రాష్ట్రీయం
Andhra Pradesh: వీడియో ఇదిగో, వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా నీళ్లలో పడిపోయిన ముగ్గురు యువకులు, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఒకరు
Hazarath Reddyవినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు యువకులు నీళ్లలో పడిపోయారు. ఇద్దరు తిరిగి పైకి ఎక్కగా శేఖర్ రెడ్డి అనే యువకుడు మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. శేఖర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Andhra Pradesh: కాకినాడలో ఘోర విషాదం, బోరు బావి మోటారు ఎత్తుతుండగా పైపులకు కరెంటు వైర్లు తగిలి ముగ్గురు రైతులు మృతి
Hazarath Reddyకాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడిలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.ఉప్పలపాడు నుండి రాజపూడి వెళ్లే దారిలో పొలం వద్ద బోరు బావి మోటారు ఎత్తుతుండగా కరెంటు వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Skill Development Scam: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, రాజమండ్రి జైల్లో చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ అధికారులు, హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీడీపీ అధినేత
Hazarath Reddyఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.
Group 1 Prelims Exam Cancelled: గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు షాక్, గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ ర‌ద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కీలక తీర్పు
Hazarath Reddyతెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌న్న పిటిష‌న్‌పై విచార‌ణ చేప్ప‌ట్టిన టీఎస్ హైకోర్టు.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింది. జూన్ 11వ తేదీన జ‌రిగిన ఈ ప‌రీక్ష ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌ని TSPSCని కోర్టు ఆదేశించింది.
AP CM Jagan: వైరల్ ఫీవర్, జలుబు, దగ్గుతో బాధ పడుతున్న జగన్.. చికిత్స తీసుకుంటున్నా ఇంకా పూర్తిగా తగ్గని జ్వరం
Rudraఏపీ ముఖ్యమంత్రి జగన్ కు స్వల్ప అస్వస్థత తలెత్తింది. కొన్ని రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్నారు. వైరల్ ఫీవర్ కు చికిత్స తీసుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ అది పూర్తిగా తగ్గలేదు.
Vande Bharat Train: రేపు ఒకేసారి 9 వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Rudraరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రేపు మరో తొమ్మిది కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీగా వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. వీడియోతో
Rudraతెలంగాణ రాష్ట్రంలో శని, ఆది వారాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
Mynampally Resigns to BRS: బీఆర్ఎస్‌కు మైనంపల్లి హన్మంతరావు రాజీనామా, రెండు టికెట్లు ఇవ్వనుందుకు పార్టీని వీడుతున్నట్లు ప్రకటన, కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం
VNSమల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్‌ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా హన్మంతరావును ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. మల్కాజిగిరి సీటు తనకు కేటాయించడంతోపాటు మెదక్‌ నుంచి తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తామని హన్మంతరావు ప్రకటించారు
Epuri Somanna To Join In BRS: బీఆర్‌ఎస్‌లోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న, సింగర్‌ సాయిచంద్‌ స్థానాన్ని భర్తీ చేస్తారా?మంత్రి కేటీఆర్‌తో భేటీ, ఆత్మీయ ఆలింగనం
VNSప్రజా గాయకుడు ఏపూరి సోమన్న (Epuri Somanna) త్వరలోనే బీఆర్‌ఎస్‌లో (BRS) చేరబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆయన శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్‌ల సమక్షంలో ఏపూరి సోమన్న మంత్రి కేటీఆర్‌ను (KTR) ఆలింగనం చేసుకున్నారు.
Andhra Pradesh: వినాయకుని నిమజ్జనం సందర్భంగా చీరాల బీచ్‌లో మునిగిపోతున్న నలుగురు మహిళలను కాపాడిన బాపట్ల పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyచీరాల వాడరేవు బీచ్‌కు వినాయకుని నిమజ్జనం నిమిత్తం వచ్చిన భక్తులలో నలుగురు మహిళలు సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి వారు సముద్రంలో మునిగిపోతుండగా గమనించిన మెరైన్ మరియు పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి సముద్రంలోకి దూకి మునిగిపోతున్న నలుగురు మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చి వారి బంధువులకు అప్పగించారు.
Skill Development Scam: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు, కీలక తీర్పును వెలువరించిన ధర్మాసనం
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Weather Update: తెలంగాణకు రానున్న రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyగత వారం నుంచి తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాత్రి పలు చోట్ల కురిసిన వర్షంతో జాగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
AP Assembly Session 2023: బాలకృష్ణకు మెంటల్ ఉంది కాల్పులు జరుపుతాడేమో, అసెంబ్లీలోకి రానివ్వకండి అధ్యక్షా, వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Hazarath Reddyఅసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజైన శుక్రవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజిల్స్ వేయడంపై వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒకరోజు మీసాలు మెలేయడం మరుసటి రోజు విజిల్స్ వేయడం బాలయ్యకే చెల్లిందన్నారు.
Ambati Rambabu vs Balakrishna: మీ బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో, నీవు విజిల్స్ వేయడం మానేసి టీడీపీ పగ్గాలు అందుకో, బాలకృష్ణకు అంబటి రాంబాబు సలహా
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో సభలో విజిల్స్‌ వేశారు.అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nanadamuri Balakrishna) తీరుపై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Andhra Pradesh: మద్యం షాపులు ముట్టడించి మందు బాటిళ్లు ధ్వంసం చేసిన బీజేపీ మహిళా మోర్చా, వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని తెలిపిన పురంధేశ్వరి
Hazarath Reddyమద్యపాన నిషేధం అమలు చేయాలని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మద్యం షాపులు ముట్టడించారు. షాపులో ఉన్న ప్లాస్టిక్ మద్యం బాటిళ్లు ధ్వంసం చేసిన బీజేపీ మహిళా మోర్చ కార్యకర్తలు నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతామంటూ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
Hyderabad: వీడియో ఇదిగో, హిజ్రాలతో ముజ్రా డాన్స్ వేయించిన రౌడీ షీటర్లు, స్టేషన్‌కు తీసుకువెళ్లి తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చిన పోలీసులు
Hazarath Reddyహిజ్రాలతో ముజ్రా డాన్స్ చేయించిన రౌడీ షీటర్లకి తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ పోలీసులు. హైదరాబాద్ లోని హబీబ్ నగర్లో అక్బర్ అనే రౌడీ షీటర్ గాంగ్ ద రింగ్ పార్టీలో హిజ్రాలతో ముజ్రా డాన్స్ చేయించగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు తమ తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. వీడియోలు ఇవిగో..
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌‌ను నిరసిస్తూ బాపట్ల సముద్ర తీరంలో శాండ్ ఆర్ట్, Justice for CBN హ్యాష్ ట్యాగ్‌తో ఆర్ట్ వేసిన ప్రముఖ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్
Hazarath Reddyస్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ బాపట్ల సముద్ర తీరంలో బీచ్ ఆర్ట్ వేయించారు. బాపట్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ ఆధ్వరంలో ప్రముఖ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ ఈ ఆర్ట్ వేశారు. #Justice for CBN అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఏపీ మ్యాప్, పక్కన కోర్టుల్లో న్యాయమూర్తులు వినియోగించే సుత్తిని రూపొందించారు.
Video: వీడియో ఇదిగో, గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా - ధర్మవరంలో ప్రసాద్ (26) అనే యువకుడు బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
Video: వీడియో ఇదిగో, వినాయకుడి మండపంలో నిద్రిస్తున్న వారి సెల్ ఫోన్ దొంగిలించేందుకు ప్రయత్నించిన దొంగ
Hazarath Reddyగణేష్ మండపాలను సైతం దొంగలు వదలడం లేదు. రెండు రోజుల క్రితం మియాపూర్‌లోని ఓ గణేష్ మండపంలో లడ్డూ దొంగతనం జరగగా ఈరోజు ఉదయం 1:50 గంటలకు మేడ్చల్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఓ దొంగ సెల్ ఫోన్ చోరీకి యత్నించాడు. మండపంలో నిద్రిస్తున్న వారు లేవగా అక్కడి నుంచి పారిపోయాడు
Skill Development Scam: చంద్రబాబుకు షాకిచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని హైకోర్టులో పిల్, టీడీపీ అధినేత జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఈ నెల 24 వరకు పొడిగింపు
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈనెల 24 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న ఆయన్ను పోలీసులు ఏసీబీ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు.