ఆంధ్ర ప్రదేశ్

AP Assembly Elections 2024: మళ్లీ జగన్ సర్కారుదే అధికారం, నవరత్నాలే కారణం, సినీ నటుడు సుమన్ ఆసక్తిర వ్యాఖ్యలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అంద­జేయడంతో మరోసారి వైఎస్సార్‌ సీపీ ప్రభు­త్వం ఏర్పడుతుందని సినీనటుడు సుమన్‌ చెప్పారు.

CM Jagan in Delhi: ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, ఏపీకి రావలసిన నిధులు,బకాయిలపై చర్చ, హోంమంత్రి, ఆర్థికమంత్రిలతో కూడా సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలపై ధ్వజమెత్తే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Rains In AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే?

VNS

నైరుతి రుతుపనాల (Monsoon) ప్రభావంతో ఆంధ్రప్రదేశంలో వర్షాలు (Rains in AP) కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా

Daggubati Purandeswari: ఏపీ బీజేపీ కొత్త బాస్ దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ ప్రస్థానం ఇదిగో, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి..

Hazarath Reddy

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది. సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించినప్పటికీ... చివరకు ఊహించని విధంగా ఆ పదవి పురందేశ్వరికి దక్కింది.

Advertisement

BJP Appoints New State Chiefs: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన బీజేపీ అధిష్ఠానం

Hazarath Reddy

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ మంగళవారం తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు రాష్ట్ర చీఫ్‌లను నియమించింది. కాంగ్రెస్ టర్న్‌కోట్ సునీల్ జాఖర్‌కు పంజాబ్ బాధ్యతలు దక్కగా, బాబులాల్ మరాండీ.. జార్ఖండ్ యూనిట్‌ను చూసుకుంటారు

Bareddy Anusha: టీమిండియాకు సెలక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ క్రికెటర్ బారెడ్డి అనూష, బంగ్లాదేశ్‌ టోర్నీలో భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం

Hazarath Reddy

అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడ్డి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.

Chittoor Dairy Restoration: చంద్రబాబు వెన్నుపోటు వీరుడు, పవన్‌ ప్యాకేజీ శూరుడు, చిత్తూరు వేదికగా మండిపడిన సీఎం జగన్, చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు భూమి పూజ

Hazarath Reddy

హెరిటేజ్‌ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు.

Miss Shetty Mr Polishetty: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ఆగస్టులో విడుదల

Rudra

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.

Advertisement

Earthquake in JK: జమ్ముకశ్మీర్‌ లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 4.7 తీవ్రత నమోదు

Rudra

జమ్ముకశ్మీర్‌లో భూకంపం చోటుచేసుకుంది. నేటి ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదైంది.

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం కారణంగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

LPG Price Hike: మరోసారి గ్యాస్‌ మంట.. కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 వాత.. ఢిల్లీలో రూ. 1,780కి చేరిన ఎల్పీజీ

Rudra

మరోసారి గ్యాస్‌ మంట భగ్గుమన్నది. ఎల్పీజీ ధరలను ఆయిల్ కంపెనీలు మళ్లీ పెంచాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో జనం అల్లాడిపోతుండగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 పెంచాయి.

Sri Lankan REP Met CM Jagan: శ్రీలంకలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించండి, సీఎం జగన్‌ను కోరిన శ్రీలంక ప్రతినిధులు

Hazarath Reddy

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీలంక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీలంక ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సెంథిల్‌ తొండమాన్‌, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరన్‌, ఇతర అధికారులు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా తమ దేశంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని శ్రీలంక ప్రతినిధులు కోరారు.

Advertisement

Anam Jayakumar Reddy Joins YSRCP: నెల్లూరులో టీడీపీకి షాక్, వైసీపీ కండువా కప్పుకున్న ఆనం జయకుమార్‌రెడ్డి,సీఎం​ వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

Hazarath Reddy

నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం​ వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరడం గమనార్హం. సోమవారం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లిన ఆనం జయకుమార్‌రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Vande Bharat Express: ఏపీకి మరో వందేభారత్ రైలు, విజయవాడ-చెన్నై మీదుగా రాకపోకలు సాగించనున్న ట్రైన్, ఈ నెల 7న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Hazarath Reddy

ఏపీలో మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈనెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

AP Weather Forecast: ఏపీలో మూడు రోజులు అలర్ట్, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం మధ్య భాగాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంపైకి వాయవ్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ తెలిపారు.

146 New Ambulances in AP: 146 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్, 108 సేవల కోసం ఏటా రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

Hazarath Reddy

వైద్యరంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు మరో దిశగా ముందడుగు వేసింది. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌­లను కొనుగోలు చేసింది

Advertisement

Weather Forecast: దేశంలో పలు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో ఈవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐంఎడీ

Hazarath Reddy

ఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. IMD ప్రకారం, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, రాయలసీమ, బీహార్‌లోని ఘాట్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

YS Sharmila: త్వరలోనే కాంగ్రెస్‌ లోకి షర్మిల.. తనకు సమాచారం ఉందన్న కేవీపీ.. కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామన్న కేవీపీ

Rudra

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పందించారు.

Tirumala Update: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. సర్వదర్శనానికి 24 గంటల సమయం.. పూర్తిగా నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీవారు స్వయంగా కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వారాంతం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నుంచి ఇక్కడ భారీ రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

Trains Cancelled: నేటి నుంచి 24 రైళ్లు రద్దు.. మరో 22 ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా.. 9వ తేదీ వరకు.. ఆపేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటన.. ట్రాక్ మెయింటనెన్స్ పనుల నేపథ్యంలో నిర్ణయం

Rudra

హైదరాబాద్ (Hyderabad), సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్ల పరిధిలో ట్రాక్ మెయింటనెన్స్ పనుల కారణంగా పలు రైళ్లను (Trains) తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement