ఆంధ్ర ప్రదేశ్
TTD: శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచిన టీటీడీ, అద‌నపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడు‌దల
Hazarath Reddyఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనా‌లకు సంబం‌ధించిన టికె‌ట్లను తిరు‌మల తిరు‌పతి దేవ‌స్థానం (TTD) నేడు విడు‌దల చేయ‌ను‌న్నట్టు తెలి‌పింది. బుధ‌వారం ఉదయం 9 గంట‌లకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.
Mekapati Goutham Reddy Funeral: బ్రాహ్మణపల్లికి చేరుకున్న మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమయాత్ర, అంత్యక్రియలకు హాజరుకానున్న ఏపీ సీఎం జగన్, తరలివచ్చిన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు
Hazarath Reddyఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర (Mekapati Goutham Reddy Funeral) కొనసాగుతోంది. నెల్లూరులోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాడు,మర్రిపాడు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి చేరుకుంది. అక్కడి నుంచి స్వగ్రామం బ్రాహ్మణపల్లికి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (IT minister Mekapati Goutham Reddy) అంతిమయాత్ర చేరుకుంది.
Andhra Pradesh: వరుసగా నాలుగో యేడాది జాతీయ అవార్డును దక్కించుకున్న APSRTC, డిజిటల్ సేవల్లో సత్తా చాటుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా నాలుగో యేడాది కూడా జాతీయ అవార్డును దక్కించుకుంది. డిజిటల్ సేవల్లో సత్తా చాటుతూ ఇప్పటికే మూడుసార్లు అవార్డును దక్కించుకోగా, తాజాగా మరోమారు ఈ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వర్చువల్ విధానంలో ఈ అవార్డును అందుకున్నారు.
IAS Officers Transfer in AP: ఏపీలో 8 మంది ఐఎఎస్ అధికారులు బదిలీ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఅమరావతిలో సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ (IAS Officers Transfers in AP) చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ ( IAS Officers transfers in Andhra Pradesh ) అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీఅయ్యాయి.
Corona in AP: ఏపీలో కరోనా వేవ్ ముగిసినట్లే, కొత్తగా 244 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 47 కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 18,803 కరోనా పరీక్షలు నిర్వహించగా, 244 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 47 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 42, గుంటూరు జిల్లాలో 33 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Mekapati Goutham Reddy Demise: నెల్లూరుకు చేరుకున్న మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం, రేపు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
Hazarath Reddyదివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని (Goutham Reddy mortal ) నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయం తరలించారు. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు.
Corona in AP: ఏపీలో 200కి దిగువన కేసులు, గత 24 గంటల్లో 182 మందికి కోవిడ్, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 70 కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య 200కి దిగువన నమోదైంది. గడచిన 24 గంటల్లో 14,249 కరోనా పరీక్షలు నిర్వహించగా, 182 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 70 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 24 కేసులు గుర్తించారు.
Naval Fleet Review: విశాఖ సాగర తీరంలో ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించిన భారత నౌకాదళాలు
Hazarath Reddyఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విశాఖ సాగర తీరంలో 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ (Naval Fleet Review) ఘనంగా ప్రారంభమయ్యింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించి.. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని (India's Naval Might In Full Display) సమీక్షించారు.
Goutham Reddy Passed Away: గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు, గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శ
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గౌతమ్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. గుండెపోటుతో మరణించిన గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళులు ( CM YS Jaganmohan Reddy pays tribute to IT Minister) అర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్‌ పరామర్శించారు.
Mekapati Goutam Reddy Funerals: ఈ నెల 23న బ్రాహ్మ‌ణ‌ప‌ల్లిలో గౌత‌మ్ రెడ్డి అంత్యక్రియలు, రెండు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, ఓ మంచి నాయ‌కుడిని కోల్పోయామ‌ని నాయకులు ఆవేదన
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ‌ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి(50) హ‌ఠాన్మర‌ణం పట్ల ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాపదినాలుగా (two days of mourning in ap ) ప్రకటించింది. సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో అపోలో ఆస్పత్రికి త‌ర‌లించారు. ఆస్పత్రి లోప‌ల‌కి వ‌చ్చే లోపే గౌత‌మ్ రెడ్డి క‌న్నుమూసిన‌ట్లు వైద్యులు తెలిపారు.
Mekapati Goutham Reddy No More: గౌతమ్‌రెడ్డి మృతిపై అపోలో ఆస్పత్రి వైద్యులు కీలక ప్రకటన, ఆస్పత్రికి వచ్చినప్పుడే స్పందించని స్థితిలో ఏపీ ఐటీ మంత్రి, తీవ్రంగా శ్రమించినా ఫలితం లేదని ప్రకటన
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) ఈ రోజు ఉదయం గుండెపోటుతో చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఇంట్లో గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే గౌతమ్‌ రెడ్డి తుదిశ్వాస విడిచారు. అపోలో అసుపత్రికి తీసుకొచ్చి చివరి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.
Goutham Reddy Passed Away: హైదరాబాద్‌‌కు బయలు దేరిన ఏపీ సీఎం జగన్, మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపట్ల రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి, రేపు సీఎంను కలవడానికి గౌతమ్ అపాయింట్మెంట్..అంతలోనే పెనువిషాదం
Hazarath Reddyగౌతమ్ హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరికాసేపట్లో సీఎం జగన్ హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి ఇప్పటికే సీఎం నివాసానికి చేరుకున్నారు.
Mekapati Goutham Reddy Dies: గుండెపోటుతో మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత, ఇటీవలే కోవిడ్‌ బారిన పడి కోలుకున్న ఏపీ ఐటీశాఖ మంత్రి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం (Mekapati Goutham Reddy Dies) చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
Pawan Kalyan: చావడానికైనా సిద్ధపడతాను, తలవంచడానికి ఇష్టపడను, 10 మంది జనసేన MLAలు ఉంటే 217 జీవోనూ ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం ధైర్యం చేసేది కాదు
Krishnaవైసీపీ నాయకులు ఎటూ బ్రాందీ అమ్ముతున్నారు కాబట్టి చీకుల కొట్టు కూడా పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. మటన్, చికెన్ కొట్లు నడపటానికి అధికారం ఇవ్వలేదన్నారు. పాదయాత్ర చేసింది చేపల దుకాణాలు పెట్టుకోవడానికా? అని ప్రశ్నించారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 335 మందికి కరోనా, అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 84 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 19,241 శాంపిల్స్ పరీక్షించగా, 335 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 84 కొత్త కేసులు నమోదు కాగా... తూర్పు గోదావరి జిల్లాలో 52 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు గుర్తించారు.
AP CM Jagan Visit Kadapa Today: నేడు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా కుమార్తె వివాహానికి హాజరు..
Krishnaఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా కుమార్తె వివాహానికి జగన్ హాజరుకానున్నారు.
Corona in AP: ఏపీలో కేసులు భారీగా తగ్గుముఖం, గత 24 గంటల్లో 425 మందికి కరోనా, అన్ని జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 19,769 శాంపిల్స్ పరీక్షించగా, 425 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా (113) మినహా, ఇతర అన్ని జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 72, కృష్ణా జిల్లాలో 55 కేసులు వెల్లడయ్యాయి.
AP New DGP: ఏపీ డీజీపీగా బాధ్యతలు తీసుకున్న రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటన
Krishnaరాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
Rajendranath Reddy Take Charge As AP New DGP: నేడు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలను స్వీకరించనున్న రాజేంద్రనాధ్ రెడ్డి
Krishnaఆంధ్రప్రదేశ్ డీజీపీగా రాజేంద్ర నాధ్ రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన డీజీపీగా అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు.
Corona in AP: ఏపీలో కనిష్ఠ స్థాయికి పడిపోయిన కేసులు, గత 24 గంటల్లో 495 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 106 కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 22,383 శాంపిల్స్ పరీక్షించగా, 495 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 106 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 99, కృష్ణా జిల్లాలో 77 కేసులు వెల్లడయ్యాయి.