ఆంధ్ర ప్రదేశ్

CM Jagan Counter To Sharmila: వివేకాకు రెండో భార్య ఉందన్న మాట నిజం కాదా? చంద్ర‌బాబు కుట్ర‌లో ష‌ర్మిల‌, సునిత పావులుగా మారారంటూ తీవ్రంగా ఆరోపించిన వైయ‌స్ జ‌గ‌న్

VNS

వైఎస్ వారసులెవరో ప్రజలే చెప్పాలన్నారు. వైఎస్ఆర్ వ్యతిరేకులతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలు కుట్రలో భాగం అయ్యారు. పసుపు చీరలు కట్టుకొని వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వైఎస్ఆర్ వారసులు అంటూ షర్మిలను (Sharmila) ఉద్దేశించి జగన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

Theenmar Mallanna: నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

Rudra

నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ ను బరిలో దింపుతున్నట్లు వెల్లడించింది.

Srikakulam Memantha Siddham Sabha: ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారని టెక్కలి సభలో ప్రసంగించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. నేటితో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగిసింది. 22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగింది

Sri Sri Jayanthi: ఏప్రిల్ 30న శ్రీ శ్రీ జయంతి, తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన రచయిత గురించి ప్రత్యేక కథనం ఇదిగో..

Vikas M

విప్లవ రచయితగా, అభ్యుదయ వాదిగా, సినీ రచయితగా, ప్రముఖ జర్నలిస్టుగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా… తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన అతికొద్ది మంది రచయితల్లో శ్రీశ్రీ ఒకరు.1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పటకొండ దంపతులకు జన్మించాడు.

Advertisement

Andhra Pradesh: హిందూపురంలో దారుణం, ఆవుల్ని వధించనని చెప్పినందుకు ముస్లిం యవకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన నిర్వాహకులు, వీడియో ఇదిగో...

Hazarath Reddy

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అక్రమంగా నడుపుతున్న కబేళాలో పశువులను వధించాలని పరిగికి చెందిన వాజిద్‌ను తీసుకెళ్లిన నిర్వాహకులు. కాని అక్కడ ఎద్దులకు బదులు ఆవులు కనిపించడంతో వాటిని వధించేందుకు వాజిద్ నిరాకరించాడు. దీంతో ఫోన్ దొంగలించావంటూ వాజిద్ పై అబద్ధపు ఆరోపణులు చేసి అతన్ని స్తంభానికి కట్టేసి కొట్టిన వ్యాపారులు.

Stone Pelting Attack on Jagan: సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు, నిందితుడు సతీష్‌కు 3 రోజులు డిమాండ్ విధించిన కోర్టు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ1గా ఉన్న సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించ్చింది. ఈ నేపథ్యంలో సతీష్‌ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. కాగా, న్యాయవాది సమక్షంలో సతీష్‌ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

Kavali Road Accident: కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.

Vizianagaram Memantha Siddham: తండ్రి సమానులు అని సీఎం జగన్ చెప్పగానే భావోద్వేగానికి గురైన బొత్సా సత్యనారాయణ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మంత్రి బొత్స సత్యనారాయణను పరిచయం చేసినప్పుడు ప్రజల హర్షధ్వానాలు పెద్ద ఎత్తున మిన్నంటాయి. ఆ సమయంలోనే మంత్రి బొత్సను ప్రత్యేకంగా తనకు తండ్రి సమానులని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరినప్పుడు జనం కేరింతలు కొట్టగా మంత్రి బొత్స ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యం చూసిన ప్రజలు, అభిమానులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు.

Advertisement

CM Jagan Memantha Siddham Yatra: రేపటితో ముగియనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర, 21 రోజులు పాటు 22 జిల్లాల్లో పర్యటించిన సీఎం జగన్, 15 భారీ బహిరంగ సభల్లో ప్రసంగం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజు షెడ్యూల్‌ను సీఎంఓ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. బుధ­వారం శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్‌ బస్సు యాత్ర ముగి­యనుంది

Vizianagaram Memantha Siddham Sabha: ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయి,చెల్లూరు మేమంతా సిద్ధం సభలో ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగిన సీఎం జగన్

Hazarath Reddy

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు.

Visakhapatnam Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ మీద వేగంగా వెళ్తూ అంబులెన్స్‌ను ఢీ కొట్టిన ఇద్దరు యువకులు, అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

విశాఖలోని లీలమహల్ జంక్షన్ లో ఘోర దుర్ఘటన. అర్ధరాత్రి బైక్ పై ఓవర్ స్పీడ్ లో వెళ్తూ అంబులెన్స్ ను ఢీ కొట్టిన ఇద్దరు యువకులు. అక్కడికక్కడే దుర్మరణం.

Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ ఆస్తులు వివరాలు ఇవిగో, పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన అధినేత

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ ఈసారి పిఠాపురం(Pithapuram) ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల నామినేషన్‌ను మంగళవారం నాడు దాఖలు చేశారు పపన్. ఈ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు.

Advertisement

Allu Arjun Deepfake: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కూ తప్పని ‘డీప్ ఫేక్’ ముప్పు.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోల సృష్టి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో.. మీరూ చూడండి!

Rudra

ఇటీవలే అమీర్ ఖాన్, రణవీర్ సింగ్‌ లు డీప్‌ ఫేక్ వీడియోల బారిన పడిన విషయం మరిచిపోక ముందే.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కు కూడా డీప్ ఫేక్ సెగ తగిలింది.

Andhra Pradesh Elections 2024: పులివెందులలో సీఎం జగన్‌ తరఫున నామినేషన్ దాఖలు, ఈ నెల 25వ తేదీన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున నామినేషన్‌ దాఖలు అయ్యింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సోమవారం సీఎం జగన్‌ తరఫున ఒక సెట్‌తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు.

Andhra Pradesh: కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన దుండగులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రాజమండ్రి రూరల్ కడియంలో పెళ్లి జరుగుతుండగా కొందరు దుండగులు కంట్లో కారం కొట్టి పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Andhra Pradesh Elections 2024: ఏపీ నుంచి మరో 38 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌, పూర్తి లిస్టు ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చారు

Advertisement

AP SSC 10th Result 2024 Out: ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదల,  విద్యార్థులు తమ రిజల్ట్స్ ను Manabadi, bse.ap.gov.in ద్వారా చెక్  చేసుకోండి 

Hazarath Reddy

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను సోమవారం(నేడు) విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ వెబ్‌సైట్‌లో 2023–24 టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు.

AP SSC Results 2024: నేడే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న విద్యా కమిషనర్‌

Rudra

ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేయనున్నారు.

2024 భారతదేశం ఎన్నికలు: మా అన్న‌య్య జోలికి వ‌స్తే స‌హించేది లేదు! చిరంజీవిపై స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్

VNS

చిరంజీవి అజాత శ‌త్రువు అని, ఆయ‌న జోలికొస్తే స‌హించేది లేద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని హెచ్చ‌రించారు. ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర్సాపురంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. స‌జ్జ‌ల‌కు డ‌బ్బు, అధికారం ఎక్కువైంద‌ని మండిప‌డ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింహం కాదు.. గుంట‌న‌క్క‌లు, తోడేళ్ల బ్యాచ్ అని ఆరోపించారు.

2024 భారతదేశం ఎన్నికలు: ఏపీలో కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్ధులు ఖరారు, ఏయే స్థానాల్లో ఎవ‌రు పోటీ చేస్తున్నారంటే?

VNS

విజయవాడ నుంచి వల్లూరు భార్గవ్ పోటీ చేయనున్నారు. విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను పోటీ చేస్తారు. కాగా, ఇవాళ ఝార్ఖండ్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరి పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement