రాష్ట్రీయం
KTR Vs Ponguleti: పొంగులేటికి కేటీఆర్ సవాల్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధమా అని ప్రశ్న?, రాజకీయ సన్యాసం చేసేందుకు రెడీ అని ఛాలెంజ్
Arun Charagondaమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. తాను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు అన్నారు.
Janwada Farm House: జన్వాడ ఫామ్ హౌజ్ అక్రమమే, తేల్చిన అధికారులు, 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు వెల్లడి
Arun Charagondaజన్వాడ ఫామ్ హౌజ్‌లో నిర్మాణాలు అక్రమమేనని తేల్చారు అధికారులు. నాలా ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌజ్ లో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు తేల్చారు అధికారులు. కబ్జా చేసి ప్రహరీ గోడ, గేటు నిర్మించారు కేటీఆర్ సన్నిహితులు. హైకోర్టు లేదా ప్రభుత్వం అనుమతి ఇస్తే ఫామ్ హౌజ్ లో సోదాలు చేస్తామని తెలిపారు అధికారులు.
CM Revanth Reddy: స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaమార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ఐటీఐ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్ నగరం మినహా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Jani Master Rape Row: పుష్ప 2 షూటింగ్ లో జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో)
Rudraలైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది.
Pawan Kalyan Prayaschitta Deeksha: 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (వీడియోతో)
Rudraతిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై ప్రాయశ్చిత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను కాసేపటి క్రితం ప్రారంభించారు.
Simhachalam Temple: తిరుమల తర్వాత విశాఖ సింహాచలం ఆలయం, కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు ఆరోపణలు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
Arun Charagondaదేవాలయాల్లో కల్తీ నెయ్యి వినియోగం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఘటన మరవక ముందే మరో ఆలయంలో కల్తీ నెయ్యి అంశం తెరపైకి వచ్చింది. విశాఖ సింహాచల దేవస్థానంలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.టెస్ట్‌లు జరిపి ప్రాథమికంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ నిర్ధారించారు. నాసిరకం ఆహార ఉత్పత్తులు వాడకుడదంటూ ఎమ్మెల్యే గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Road Accident in Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి (వీడియో)
Rudraఅనంతపురం జిల్లాలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
HYDRA Demolitions In Kukatpally: తాత్కాలిక బ్రేక్ తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలెట్టిన హైడ్రా.. కూకట్ పల్లి నల్లచెరువుకు తరలిన బుల్డోజర్లు.. నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు (వీడియో)
Rudraవినాయక చవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండటంతో కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉన్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది.
TTD EO Report on Laddu Dispute: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు నివేదిక, టీటీడీ ఈవో శ్యామలరావు ఇచ్చిన రిపోర్ట్ పై మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమావేశం
VNSటీటీడీలో శ్రీవారి లడ్డూ (Tirumala laddu) తయారీలో కల్తీ పదార్థాల వాడారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై నివేదిక సమర్పించాలని టీటీడీ ఈఓ జే శ్యామలరావును ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఆదేశించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈఓ శ్యామలరావు (TTD EO J Syamala Rao) శనివారం నివేదిక అందజేశారు
Pawan Kalyan 11 Days Deeksha: 11 రోజుల పాటూ దీక్ష చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తిరుమల ప్రసాదం అపచారంపై ప్రాయశ్చిత్త దీక్ష
VNSసనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేసిన అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని తెలిపారు.
Simhachalam Prasadam For Testing: సింహాచలం ప్రసాదాలపై తిరుమల లడ్డూ ఎఫెక్ట్, అన్ని ప్రసాదాలను టెస్టింగ్ కోసం పంపించాలని నిర్ణయం
VNSఆలయంలో లడ్డూల తయారిపై ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణంతో సమానంగా భావించే తిరుమల క్షేత్రంలో లడ్డూ కల్తీ ఘోరమైన విషయం వైఎస్ జగన్ ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు.
Tirupati Laddu Issue: తిరుమలలో మూడు రోజుల పాటు మహాశాంతి యాగం, ఆలయ సంప్రోక్షణపై టీటీడీ ఈవో కీలక నిర్ణయం
Arun Charagondaశ్రీవారి లడ్డూ కల్తీ దుమారం కొనసాగుతోన్న వేళ.. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తితిదే పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామల రావు భేటీ అయ్యారు.
Seeman On Tirupati Laddu: తిరుపతి లడ్డూ సమస్య తప్ప మరేమి లేదా?,కల్తీ లడ్డూతో ఎవరన్న చనిపోయారా అని ప్రశ్నించిన ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్
Arun Charagondaదేశ వ్యాప్తంగా సంచనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారంపై స్పందించారు ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్. లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు అని హితవు పలికారు.
Andhra Pradesh: క్షణాల్లో సెల్ ఫోన్ మాయం చేసిన కేటుగాళ్లు, కింద పడిపోయిన వస్తువు తీసుకునేలోపే కొట్టేసి పరార్..వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో దొంగలు చేతి వాటం ప్రదర్శించారు. జేబులో ఉన్న సెల్ ఫోన్ ను క్షణాల్లో మాయం చేశారు కేటుగాళ్లు. ఏలూరు DMHO కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేసే శ్రీనివాస్ అనే ఉద్యోగిని బురుడి కొట్టించి జేబులో ఉన్న సెల్ ఫోన్ ను క్షణాల్లో దొంగలించారు కేటుగాళ్లు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్‌గా మారింది
Mee Seva Services: తెలంగాణలో పలు చోట్ల నిలిచిపోయిన మీ సేవ సేవలు...సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయిందని అధికారుల వెల్లడి
Arun Charagondaతెలంగాణ వ్యాప్తంగా మీ సేవ సేవలు నిలిచిపోయాయి. డేటా సెంటర్‌లో సాంకేతిక సమస్య కారణంగా మీ సేవ సర్వీసులు నిలిచిపోయాయని అధికారులు చెబుతుండగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక తీవ్రంగా నష్టపోతున్నారు.
Telangana: బాలికలపై హాస్టల్ వార్డెన్ వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు..వీడియో ఇదిగో
Arun Charagondaరాజేంద్రనగర్లో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన హాస్టల్లో వార్డెన్ తరచూ వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. అకారణంగా చితకబాదుతోందని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వార్డెన్ పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Rain in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ దంచికొడుతున్న వాన.. రేపు కూడా భారీ వర్షాలు
Rudraహైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఉప్పల్ నుంచి లింగంపల్లి, అటు పాతబస్తీ నుంచి ఇటు కొంపల్లి వరకూ పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి.
Road Accident At ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు, ఒకరు మృతి..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్ పేట్ ఎగ్జిట్ నెంబర్ 10 వద్ద డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది కారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ నుంచి ఈసీఐఎల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Viral Video: ఇదేం దొంగతనం భయ్యా..! కాళ్ల మధ్యలో పెట్టుకొని రూ.10 వేల చీరలు దొంగతనం చేసిన మహిళలు.. ముస్తాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో..!
Rudraసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలోని లిప్సిక సారీ సెంటర్ లో దొంగతనం జరిగింది. చీరల కొనుగోలు పేరిట దుకాణంలోకి వచ్చిన ఐదుగురు మహిళలు చీరలు కొంటున్నట్టు నటించి రూ.10 వేల విలువైన చీరలను కాళ్ల మధ్య పెట్టుకొని దొంగతనం చేశారు.
Hydra Demolition Of Illegal Constructions: కోకాపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు..వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్టబద్దత కల్పించడంతో పాటు మరిన్ని అధికారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడు పెంచింది. కోకాపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. సర్వే నెంబర్ 141లో కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. దీంతో భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు హైడ్రా అధికారులు.