రాష్ట్రీయం
Hyderabad Rains: కుతుబ్ షాహీ మసీద్ పై పడిన పిడుగు.. బీటలు వారిన మినార్.. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం.. పొద్దున్నే మళ్లీ మొదలైన వాన
Rudraభారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరవాసులను వణికించింది. నిన్నటి వర్షానికి కుతుబ్ షాహీ మసీద్ పై పిడుగు పడటంతో మినార్ బీటలు వారింది. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
IMD Weather Forecast: వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం, ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
Hazarath Reddyదక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.
Gannavaram Politics: వల్లభనేని వంశీ దారెటు, గన్నవరం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు
Hazarath Reddyగన్నవరం రాజకీయాలు మళ్లీ చర్చల్లోకి వచ్చాయి. తాజాగా వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు ప్రకటించారు. గన్నవరం రాజకీయాల్లోనే తాను కొనసాగుతానని స్పష్టంచేశారు
Hyderabad Rains: హైదరాబాద్‌‌ను కుమ్మేసిన భారీ వర్షం, రాత్రికి ఇంకా కుండపోతగా కురిసే అవకాశం, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyహైదరాబాద్‌లో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్‌ అలెర్ట్‌ జారీ చేయగా.. హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.
Abolition of VRA System: 20,555 మంది వీఆర్‌ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్, ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ సర్కారు, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు
Hazarath Reddyవీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ, వారి పేస్కేల్‌ విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సోమవారం జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతి కుమారి సోమవారం సచివాలయంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు
Polavaram Project: పోలవరంపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన, తొలిదశ పూర్తికి రూ.12,911 కోట్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్, దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సూచన
Hazarath Reddyపోలవరంపై పార్లమెంటు (Parliament) సాక్షిగా కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు (Polavaram project) నిర్మాణం అంటూ తేల్చి చెప్పింది.
Telangana Weather Update: తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ, రాగల 3 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచన
Hazarath Reddyతెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది.
Bandi Sanjay Meets Amit Shah: అమిత్ షాతో బండి సంజయ్ భేటీ, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడి
Hazarath Reddyఢిల్లీ పార్లమెంట్‌ భవనంలోని హోంమంత్రి కార్యాలయంలో సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కలిశారు.ఈ సందర్భంగా గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కేంద్రమంత్రిని కోరారు.
KTR's Birthday: కేటీఆర్ పుట్టినరోజు సంధర్భంగా టమోటాలు పంచిన రాజనాల శ్రీహరి, గతేడాది బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు సందర్భంగా చికెన్, లిక్కర్
Hazarath Reddyమరోసారి రాజనాల శ్రీహరి వెరైటీగా వార్తల్లో నిలిచారు. గతేడాది బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు సంధర్భంగా చికెన్, లిక్కర్ పంచిన రాజనాల శ్రీహరి. ఈసారి మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సంధర్భంగా వరంగల్ చౌరస్తాలో టమాటాలు పంచాడు.
VC Sajjanar Tweet: ఈ చిన్నారి చాలా అదృష్టవంతుడు, పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేయడంపై షాకింగ్ వీడియో ట్వీట్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
Hazarath Reddyచిన్నారులను బయటకు తీసుకెళ్ళినప్పుడు తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం వరించదు.
Video: సిగ్నల్ జంపింగ్ ప్రమాదకరమంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్, ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని మనవి
Hazarath Reddyసిగ్నల్ జంపింగ్ ప్రమాదకరం. తొందరగా వెళ్లాలని సిగ్నల్ జంప్ చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోకండి. ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండని ప్రమాదం జరిగిన వీడియో ద్వారా తెలిపారు.
Andhra Pradesh: ఇకపై అమరావతి మనందరి అమరావతి, సీఆర్డీఏ పరిధిలోని జోన్‌-5లో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
Hazarath Reddyనవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద నేడు రాజధాని అమరావతిలోని జోన్‌-5లో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 50 వేలకుపైగా ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు ఇచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్లు వేసి 50,793 మందికి ఇళ్లు మంజూరు చేశారు
Suicide Caught on Camera: సీసీ ఫుటేజీ ఇదిగో, కదులుతున్న ఆర్టీసీ బస్సు కింద తల పెట్టి సూసైడ్, డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ జరగరాని ఘోరం..
Hazarath Reddyహైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ చౌరస్తాలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన బిసు రాజాబ్ అనే వ్యక్తి కదులుతున్న ఆర్టీసీ బస్సు కింద తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
Tomato Theft Video: సీసీ పుటేజీ ఇదిగో, అర్థరాత్రి మూడు బాక్సుల టమోటాలు ఎత్తుకెళ్లిన దొంగ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఘటన
Hazarath Reddyదేశంలో టమోటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లడం చూస్తున్నాం. అలాగే వారిని హత్య చేసి టమోటా ఆదాయం మీద వచ్చిన డబ్బులను దోచుకెళ్లడం చూస్తున్నాం. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో టమోటాల చోరీ జరిగింది. రాత్రి పూట వచ్చిన ఓ వ్యక్తి మూడు బాక్సుల టమోటాలు ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది.
Telangana: వీడియో ఇదిగో, మద్యం మత్తులో టోల్ గేట్ మేనేజర్‌పై కర్రతో దాడి చేసిన కాంగ్రెస్ నేత, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి ఘటన వీడియో ట్యాగ్ చేసిన బాధితుడు
Hazarath Reddyకామారెడ్డి - భిక్కనూర్ టోల్ ప్లాజా పై, మేనేజర్ మీద స్థానిక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపరి భీమ్ రెడ్డి మద్యం మత్తులో కర్రలతో దాడికి తెగబడ్డాడు. మేనేజర్ తల మీద కర్రతో కొట్టి అర గంట పాటు హంగామా సృష్టించిన భీమ్ రెడ్డిని బైండోవర్ చేసిన పోలీసులు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి వీడియోతో ట్వీట్ చేసిన టోల్ గేట్ మేనేజర్ పవన్.
Video: రూ. 15 లక్షల విలువైన టమాటాల లారీ బోల్తా, దొంగలు ఎత్తుకుపోకుండా రాత్రంతా కాపలా కాసిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వద్ద 15 లక్షల విలువైన టమాటోల లారీ బోల్తా పడగా టమాటో అధిక ధరల వల్ల దొంగలు ఎత్తుకుపోకుండా పోలీసులు కాపలా కాయాల్సి వచ్చింది.
Telangana: టీవీ కేబుల్ వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్, స్తంభంపైనే యువకుడు మృతి, కంటతడి పెట్టిస్తున్న వీడియో ఇదిగో...
Hazarath Reddyతెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి - చేవెళ్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హై ఓల్టేజ్ విద్యుత్ స్తంభంపై నేపాల్ కు చెందిన అనిల్ (21) విద్యుత్ షాక్ తగిలి స్తంభంపైనే మృతి చెందాడు, ప్రొక్లెయినర్ సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. దీనికి సంబంధించిన వీడియోను చూసి అందరూ కంటతడి పెడుతున్నారు.
Bogatha Waterfall: తెలంగాణ నయాగార జలపాతం వీడియో ఇదిగో, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతోన్న బొగత జలపాతం
Hazarath Reddyతెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లా, వాజేడు మండలంలోని చీకుపల్లిలో ఉన్న బొగత జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వీడియో ఇదిగో..
Ramachandrapuram Politics: ఆయన నాకు గురువుతో సమానం, బోస్ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, వేణుకి టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపిన ఎంపీ
Hazarath Reddyరాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ (Pilli Subhash Chandrabose) చేసిన వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పందించారు. సుభాష్ చంద్రబోస్ తనకు గురువుతో సమానమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడబోనని వేణు చెప్పారు.
AP Weather Forecast: ఉత్తరాంధ్ర జిల్లా­లకు భారీ వర్ష ముప్పు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు పడతాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyఏపీ రాష్ట్రంపై ఉపరి­తల ఆవర్తనం, రుతు పవన ద్రోణులు ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఏపీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న­ట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లా­ల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది