ఆంధ్ర ప్రదేశ్
Students Fight in College: వీడియో ఇదిగో, విశాఖపట్నం కృష్ణా కాలేజీ ఆవరణలో తన్నుకున్న విద్యార్థులు, ఆరుమందికి గాయాలు
Hazarath Reddyవిశాఖలోని మద్దిలపాలెం డాక్టర్ వి.ఎస్. కృష్ణా కాలేజీ ఆవరణలో సోమవారం కొట్లాట. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక వర్గం తరుపు నుండి బయట వ్యక్తులు రావడంతో గొడవ పెరిగింది. ఒకరినొకరు కొట్టుకోవడంతో కృష్ణా కాలేజ్ మొత్తం యుద్ధ వాతావరణం తలపించింది. కొట్లాటలో ఆరుగురికి గాయాలయ్యాయి.
CM Jagan Request To PM Modi: అయ్యా.. మీరే బటన్‌ నొక్కండి, ప్రధాని మోదీకి సీఎం జగన్ రిక్వెస్ట్, నాకు కావాల్సిందల్లా మా ప్రజలకు మంచి జరగడమేనని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyపోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంలో నేను ప్రధాని మోదీకి ఒక్కటే చెప్పాను. అయ్యా.. మీరే బటన్‌ నొక్కండి.. నిర్వాసితుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ చేయండి. నాకు కావాల్సిందల్లా మా వాళ్లకు మంచి జరగాలని చెప్పాను. త్వరలోనే ఇవ్వాల్సినవన్నీ అందుతాయి
CM Jagan on Polavaram Project: 2025 ఆగస్ట్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపిన సీఎం జగన్, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలస్యం అయిందని వెల్లడి
Hazarath Reddy2025 ఆగస్ట్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము ప్రస్తుతం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టడంతో పాటు స్పిల్ వే పనులు పూర్తి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పోలవరం ఆలస్యమైందన్నారు.
CM Jagan Congratulates to Kunavaram SI: గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్, కూనవరం ఎస్సై బి.వెంకటేష్‌కు సీఎం జగన్ అభినందనలు
Hazarath Reddyకూనవరం ఎస్సై బి.వెంకటేష్ ను అభినందించిన సీఎం వైఎస్ జగన్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన ఎస్సై వెంకటేష్ కి మెడల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సిఫార్సు చేశారు.
Andhra Pradesh Horror: నెల్లూరు జిల్లాలో దారుణం, కోడలితో సహా ముగ్గురిని కత్తులతో నరికి చంపిన అత్తింటి వారు, నిందితులంతా పరారీలో..
Hazarath Reddyనెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం కొండబిట్రగుంటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులను దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
Punganur Violence Case: పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మంది అరెస్ట్, 72కు చేరుకున్న మొత్తం అరెస్ట్ అయిన వారి సంఖ్య
Hazarath Reddyచిత్తూరు జిల్లాలోని పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 72కు చేరుకుంది.
Andhra Pradesh: వేలిముద్రతో అమ్మఒడి డబ్బు కాజేసిన వాలంటీర్‌, డబ్బులు అడిగితె ఇంకా పడలేదు వస్తే ఇస్తా అంటూ బుకాయిస్తున్నాడని మహిళ ఆవేదన
Hazarath Reddyనెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగినేనిగుంట గ్రామానికి మీరావళి అన్న కుమారుడు ఖాసీం పీర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా లబ్దిదారు హుస్సేనమ్మ వేలిముద్ర తీసుకున్న వాలంటీర్.. అమ్మఒడి డబ్బులు తన అకౌంట్ లోకి మళ్లించాడు.
Chandrababu on Work From Home to Police: వీడియో ఇదిగో, పోలీసులకు వర్క్ ఫ్రం హోం పెట్టాలని ఆలోచిస్తున్నా, చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyచంద్రబాబు నాయుడు తన పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు వర్క్ ఫ్రం హోం పెట్టాలని ఆలోచిస్తున్నా చేస్తున్నానని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వీడియో ఇదిగో..
Chandrababu on liquor Policy: సాయంత్రం అయితే నా తమ్ముళ్లకు ఓ పెగ్గు పడాల్సిందే, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇక్కడ నా తమ్ముళ్లు మందు బాబులు ఉంటారు.. రోజంతా కష్టపడతారు, ఒక పెగ్గు వేసుకోవాలి అనుకుంటారు. కానీ రేట్లు పెరిగిపోయాయి, నాసిరకం సరుకు అమ్ముతున్నారని చంద్రబాబు నాయుడు ఏపీ మద్యం పాలసీపై మండిపడ్డారు. వీడియో ఇదిగో..
Kodali Nani on Pawan Kalyan: చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతాం, కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyపవన్ కళ్యాణ్‌కు కొడాలి నాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతామని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..
CM Jagan on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యం, ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దాన్ని తీర్చేందుకు మీ బిడ్డ ఉన్నాడని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyపోలవరం విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారు. మీ బిడ్డ అలా చేయడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది మీ కోసమే అన్నది మరిచిపోవద్దు. ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దాన్ని తీర్చేందుకు మీ బిడ్డ ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.
CM Jagan Kunavaram Tour: డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం ప్రభుత్వానికి లేదు, కూనవరంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఅల్లూరి సీతారామరాజు, ఏలూరులో జిల్లాలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద బాధితులకు నిత్యవసరాలు అందించాం, ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ10 వేలు ఇవ్వాలని ఆదేశించాం.
Video: పుల్లుగా తాగి మహిళ మీద పడిన ముందుబాబు, పట్టుకుని చితక్కొట్టిన మహిళలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలపురంలో ఓ వ్యక్తి మద్యం తాగి మహిళలతో అసభ్య పదజాలంతో దూషిస్తూ, అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఆ వ్యక్తిని చంప చెల్లుమనిపించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
AP Horror: నదిలో విసిరేస్తే.. చేతికి అందిన పైపు పట్టుకుని చిమ్మ చీకట్లో అరగంట అలాగే వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్న బాలిక.. 'శభాష్ కీర్తన' అంటూ నెట్టింట్లో ప్రశంసలు.. అసలేం జరిగింది??
Rudraమీరు చదువుతున్న ఈ వార్త వింటే, మీ కాళ్ల కింద భూమి కంపించవచ్చు. ఎంతటి ధైర్యస్థులైనా.. 13 ఏండ్ల ఈ బాలిక చూపించిన తెగువ, సమయస్ఫూర్తికి శభాష్ అనకుండా ఉండలేరు.
Andhra Pradesh Shocker: కోనసీమలో దారుణం, తల్లి, ఇద్దరు పిల్లలను గోదావరి నదిలో తోసేసి పారిపోయిన నిందితుడు, 13 ఏళ్ల బాలికను రెస్క్యూ చేసి కాపాడిన ఏపీ పోలీసులు...
kanhaఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రావులపాలెం గౌతమి గోదావరి వంతెన మీద నుంచి ఓ మహిళను ఆమె ఇద్దరు పిల్లలను నిందితుడు నదిలోకి తోసేసి కారులో పారిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతు కాగా 13 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. గల్లంతైన మహిళ స్వస్థలం తాడేపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు.
Accident in AP: విహారయాత్రలో విషాదం.. తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం.. కారు కాల్వలో పడి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
Rudraవిహారయాత్రలో ఆనందంగా గడిపి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు విద్యార్థులను ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
YV Subba Reddy Comments On Vizag: దసరా తర్వాత విశాఖకు పర్మినెంట్‌గా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి
VNSవిశాఖ రాజధాని అంశంపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలన రాజధాని (AP Administrative Capital) కాబోతుందన్నారు. లీగల్ ఇష్యూస్ వల్లే కాస్త ఆలస్యం అవుతోందన్నారు. మరో రెండు మూడు నెలల్లో సీఎం జగన్ (CM YS Jagan) విశాఖ రాబోతున్నారని చెప్పారాయన.
Tirumala Viral Video: తిరుమల కొండపై ఎలుగుబంటి సంచారం, వీడియో వైరల్
kanhaతిరుమలలో ఎలుగు బంటి సంచారం. స్థానిక బాలాజీ నగర్ బాల గంగమ్మ ఆలయం వద్ద సంచరించిన ఎలుగు బంటి.
TTD New Chairman: టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి నియామకం..
kanhaతిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం వారం రోజుల్లో ముగియనుండడంతో TTD చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు.
Tirupati Shocker: తిరుపతి - ఉంగుటూరులో దారుణం ఘటన ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య
kanhaప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య, తిరుపతి - ఉంగుటూరు మండలం నారాయణపురంలో చంద్రశేఖర్ అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. చంద్రశేఖర్ కొన్నేళ్లుగా టైల్స్ పరిశ్రమలో సూపర్వైజర్ పని చేస్తూ ఇక్కడే నివాసముంటున్నారు. ప్రియుడి మోజులో భువనేశ్వరి భర్తను చంపింది.