రాష్ట్రీయం

IMD Weather Forecast: అల్ప పీడనంపై ఐఎండీ తాజా అలర్ట్ ఇదిగో, రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, అలాగే తాజా వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఈ సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను అనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది.

Vizag Knife Attack Case: జగన్‌పై కత్తి దాడి కేసు, ఆగస్టు 1న విచారిస్తామని తెలిపిన విజయవాడ ఎన్ఐఏ కోర్టు, కుట్రకోణంపై లోతుగా దర్యాఫ్తు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసిన ధర్మాసనం

Hazarath Reddy

తనపై 2018లో విశాఖలో జరిగిన దాడి కేసులో కుట్రకోణంపై మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం కొట్టివేసింది.

Chiranjeevi: చిరంజీవిపై నమోదైన కేసును కోట్టేసిన ఏపీ హైకోర్టు, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతగా కోడ్ ఉల్లంఘించారని గుంటూరులో కేసు నమోదు

Hazarath Reddy

గుంటూరులో నిర్ణీత సమయంలో సభ ముగించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు వచ్చాయని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ అప్పట్లో కాంగ్రెస్‌ నేతగా ప్రచారంలో పాల్గొన్న చిరంజీవిపై కేసు నమోదు చేశారు

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన తెలుగుదేశం పార్టీ

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు.

Advertisement

HC Rejects Srinivas Goud Plea: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కదురు, తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ కొట్టేయాలనే అభ్యర్థనను తోసి పుచ్చిన ధర్మాసనం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాలు & రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్‌కు మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.

HC Disqualifies Kothagudem MLA: కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు, జలగం వెంకట్రావ్‌ను కొత్త ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Hazarath Reddy

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతవేటు వేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. ఈ క్రమంలో సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

Hyderabad Rains: హైదరాబాద్ ట్రాఫిక్ జాం, ఐటీ ఉద్యోగులకు లాగ్ అవుట్‌పై కీలక సూచనలు చేసిన సైబరాబాద్ పోలీసులు

Hazarath Reddy

వర్షాల కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవడానికి సూచించిన సైబరాబాద్ పోలీస్ శాఖ.

Video: భార్యతో గొడవపడి కరెంట్ స్తంభం మీద నుంచి దూకిన భర్త, కాసేపు వైర్లు పట్టుకొని వేలాడుతూ ప్రాణాలు తీసుకుంటానంటూ బెదిరింపులు

Hazarath Reddy

భార్యాభర్తల బంధం అనేది ఎంతో అన్యోన్యమైనది. కానీ వారు చిన్నచిన్న విషయాలకే గొడవ పడుతూ ఆ బంధానికే మాయని మచ్చ తెస్తున్నారు. తాజాగా ఓ భర్త.. భార్యతో గొడవపడి కరెంట్ స్తంభం ఎక్కారు. ఆపై కాసేపు వైర్లు పట్టుకొని వేలాడుతూ ప్రాణాలు తీసుకుంటానంటూ నానా హడావుడి చేశారు. తీరా పట్టు తప్పడంతో పై నుండి కింద పడిపోయారు. ఈ ఘటనలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Advertisement

My Home Cement Factory Accident: మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, అయిదుగురు కార్మికులు మృతి

Hazarath Reddy

సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బాధితులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది

Justice Dhiraj Singh Thakur: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ను నియమించాలన్న సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు

Hyderabad Rains: హోంగార్డుల నుంచి పోలీస్ ఉన్నతాధికారుల వరకు అందరూ వర్షంలోనే, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేసిన యంత్రాంగం

Hazarath Reddy

మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగరజీవనం దాదాపు స్తంభించింది. మరో నాలుగురోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.

Hyderabad Road Accident: ఘోర ప్రమాదం, అతివేగంతో వచ్చి డివైడర్‌ను ఢీకొట్టిన అంబులెన్స్‌, వెంటనే పేలిన ఆక్సిజన్ సిలిండర్, డ్రైవర్ మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మలక్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అతడి ఇంటి వద్ద వదిలిపెట్టి తిరిగి వస్తుండగా అంబులెన్స్‌ బీఎన్‌ రెడ్డి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది.

Advertisement

Hyderabad Traffic Video: హైదరాబాద్‌ ట్రాఫిక్ జామ్ వీడియో ఇదిగో, కదిలే లోపు రెండు గంటలు సినిమా చూడవచ్చు

Hazarath Reddy

హైదరాబాద్‌ లో భారీ వర్షాలకు గడిచిన మూడు రోజులుగా ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి. రోడ్డుపైకి వెళ్తే.. గమ్యస్థానికి ఎప్పుడు వెళ్తామో చెప్పలేని పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే.. ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. చాలా ప్రాంతల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా కనిపించింది.

IRCTC Down: ఐఆర్సీటీసీ యాప్, వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు.. ట్విట్టర్ లో వెల్లడించిన ఐఆర్సీటీసీ

Rudra

రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ ముఖ్య సూచన చేసింది. టికెట్ కొనుగోలు విషయంలో యాప్, వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొంది. దీని కారణంగా టికెట్ చెల్లింపులు జరపడం కష్టంగా మారిందని.. దీనికి ప్రత్యామ్నయంగా ఆస్క్ దిశాను సంప్రదించాల్సిదిగా కోరారు.

Video: మందుబాబులా మజాకా, ఏకంగా పోలీస్ ట్రాఫిక్ బూత్‌లో మద్యం తాగుతూ బిర్యానీ తింటూ ఎంజాయ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాదాపూర్ లోని హైటెక్ సిటీ జంక్షన్లో ట్రాఫిక్ బూత్లో పోకిరీలు మద్యం తాగుతున్న వీడియో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ జంక్షన్లలో ఏర్పాటు చేసిన బూత్లో ఇద్దరు పోకిరీలు కూర్చొని మద్యం తాగుతూ బిర్యానీ తింటూ మందు కొట్టడానికి అడ్డాగా మార్చుకున్నారు. వీడియో ఇదే..

Ambulance in Fire: డివైడర్ ను ఢీ కొట్టడంతో అంబులెన్స్ లో మంటలు.. డ్రైవర్ మృతి.. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో ఘోర ప్రమాదం

Rudra

హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడడంతో అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నగరంలోని వనస్థలిపురంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

IITH Student Case: విషాదాంతంగా మారిన ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి కథ.. విశాఖ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న కార్తీక్.. ఈ ఉదయం వైజాగ్ సముద్రం ఒడ్డున మృతదేహం గుర్తింపు

Rudra

ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) విద్యార్థి కార్తీక్ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. నగరం నుంచి విశాఖపట్టణం చేరుకున్న విద్యార్థి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Viral Video: భవనం పక్కనే పిడుగుపాటు.. కాలిపోయిన టీవీలు, ఫ్రిజ్‌లు.. హైదరాబాద్‌ అత్తాపూర్‌ లో ఘటన.. వీడియోతో

Rudra

హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌ లో ఓ నాలుగు అంతస్తుల భవనం సమీపంలో పిడుగు పడింది. దీంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ల లోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి.

Telangana Rains: రానున్న మూడ్రోజులు మరింత దంచికొట్టనున్న వానలు.. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌

Rudra

తెలంగాణలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని సూచించింది.

Amit Shah Hyderabad Visit: ఈ నెల 29న హైదరాబాద్‌ కు అమిత్ షా.. సంస్థాగత అంశాలపై సమీక్ష

Rudra

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ విభాగాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సంస్థాగత అంశాలపై సమీక్షించనున్నారు.

Advertisement
Advertisement