రాష్ట్రీయం

Avanthi Srinivas: వైసీపీకి బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, రాజీనామా లేఖను జగన్‌కు పంపించిన అవంతి..జనసేనలో చేరే అవకాశం!

Arun Charagonda

ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడగా తాజాగా వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. పార్టీ, పదవులకు రాజీనామా చేసిన ఆయన...తన రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు.

Telangana Shocker: ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి, ట్రేడింగ్‌లో కొడుక్కి నష్టాలు రావడంతో గడ్డి మందు తాగిన కుటుంబం..నలుగురు మృతి

Arun Charagonda

ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి అయింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటకు చెందిన శివప్రసాద్(26) అప్పు చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేశాడు. అందులో నష్టాలు రావడం, అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి ఎక్కువవడంతో తండ్రి మొండయ్య(60), తల్లి శ్రీదేవి(54), అక్క చైతన్య(30)తో కలిసి గడ్డి మందు తాగాడు.వరంగల్ ఏంజీఏం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు.

Warangal: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి, మాదన్నపేట చెరువు మత్తడి వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు...వీడియో

Arun Charagonda

వరంగల్ - నర్సంపేట పట్టణంలో నర్సింహులు పేటకు చెందిన ముగ్గురు యువకులు నర్సంపేటలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాదన్నపేట చెరువు మత్తడి వద్ద వారి కారు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. దీంతో వెంటనే ఇద్దరిని కాపాడగా.. మరో యువకుడు మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

CM Revanth Reddy: UPSC విజేతలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకం ద్వారా రూ.లక్ష ఆర్ధిక సాయం అందించిన ప్రభుత్వం

Arun Charagonda

తెలంగాణ నుంచి #UPSC సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రజా ప్రభుత్వం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వారిలో 20 మంది అభ్యర్థులు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు

Advertisement

KTR Open Letter To Rahul Gandhi: మూట‌ల‌పై ఉన్న శ్ర‌ద్థ‌, మీరిచ్చిన మాట‌ల‌పై లేదా? రాహుల్ గాంధీకి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

VNS

చేతి గుర్తుకు ఓటేస్తే చేతగానీ ముఖ్యమంత్రిని తెలంగాణపై రుద్దారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కార్‌ వల్ల అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతివర్గం అరిగోస పడుతోందని అన్నారు. ప్రగతి పథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మీ తీరును చూసి నాలుగు కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని మండిపడ్డారు.

Manchu Manoj Bindover: మంచు ఫ్యామిలీ వివాదంలో కీల‌క ప‌రిణామం, రాచ‌కొండ క‌మిష‌న‌ర్ ముందు మంచు మ‌నోజ్ బైండోవ‌ర్

VNS

మంచు మనోజ్ ను పోలీసులు బైండోవర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు స్పష్టం చేశారు.

Droupadi Murmu Telangana Tour: తెలంగాణ‌లో రాష్ట్రప‌తి ప‌ర్య‌ట‌న ఖరారు, మ‌హిళావ‌ర్సిటీతో పాటూ ప‌లు ప్రాంతాల్లో టూర్

VNS

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీ (Telangana Women University) శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 17న రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు ఆమె తెలంగాణలో గడపనున్నారు

Cold Wave in Telugu States: హైద‌రాబాద్ గ‌జ‌గ‌జ‌, రాబోయే రోజుల్లో మ‌రింత చలి తీవ్ర‌త పెరిగే అవ‌కాశం, ఏపీలోనూ పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు

VNS

బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.7 డిగ్రీలు తగ్గి 29.3 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.3 డిగ్రీలు తగ్గి 17.7 డిగ్రీలు, గాలిలో తేమ 43శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) అధికారులు వెల్లడించారు.

Advertisement

Allu Arjun Approached High Court: హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్, సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో కేసు కొట్టివేయాల‌ని పిటీష‌న్

VNS

హీరో అల్లు అర్జున్‌ హైకోర్టును (High Court) ఆశ్రయించాడు. హైదరాబాద్‌ ఆర్జీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్‌ దాఖలు చేశాడు.

AP SSC Exam Date 2025: ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలో ప్రభుత్వ పరీక్షల విభాగం రూపొందించి ప్రభుత్వానికి పంపడం జరిగింది. దీనికి ప్రభుత్వం ఆమోదం లభించింది. తాజాగా పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేశారు.

Hyderabad Fire: వీడియో ఇదిగో, హైదరాబాద్‌ నాంపల్లి పెట్రోల్ బంక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం, పరుగులు పెట్టిన స్థానికులు, నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేత

Hazarath Reddy

హైదరాబాద్‌ నాంపల్లిలోని ఏక్‌మినార్ కూడలి వద్ద హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ నింపడానికి హిందూస్థాన్ పెట్రోలియం ట్యాంకర్ వచ్చింది. ఈ సమయంలో ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు, పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరుగు తీశారు.

Telangana: వీడియో ఇదిగో, రెండు కరెంట్ స్థంభాల మధ్యలో ఇరుక్కుపోయిన ఆటో, భయంతో కేకలు పెట్టిన విద్యార్థులు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బై పాస్ రోడ్డు లో స్కూల్ నుండి విద్యార్దులను ఇంటికి తీసుకెతున్న ఆటో బ్రేకులు ఫెయిల్ అయ్యి రోడ్డు కిందకు వెళ్లి రెండు స్తంభాల మధ్య ఇరుక్కుపోయింది.

Advertisement

Jagan Slams Chandrababu Govt: బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంది, మరి ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన వైఎస్ జగన్

Hazarath Reddy

కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని, దీనికి మూలాలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మొదలయ్యాయని కూటమి నేతలు ఆరోపణలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రేషన్‌ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, అలజడిగా మారిన సముద్రం, అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం

Hazarath Reddy

విశాఖ ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.తాజాగా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం ఉంది. తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని క్లాస్ నుండి బహిష్కరించిన యాజమాన్యం, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్

Hazarath Reddy

హైదరాబాద్ లో ఓ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కొంపెల్లిలోని ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్‌లో అయ్యప్ప మాల వేసుకున్నాడని ఓ విద్యార్థిని క్లాస్ రూమ్‌కి అనుమతించకుండా ఇంటికి పంపింది స్కూల్ యాజమాన్యం. అ ఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. స్కూలు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

BRS Vinod Kumar: కమీషన్లు అన్నం పెట్టవు..వేల టీఎంసీల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు..సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్.. ఎస్సారెస్పీ ఫేస్ 1, ఫేస్ 2కు నీళ్లు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెప్తున్నారు అన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం...రైతులకు యాసంగి పంట ముఖ్యమైందన్నారు.

Advertisement

Gas Cylinder Explosion: వీడియో ఇదిగో, గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు, భారీగా ఆస్తి నష్టం

Hazarath Reddy

గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు అయిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోస పహాడ్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్దం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Manchu Family Dispute: ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదు, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబు

Hazarath Reddy

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు పంపించారు. బుధవారం ఉదయం విచారణకు రమ్మని పిలిచారు. దీంతో పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Weather Forecast: ఏపీలో అయిదు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింతగా బలపడనున్న అల్పపీడనం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది .

Telangana: సారంగపూర్ కేజీబీవీ స్కూల్‌లో విద్యార్థులకు అస్వస్థత, ఆరుగురిని ఆస్పత్రికి తరలింపు...పరిస్థితి నిలకడగా ఉందన్న డాక్టర్లు

Arun Charagonda

జగిత్యాల జిల్లా సారంగపూర్ KGBV పాఠశాలలో అస్వస్థత కు గురయ్యారు విద్యార్థులు. ఆరుగురు విద్యార్థులకు అస్వస్థతకు గురికాగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర చలితో కాళ్లు చేతులు తిమ్మిర్లు వచ్చాయని తెలియగా ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు వైద్యులు.

Advertisement
Advertisement