ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం, అక్కడే తేల్చుకుందాం సై అన్న జనసేనాధినేత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ వలంటీర్లపై దురద్దేశపూర్వకంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Rains in Andhra Pradesh: ఏపీలో భారీ వర్షాలు, ఆ రెండు జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు, అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచన

Hazarath Reddy

ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని వాయవ్య బంగళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రాగల రెండు మూడు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా తీరం వెంబడి నిదానంగా పయనించనుంది.

Godavari Floods: గోదావరికి భారీగా వరద, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన

Hazarath Reddy

గోదావరికి భారీగా వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు తెలంగాణలోనూ భారీగా వానలు పడుతున్నాయి. ఫలితంగా గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం, దేవీపట్నం తదితర ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. గోదావరి లోగట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

Sake Bharathi: సాకే భారతి, కూలి పనుల నుంచి పీహెచ్‌డీ పట్టా దాకా, చదువుల తల్లి పట్టుదలకు సలాం కొట్టిన సోషల్ మీడియా, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

చదవాలన్న కసి ఉంటే ఎప్పుడైనా సక్సెస్ కావొచ్చు. పట్టుదలే ఆయుధంగా చదివితే పేదరికం సైతం చిన్నబోతుంది. అవును ఈ సాకే భారతి విషయంలో అది అక్షరాల రుజువైంది. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా ఓ మహిళ అనంతపురం ఎస్‌.కె.యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా తీసుకుంది.

Advertisement

Fish Rain in Srikakulam: వీడియో ఇదిగో, శ్రీకాకుళంలో చేపల వాన, రోడ్డు మీద పాక్కుంటూ వెళుతున్న వందలాది చేపలు

Hazarath Reddy

శ్రీకాకుళం - వజ్రపుకొత్తూరు మండలం వజ్రపు కోనేరు గ్రామంలో చేపల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షంతో పాటు చేపలు కిందపడ్డాయి. గ్రామంలో పలు చోట్ల చేపలు వర్షంతో పాటు చేపలు ప్రత్యక్షమయ్యాయి.

Pawan Kalyan Meets JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన పవన్ కళ్యాణ్, ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు

Hazarath Reddy

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బుధవారం కేంద్ర మంత్రులు అమిత్‌షా, మురళీధరన్‌తో భేటీ అయ్యారు.ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా సాగింది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితరాలపై నడ్డా, పవన్‌ చర్చించినట్లు సమాచారం.

Video: వీడియో ఇదిగో, సైకిల్ పోవాలి అంటూ మళ్లీ నోరు జారిన టీడీపీ నేతలు

Hazarath Reddy

టీడీపీ నేతలు మళ్లీ నోరు జారారు. రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటూ టీడీపీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న సంగతి విదితమే. అయితే ఇక్కడే వారు సైకో బదులుగా సైకిల్ అంటూ నోరే జారేస్తున్నారు.

Andhra Pradesh: ముస్లిం మత పెద్దలతో సీఎం జగన్ భేటీ, మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం పెద్దలు, మత గురువులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి పౌరస్మృతి అంశంపై సీఎంకు తమ అభిప్రాయాలను మత పెద్దలు తెలిపారు.

Advertisement

Padmavati Express Derailed At Tirupati: తిరుపతిలో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్

kanha

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ 6 వ ప్లాట్‌ ఫారంలో ఎక్స్‌ప్రెస్‌లోని ఒక భోగి పట్టాలు తప్పడంతో గుర్తించిన సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. సత్వర చర్యలు చేపట్టిన అధికారులు సమస్యను పరిష్కరించారు. షంటింగ్ చేస్తుండగా బోగీ పట్టాలు తప్పిందని వెల్లడించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.

AP Weather Update: రేపే బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది.

AP Shocker: ఏపీలో దారుణం, గిరిజన యువకుడి నోట్లో పురుషాంగం పెట్టి మూత్రం పోసిన దుండగులు

Hazarath Reddy

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంగోలులో గిరిజన యువకుడి నోట్లో దుండగులు మూత్రం పోశారు. మోటా నవీన్, మన్నె రామాంజనేయులు అలియాస్ అంజి ఇద్దరూ దొంగతనాలు చేసే పాత నేరస్థులు. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తగా నవీన్‌ను.. అంజి మద్యం తాగుదామని కిమ్స్ ఆసుపత్రి వెనకాల వైపు తీసుకువెళ్ళాడు.

Jr NTR Vs Nara Lokesh: ఒంగోలులో Next CM జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీల కలకలం, లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో వివాదంగా మారిన ఫ్లెక్సీ వార్..

kanha

ఒంగోలులో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీల కలకలం, జిల్లాలో నారా లోకేష్ పర్యటన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల ఏర్పాటుతో చర్చనీయాంశంలా వ్యవహారం.

Advertisement

Andhra Pradesh Shocker: తోటికోడలు తిట్టిందని సెల్ టవర్ ఎక్కిన మహిళ, ఆందోళనలో గ్రామ ప్రజలు, వీడియో చూస్తే షాక్ తినాల్సిందే...

kanha

ప్రకాశం - కంభంలో తోటికొడలు తిట్టిందని జియో సెల్ టవర్ ఎక్కి ఓ మహిళ నిరసనకు దిగింది. తోడికోడలు స్వగ్రామమైన పెద్దారవీడులో లక్ష్మీబాయిపై కేసు పెట్టగా విచారణకు పెద్దారవీడు పోలీసులు పిలిచారు.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా, బెయిల్‌ వ్యవహారాలు ఆచితూచి ఉంటాయని తెలిపిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా కీలకమైన అంశమని తెలిపిన ధర్మాసనం... వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది.

Jagananna Thodu: జగనన్న తోడు నిధులు విడుదల చేసిన సీఎం జగన్, చిన్న వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు, సకాలంలో రుణాన్ని చెల్లించిన వారికి రూ.11.03 కోట్ల వడ్డీలు

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ ఏడో విడత నిధులను పంపిణీ చేశారు. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించారు. గతంలో తీసుకున్న రుణాన్ని చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ డబ్బు వారి ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, గోదావరిలోకి దూకి యువతి ఆత్మహత్య, పోలీసులకు క్లూ అందించిన యజమాని పెంపుడు కుక్క

Hazarath Reddy

ఏపీలో ఓ యువతి యానాం - ఎదుర్లంక బ్రిడ్జి మీద చెప్పులు వదిలి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె పెంచుకున్న కుక్క యజమాని ఎంతకు తిరిగిరాకపోయేసరికి ఆమె చెప్పుల వద్దే తిరుగుతూ అక్కడే ఎదురు చూస్తూ గడిపింది.

Advertisement

Project-K Deepika Padukone First Look: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' నుంచి దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ విడుదల.. సీరియస్ లుక్ లో ఆసక్తికరంగా దీపిక ఫస్ట్ లుక్

Rudra

గ్లోబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ సినిమా 'ప్రాజెక్ట్ కే' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాలో దీపికా పదుకొనేకు చెందిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.

Pawan Kalyan on NDA Meeting: ఎన్‌డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం, చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపిన జనసేనాధినేత

Hazarath Reddy

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా...రేపటి సమావేశానికి (ఎన్‌డీఏ సమావేశానికి) సీనియర్‌ నేతలు మమ్మల్ని పిలిచారు.ఎన్‌డీఏ విధానాలు ఎలా ఉండాలా అని ఎదురుచూస్తున్నాం.

Andhra Pradesh: ఏపీలో భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు, ఆదాయం తీసుకొచ్చే శాఖలపై సీఎం జగన్ సమీక్ష, వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలు అన్వేషించాలని సూచన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చే శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరును సీఎం సమీక్షించారు.

Andhra Pradesh Weather Forecast: బంగాళాఖాతంలో 48 గంటల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం, జూలై 17 నుండి 21 వరకు ఏపీలో భారీ వర్షాలు

Hazarath Reddy

ఈ నెల 17 నుంచి జూలై 21 వరకు రానున్న ఐదు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తరాదిలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Advertisement
Advertisement