రాష్ట్రీయం

HYDRA Demolitions: హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం, కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి తాము వెళ్లబోమని, కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామని కమిషనర్ (హైడ్రా) రంగనాథ్ తెలిపారు. అంటే జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు.

Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ నినదించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ వంతపాడిన మంత్రి పొన్నం ప్రభాకర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినదించారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ బీఆర్ఎస్ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ వంత పాడారు.

Telangana: పబ్జి గేమ్ ద్వారా పరిచయమైన యువకుడు మాటలు నమ్మి ఆన్‌లైన్‌లో రూ. 3 లక్షలు బెట్టింగ్, మోసపోయానని తెలుసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Hazarath Reddy

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు యువకుడు బలయ్యాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండవుతాపురం గ్రామానికి చెందిన మరుపట్ల హనూక్(25) అనే యువకుడికి పబ్జి గేమ్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు.

Telangana: వీడియో ఇదిగో, ఓవర్ టేక్ చేయబోయి లారీ, బస్సు మధ్యలో పడ్డ బైకర్, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు

Hazarath Reddy

తెలంగాణలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి పట్టణంలో గణేష్ చౌక్ వద్ద ఓ బైకర్ అతి వేగంగా వెళ్లి లారీ, బస్సు మధ్యలో ఇరుక్కుపోయాడు. మజూద్ అనే యువకుడు బైక్ అతి వేగంగా నడుపుతూ లారీ బస్సు మధ్యలోకి దూసుకువెళ్లాడు, అయితే అదుపుతప్పి పడిపోయాడు.

Advertisement

Chain Snatching in Guntur: వీడియో ఇదిగో, తాడేపల్లిలో ఐదు నిమిషాల్లోనే రెండు చోట్ల చైన్ స్నాచింగ్స్, రోడ్లపై వచ్చేందుకు వణికిపోతున్న మహిళలు

Hazarath Reddy

గుంటూరు జిల్లా తాడేపల్లి(Tadepalli)లో చైన్ స్నాచర్లు(Chain snatchers) రెచ్చిపోతున్నారు. తాజాగా తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి(Kothur Anjaneya Swamy Temple) సెంటర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మేడలో బంగారు గొలుసు(Gold Chain) లాక్కుని పారిపోయారు.

Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుకు రంగం సిద్దం, థియేటర్ కు షోకాజ్ నోటీసులిచ్చిన చిక్కడపల్లి పోలీసులు

Hazarath Reddy

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. తాజాగా సంధ్య థియేటర్‌కు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు.

Sandhya Theater Stampede Row: వీడియో ఇదిగో, శ్రీతేజ్‌కు ఆక్సిజన్‌ అందక బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయింది, 13 రోజులుగా చికిత్స కొనసాగుతుందని తెలిపిన సీపీ సీవీ ఆనంద్

Hazarath Reddy

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చిన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌.. వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినాతో కలిసి గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు

Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం, థియేటర్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

Hazarath Reddy

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. తాజాగా సంధ్య థియేటర్‌కు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు.

Advertisement

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Hazarath Reddy

ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో మాజీ మంత్రి, BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. గవర్నర్‌ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

Narendra Varma Raju Vegesana: వీడియో ఇదిగో, మందేసి చిందేసి బీజేపీ నేతకు ముద్దులు పెట్టిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ బర్త్‌డే పార్టీలో రచ్చ చేసిన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ

Hazarath Reddy

సతీష్‌ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్‌ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందని గుసగుసలాడుకోగా.. వీడియో చూసిన జనం తాగితే తాగారు గానీ... ఎమ్మెల్యేగా ఉండి బుగ్గలు నిమరడాలు, ముద్దులు పెట్టడాలు ఏమిటంటూ చీదరించుకుంటున్నారు.

One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ, ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Hazarath Reddy

లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డీఎంకే సూచించింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, 48 గంటల్లో బెల్ట్ షాపులన్నీ సీజ్ చేయకపోతే నేనే రంగంలోకి దిగుతా, ఎక్సైజ్ శాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Hazarath Reddy

ఏపీలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది.ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ రూపంలో మళ్లీ పాత విధానం అమలులోకి వచ్చింది. తాజాగా మద్యం అమ్మకాలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, బుల్డోజర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 20 నుంచి 30 మంది వరకు గాయాలు

Hazarath Reddy

తిరుపతిలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్డోజర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 నుంచి 30 మంది వరకు గాయాలు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హరీష్‌ రావు వ్యాఖ్యలపై మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను బీఆర్ఎస్ తప్పువదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?’’ భట్టి సవాల్ విసరగా.. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సై అన్నారు.

Telangana Assembly Session 2024: ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు, ఇలాగే కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో రూ. 6,36,040 కోట్లుఅవుతుంది, అసెంబ్లీలో మండిపడిన హరీష్ రావు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడాది పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌పై శాస‌న‌స‌భ‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్ర‌మే అప్పు తీసుకున్నామ‌ని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లగచర్ల రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్

Hazarath Reddy

నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు.

Advertisement

Student Suicide in Hyderabad: నారాయణ స్కూల్ లో మరో విద్యార్థి ఆత్మహత్య.. హయత్ నగర్ లో ఘటన (వీడియో)

Rudra

నారాయణ స్కూల్స్ లో విద్యార్థులు ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్ లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

TTD Arjita Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. రేపు ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల.. 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమ‌ల‌, అర్చన‌, అష్టదళ పాదపద్మారాధన మార్చి నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌ లైన్‌ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Telangana: తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు 5 గంటలకుపైగా కేబినెట్‌ భేటీ జరిగింది.ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్‌ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్‌ మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సోమవారం ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి.

Advertisement
Advertisement