ఆంధ్ర ప్రదేశ్

Welfare Schemes in AP: ప్ర‌తి ఒక్క‌ ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లాలని సీఎం జగన్ ఆదేశాలు, అర్హ‌త ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ అభివృద్ధి సంక్షేమ ఫ‌లాలు అందడమే సీఎం జగన్ లక్ష్యమని తెలిపిన మంత్రి జోగి రమేష్

Hazarath Reddy

అర్హ‌త ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ అభివృద్ధి సంక్షేమ ఫ‌లాలు చేరాలన్న‌ది సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక‌ల్పం. ఇందుకోసం ప్ర‌తి ఒక్క‌రూ ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. మేం కూడా గేర్ మార్చుతాం.. స్పీడు పెంచుతాం.. మా గ్రాఫ్ పెర‌గ‌పోతే స‌ర్వేల్లో మంచి ఆద‌ర‌ణ లేక‌పోతే సీట్లు మార్చ‌డం ఖాయం: మంత్రి జోగి ర‌మేష్‌

Visakha MP MVV on Family Kidnap Case: రఘు రామకృష్ణంరాజు ఓ కుక్కతో సమానం, విశాఖ ఎంపీ ఎంవీవీ సంచలన వ్యాఖ్యలు, నా ఫ్యామిలీ కిడ్నాప్‌ను రాజకీయం చేయడం బాధాకరమని వెల్లడి

Hazarath Reddy

తన భార్య, కొడుకు కిడ్నాప్‌ను రాజకీయం చేయడం బాధాకరమని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రౌడీషీటర్లు హేమంత్‌, రాజేష్‌లు పథకం ప్రకారం కిడ్నాప్‌ చేశారని, హేమంత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Somu Veerraju Slams Chandrababu: ప్రత్యేక హోదా వద్దన్నది నీవే, మళ్లీ కావాలనేది నీవే, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన సోము వీర్రాజు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా? చేస్తామని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే.

Jagananna Suraksha Programme: ధ్రువీకరణ పత్రాల జారీకి నో సర్వీసు చార్జీలు , జూలై 1 నుంచి సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్వీసు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది.

Advertisement

Gadapa Gadapaku Mana Prabutvam: 175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాల్సిందే, నేతలకు సీఎం జగన్ ఆదేశాలు, గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష

Hazarath Reddy

తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.

Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని కబురు, రాగల మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

ఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. మంగళవారం ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

Vijayawada Rain Video: వీడియో ఇదిగో, విజయవాడను కుమ్మేసిన భారీ వర్షం, రెండు గంటల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వాన

Hazarath Reddy

భగ భగ మండే ఎండల నుంచి ఏపీ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దాదాపు రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో నగర వాసులకు ఊరట లభించింది. భారీ వర్షం నేపథ్యంలో నగరంలోని పలు రోడ్లు జలమయ్యాయి.

Jai Telugu Party: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, జై తెలుగు పేరుతో పార్టీని ప్రారంభించిన సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం

Hazarath Reddy

ఏపీలో ఎటువంటి చడీ చప్పుడు లేకుండా కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జై తెలుగు పార్టీని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు.

Advertisement

Jagananna Animutyalu: విద్యార్థులకు భరోసా, మీకు జగన్‌ మామ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన సీఎం జగన్, టాపర్లకు బహుమతులు ప్రదానం చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

మంగళవారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కింద టాపర్స్‌ను విజయవాడలో సన్మానించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై.. రేపు ప్రపంచానికి ఫలాలు అందించాలని ఆకాంక్షించారు ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్‌ మైండ్స్‌.. షైనింగ్‌ స్టార్‌, ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ మనదని ఉద్ఘాటించారు.

Mudragada Letter to Pawan Kalyan: లెటర్ ఇదిగో, ఇప్పటి వరకు ఎంత మంది తాట తీశావో చెప్పు, పవన్ కళ్యాణ్‌కి ఘాటు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడేలా ఉండాలని... వీధి రౌడీలా మాట్లాడటం ఎంత వరకు సబబని లేఖలో ఆయన ప్రశ్నించారు. మీ ప్రసంగాల్లో తాట తీస్తా, నార తీస్తా, గుండు గీయిస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా అంటూ పదేపదే అంటున్నారని... ఇప్పటి వరకు ఎంత మందిని ఇలా చేశారో చెప్పాలని అన్నారు.

Kalyanam at Yellamma Devasthanam: కన్నుల పండువగా బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత.. వీడియో ఇదిగో

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. మంగళవారం కల్యాణోత్సవం, బుధవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కళ్యాణం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Andhra Pradesh Shocker: పదిహేనేండ్ల బాలికపై రెండేళ్లుగా పూర్ణానంద స్వామీజీ అత్యాచారం.. బాలికను గొలుసులతో తన గదిలో బంధించి అఘాయిత్యం.. పనిమనిషి సాయంతో ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక.. అర్ధరాత్రి స్వామీజీ అరెస్ట్

Rudra

విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీకి సంబంధించి సంచలన ఘటన కలకలం సృష్టిస్తుంది. అత్యాచారం ఆరోపణలపై స్వామీజీ అరెస్టయ్యారు. స్వామీజీ తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారన్న రాజమహేంద్రవరానికి చెందిన అనాథ బాలిక (15) ఫిర్యాదుపై గత అర్ధరాత్రి స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Ramcharan Upasana Blessed With Baby Girl: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు.. నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన

Rudra

మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

National Water Awards to AP: ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు జాతీయ జల అవార్డులు, అధికారులను అభినందించిన సీఎం జగన్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్‌ అవార్డ్స్‌ 2022) దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.

Heatwave in AP: ఏపీలో 300 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక, అవసరమైతేనే బయటకు రావాలని సూచన, రెండు రోజుల తర్వాత ఏపీలో రుతుపవనాల ప్రభావం

Hazarath Reddy

వచ్చే వారం నుండి హీట్‌వేవ్స్ తగ్గుముఖం పట్టవచ్చని IMD-అమరావతి అంచనా వేసినందున, ఆంధ్రప్రదేశ్ సోమవారం (జూన్ 20) నుండి హీట్‌వేవ్ పరిస్థితుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది .

Indonesia Open 2023: ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీకి సీఎం జగన్ అభినందనలు, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీని సీఎం జగన్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి అభినందించారు. మన తెలుగు కుర్రాడు సాత్విక్‌సాయిరాజ్‌తో పాటు అతనికి జోడీగా టైటిల్‌ నెగ్గిన శెట్టి చిరాగ్‌కు సైతం సీఎం జగన్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు

Advertisement

TTD Key Decisions: తిరుమలలో రూ.14 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం, రూ.1 కోటి 28 లక్షలతో వసతి గృహాల ఆధునీకరణ, టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమలలో రూ. 4 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ. 1 కోటి 28 లక్షలతో వసతి గృహాల ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం సమావేశమైంది. సమావేశ తీర్మానాలను టీటీడీ ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసు, అవినాశ్ రెడ్డి, సీబీఐకు సుప్రీంకోర్టు నోటీసులు, సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణ జూలై3కు వాయిదా

Hazarath Reddy

వైఎస్ వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల(జులై) 3వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ కోసం సీజేఐ బెంచ్‌ ముందు లిస్ట్‌ చేయాలని ఆదేశిస్తూనే.. ప్రతివాదులకు సోమవారం నోటీసులూ జారీ చేసింది. అవినాశ్‌‌తో పాటు సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది.

Cricket Player Dies of Heart Attack: విశాఖలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్, ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపే మృతి

Hazarath Reddy

విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో ఆడుతూ 26 ఏళ్ల న్యాయవాది మృతి చెందాడు. ఆదివారం గాజువాకలోని జింక్ క్రికెట్ గ్రౌండ్ నుంచి బయటకు వస్తుండగా మణికంఠ నాయుడు కుప్పకూలి మృతి చెందాడు. సాక్షుల ప్రకారం, మ్యాచ్ పూర్తయిన తర్వాత నాయుడు మైదానం నుండి బయటకు వస్తుండగా, గుండె ఆగిపోవడంతో అతను కుప్పకూలిపోయాడు.

Heatwave Alert: తెలంగాణ, ఏపీ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు తీవ్ర వడగాల్పులు.. జాగ్రత్తగా ఉండాలంటూ భారత వాతావరణ విభాగం హెచ్చరిక

Rudra

వచ్చే మూడు రోజులపాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

Advertisement
Advertisement