ఆంధ్ర ప్రదేశ్
AP CID SP Radhika: మానవబాంబుగా మారి సీఎం జగన్‌ను చంపుతానంటూ పోస్ట్, నిందితుడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక
Hazarath Reddyసీఎంను చంపుతానంటూ రాజుపాలెపు ఫణి అనే జనసేన మద్దతుదారుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని అతన్ని అరెస్ట్ చేశామని ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక తెలిపారు. మానవబాంబుగా మారి సీఎంను హతమార్చుతానని అతను ట్విట్టర్ లో పోస్టు చేశాడని, తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశాడని ఎస్పీ రాధిక వివరించారు.
COVID in AP: ఏపీలో కొత్తగా 13,212 మందికి కరోనా, విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో 1,235 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు, గుంటూరు జిల్లాలో 1,054 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,051 కేసులు గుర్తించారు.
Gudivada Casino Issue: నా అడ్డాలో కేసినో పెట్టానని నిరూపిస్తే..పెట్రోల్ పోసుకుని ఇక్కడే చచ్చిపోతానని మంత్రి కొడాలి నాని సవాల్, టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నేతలను అడ్డుకున్న పోలీసులు
Hazarath Reddyగుడివాడలో కేసినో వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో కేసీనో నిర్వహించారంటూ ఆరోపణలు (Gudivada Casino Issue) వస్తున్న నేపథ్యంలో నిజనిర్ధారణ కోసం టీడీపీకి చెందిన ఓ టీమ్ (TDP leaders visit) ఈరోజు గుడివాడకు వెళ్లింది
PRC Issue in AP: ఏపీలో ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల సమ్మె, పీఆర్సీ జీవోల అమలుకు ఏపీ కేబినెట్‌ ఆమోదముద్ర, ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం
Hazarath Reddyపీఆర్సీపై భగ్గుమంటున్న ఉద్యోగులను శాంతపరిచేందుకు ఓ వైపు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు కీలక ప్రకటన చేశాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేస్తున్నట్టు (AP Employees unions announced strike) ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఏపీ సర్కారు ప్రకటించిన పీఆర్సీ తమకు ఆమోదయోగ్యం కాదని వివిధ ఉద్యోగ సంఘాలు కరాఖండీగా చెబుతున్నాయి.
Raghu Rama vs Vijaysai Reddy: వైసీపీ ఎంపీల ప్రేమ బాణాల గోల, బాబు ప్రేమ కోసం పడరాని పాట్లూ పడుతున్నావా ర‌ఘురామా అంటూ వైసీపీ ఎంపీ ట్వీట్, కౌంటర్ వేసిన రఘురామ
Hazarath Reddyనలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ల‌కు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా ర‌ఘురామా?' అంటూ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన‌ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కౌంట‌ర్ ఇచ్చారు.
AP PRC Issue: పీఆర్సీపై కొనసాగుతున్న రగడ, ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్న ఉద్యోగ సంఘాలు, ఐఆర్‌పై వక్రీకరణలు సరికాదని మండిపడిన మంత్రి పేర్నినాని
Hazarath Reddyపీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ఓ ప్రైవేటు హోటల్‌‌లో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. శుక్రవారం మరోసారి సచివాలయంలో అన్ని సంఘాలు భేటీ అయి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.
Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో 12,615 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 3,338 కేసులు నమోదు, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 216 కేసులు
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో 12,615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 3,338 కేసులు నిర్ధారణ అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 216 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,674 మంది కోలుకోగా... ఐదుగురు మృతి చెందారు.
CM YS Jagan Reviews on Ports: ఒక జిల్లా-ఒక ఎయిర్‌పోర్టు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలు, బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని సూచన
Hazarath Reddyపోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్ష ( CM YS Jagan reviews on ports) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ఎయిర్‌పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh: బడులకు సెలవులు ఇచ్చే ఆలోచన ఏదీ లేదు, ఉద్యోగులు అప్పుడు అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు చేయడం సరికాదు, విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్
Hazarath Reddyఏపీలో పాఠశాలలకు సెలవులిచ్చే విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ (No plan to extend holidays) స్పందించారు. ఇటు పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళనలపైనా ఆయన మాట్లాడారు. గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ తో కలిసి ఆయన ఇవాళ ఆన్ లైన్ విద్యావిధానాన్ని ప్రారంభించారు.
PRC Row: కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేది, పీఆర్సీ ఆలస్యం అవుతుందనే ఐఆర్‌ ఇచ్చామని తెలిపిన ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ సమీర్‌ శర్మ, సమ్మెకు సిద్దమవుతున్న ఉద్యోగ సంఘాలు
Hazarath Reddyఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అంశం కాక రేపుతోంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. దీనిపై సమీర్ శర్మ స్పందించారు. కరోనావైరస్‌ మహమ్మారి వల్ల ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ సమీర్‌ శర్మ (AP Chief Secretary Dr Sameer Sharma) తెలిపారు.
Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో 10,057 మందికి కరోనా, విశాఖ జిల్లాలో 1,827 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 10 వేలను దాటింది. మొత్తం 41,713 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 10,057 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో 1,827 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదయ్యాయి.
Land Resurvey in AP: ఏపీలొ భూముల సమగ్ర రీ సర్వే, 37 గ్రామాల్లో తొలిదశగా రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలు, వచ్చే మూడు వారాల్లో మరో 14 చోట్ల ప్రారంభమవుతాయని తెలిపిన ఏపీ సీఎ వైఎస్ జగన్
Hazarath Reddyవైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం ద్వారా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే (Land Resurvey in AP) అతిపెద్ద సంస్కరణ కార్యక్రమమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 37 గ్రామాల్లో తొలిదశగా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని, వచ్చే మూడు వారాల్లో మరో 14 చోట్ల ప్రారంభమవుతాయని చెప్పారు.
Chandrababu Covid: చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. కోవిడ్‌ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈమేరకు మంగళవారం ట్వీట్‌ చేశారు.
Andhra Pradesh: ఏపీలో ఇకపై ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధర రూ.350, ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్‌ రేటును సవరిస్తూ ప్రభుత్వం (Andhra Pradesh government) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్‌ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్‌ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను (Revised COVID diagnostic test RT PCR Price) ప్రదర్శించాలని ఆదేశించింది.
Coronavirus in AP: ఏపీలో కొత్తగా 6,996 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 మంది కరోనా
Hazarath Reddyఏపీలోఒక్కరోజులోనే 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 38,055 శాంపిల్స్ పరీక్షించగా 6,996 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 మంది కరోనా బారినపడగా, విశాఖ జిల్లాలో 1,263, గుంటూరు జిల్లాలో 758, శ్రీకాకుళం జిల్లాలో 573 కేసులు గుర్తించారు.
Andhra Pradesh: నాడు–నేడు పథకం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.కోటి విరాళం ఇచ్చిన పోకర్ణ గ్రూప్‌ సీఎండీ గౌతమ్‌చంద్‌ జైన్‌
Hazarath Reddyమనబడి నాడు–నేడు పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్‌ టు ఆంధ్ర ద్వారా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) ఫండ్‌ కింద పోకర్ణ గ్రూప్‌ రూ.కోటి విరాళంగా ఇచ్చింది.
Night Curfew In AP: ఏపీలో నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ, రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ, మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా
Krishnaఏపీలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
Chandrababu Covid: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కరోనా పాజిటివ్, తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ప్రకటన..
Krishnaఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్ లో ఉండిపోయారు.
CM YS Jagan Review on Covid: రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష, ఆక్సిజన్‌ను, మందులను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyరాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష(CM YS Jagan Review on Covid) నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కోవిడ్‌ విస్తరణ పరిస్థితులను అధికారులు వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.
COVID in AP: ఏపీలో కొత్తగా 4,108 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,018 కొత్త కేసులు, చిత్తూరు జిల్లాలో 1,004 కేసులు
Hazarath Reddyఏపీలో కొన్నిరోజుల వ్యవధిలోనే కరోనా రోజువారీ కేసుల సంఖ్య అధికమైంది. తాజాగా మరోసారి 4 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 22,882 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,108 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,018 కొత్త కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 1,004 కేసులు గుర్తించారు.