి వాంగ్మూలం ఆధారంగా శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు అని శ్రీకాంత్ తరపు న్యాయవాది వెల్లడించారు.
Telangana AEOs Protest: 160 మంది ఏఈవోలను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, నిరసనగా ఇవాళ అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ఆందోళనకు పిలుపునిచ్చిన ఏఈవోలు
Arun Charagondaతెలంగాణ ప్రభుత్వం 160 మంది ఏఈవోలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ఆందోళనకు పిలుపునిచ్చారు ఏఈవో లు. సస్పెండ్ చేసిన 160 మంది ఏఈవో లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెనుకకు తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2600 మంది ఏఈవో కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు తరలి రావాలన్న ఏఈవో ల సంఘం నేతలు కోరారు.
YS Jagan: ఇవాళ గుంటూరు, కడప జిల్లాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన, బాధిత కుటుంబాలకు పరామర్శ, రాత్రి పులివెందులలో బస చేయనున్న జగన్
Arun Charagondaనేడు గుంటూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు వైఎస్ జగన్. గుంటూరులో యువకుడి దాడిలో మృతిచెందిన..యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అలాగే మధ్యాహ్నం బద్వేల్‌కు బయల్దేరనున్న జగన్ ప్రేమోన్మాది దాడిలో మృతిచెందిన..దస్తగిరిమ్మ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం పులివెందుల చేరుకుని అక్కడే బస చేయనున్నారు.
Cyclone Dana Live Updates: నాలుగు రాష్ట్రాలకు 'దానా' తుపాను ఎఫెక్ట్, ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు మూసివేత, పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
Arun Charagondaబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఒడిశా ,పశ్చిమ బెంగాల్ తీరప్రాంత జిల్లాలలోని అన్ని పాఠశాలలును ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. దానా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండే తీర ప్రాంత జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Amaravati Drone Summit 2024: ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసిన విజయవాడ డ్రోన్ షో, సీఎం చంద్రబాబుకు సర్టిఫికెట్లు అందజేసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు, అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 వీడియోలు ఇవిగో..
Hazarath Reddyకేంద్ర పౌరవిమానయాన శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నిర్వహించిన డ్రోన్ షో విజయవంతం అయింది. డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన ఈ భారీ ఈవెంట్ లో డ్రోన్ విన్యాసాలు అచ్చెరువొందించాయి.
Cyclone Dana: రేపు తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఉత్తరాంద్రకు హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అక్టోబర్ 23 నాటికి తుఫాన్‌గా బలపడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
KTR on Ganga Reddy Murder Case: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడి
Hazarath Reddyతెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంటున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
Ganga Reddy Murder Case: నీకో దండం నీ పార్టీకో దండం, కాంగ్రెస్ పార్టీపై మండిపడిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తలకే భరోసా లేదని ఆవేదన
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన, ఉదయం నుండి పవన్ రాక కోసం ఎదురుచూపులు...వీడియో ఇదిగో
Arun Charagondaజనసేన ఆఫీస్ దగ్గర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పడిగాపులు గాస్తున్నారు. నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తుండగా ఆయన కార్యాలయ సిబ్బంది స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ని కలవడం కోసం కటిక నేల మీదేనిన్నంతా మహిళ ఉద్యోగుల పడిగాపులు గాశారు
Anchor Kavya: అప్పు తీర్చాలని అడిగినందుకు యాంకర్ మీద వైసీపీ నేత దాడి, అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన యాంకర్ కావ్య
Hazarath Reddyఈనెల 13న వైసీపీ నాయకుడు ఎన్వి శ్రీనివాస్ తనపై దాడి చేసిన కేసులో న్యాయం చేయాలని కోరిన యాంకర్ కావ్య.నేను ఇచ్చిన 3 లక్షల రూపాయలకు అదనంగా మరో రెండు లక్షల వరకు ఖర్చయింది. మొత్తం ఐదు లక్షల రూపాయలు నాకు ఎన్వీ శ్రీనివాస్ దగ్గర నుంచి రావాలి. నా డబ్బులు నాకు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నని తెలిపారు.
Jagtial: కాంగ్రెస్ నేతను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి రీల్, పోలీసుల తీరును తప్పుబట్టిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...వీడియో ఇదిగో
Arun Charagondaజగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరున్ని హత్యచేసిన నిందితుడు సంతోష్ లొంగిపోతూ రీల్ చేసుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు పోలీసుల తీరును తప్పుబట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
Ranga Reddy District: ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ
Arun Charagondaరంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసింది ఏసీబీ. రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి. రూ.5 కోట్ల 5లక్షల 71వేల 676రూపాయల విలువ చేసే స్థిర,చర ఆస్తుల గుర్తించగా రూ.4 కోట్ల 19లక్షల 40వేల 158 రూపాయల విలువైన అనుమానిత ఆస్తుల గుర్తించారు.