ఆంధ్ర ప్రదేశ్

AP Weather Report: ఏపీకి భారీ వర్ష సూచన, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, పలు జిల్లాల్లో ఇప్పటికే దంచి కొడుతున్న వానలు

Hazarath Reddy

ఏపీలో రానున్న మూడు రోజులు వాతావరణంలో మార్పులు (AP Weather Report) సంభంవించనున్నాయి. భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) బుధవారం అల్పపీడనం ఏర్పడింది.

Andhra Pradesh: డ్రగ్స్‌పై పవన్‌కల్యాణ్ వరస ట్వీట్లు, జనసేన పోరాట యాత్రకు సిద్దమంటూ వీడియో

Hazarath Reddy

డ్రగ్స్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వరస ట్వీట్లు చేశారు. గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్థిక అంశమని చెప్పారు. విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని, చదువు పూర్తయిన యువకులు ఈ వలలో చిక్కుకుంటున్నారని చెప్పారు. కింగ్‌ పిన్స్ మాత్రం రిస్క్‌ లేకుండా సంపాదిస్తున్నారని ఆరోపించారు.

AP Weather Report: 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు

Hazarath Reddy

దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం (Low-pressure area likely to form over Bay of Bengal) ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Corona in AP: ఏపీలో తాజాగా 415 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 33,944 కరోనా పరీక్షలు నిర్వహించగా 415 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 93 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 76, పశ్చిమ గోదావరి జిల్లాలో 53, గుంటూరు జిల్లాలో 50 కేసులు వెల్లడయ్యాయి.

Advertisement

Andhra Pradesh: రైతులకు దివాళి పండగ..మూడు పథకాల నిధులు ఒకేసారి విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, మొత్తం రూ.2,190 కోట్లు రైతుల అకౌంట్లలో జమచేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

AP Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం (Surface periodicity) ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

N. Chandrababu Naidu: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరామని తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరామని చంద్రబాబు తెలిపారు. ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని చెప్పారు.

Corona in AP: ఏపీలో అత్యంత తక్కువగా కేసులు, తాజాగా 295 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 69 కొత్త కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 27,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 295 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 69 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 68, చిత్తూరు జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి.

Advertisement

Kakinada Municipal Corporation: కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్‌, ఏకగ్రీవగా ఎన్నిక, హాజరుకాని టీడీపీ కార్పోరేటర్లు

Hazarath Reddy

కాకినాడ మేయర్‌గా 40 వ వార్డు కార్పొరేటర్ సుంకర శివప్రసన్న (sunkara siva prasanna) , డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఈ మేయర్‌ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు.

Guntur Shocker: క్లాసు రూంలోనే.. విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన కీచక టీచర్, వారికి నీలి చిత్రాలు చూపిస్తూ పైశాచికానందం పొందిన కామాంధుడు, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణ ఘటన

Hazarath Reddy

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఆ టీచర్ కామాంధుడిలా (Guntur Shocker) మారాడు. చిన్న పిల్లలని కూడా చూడకుండా విద్యార్ధినులకు నీలి చిత్రాలు ( teacher sexually harassed on students) చూపించాడు.. పాఠశాల గదిలోనే ఈ పాడు పనులకు పాల్పడ్డాడు. విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ నిన్న ఆందోళనకు దిగారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 400 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 73 కొత్త కేసులు నమోదు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 37,744 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా, 400 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 73 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 68, గుంటూరు జిల్లాలో 50 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

Clean AP Program: క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని అధికారులకు సీఎం వైస్ జగన్ ఆదేశాలు, వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను తీసుకురావాలని సూచన

Hazarath Reddy

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం (CM YS Jagan reviews on Clean AP program) నిర్వహించారు. క్లాప్‌ కార్యక్రమం కింద ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించారు.

Advertisement

Corona in AP: ఏపీలో కొత్తగా 493 మందికి కోవిడ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 113 కొత్త కేసులు, అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 6 కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 41,820 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 493 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 113 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 74, పశ్చిమ గోదావరి జిల్లాలో 66, కృష్ణా జిల్లాలో 56 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 6 కేసులు గుర్తించారు.

Andhra Pradesh: విద్యపై జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల పరిధిలోకి తేవాలని నిర్ణయం, మార్గదర్శకాలను విడుదల చేసిన విద్యా శాఖ

Hazarath Reddy

రాష్ట్రంలో విద్యకు పెద్ద పీట వేస్తున్న జగన్ సర్కారు (AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంను (English Medium) ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం మరో దిశగా అడుగులేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల పరిధిలోకి తేవాలని నిర్ణయించింది.

AP LAWCET Result 2021: ఏపీ లాసెట్‌–2021 ఫలితాలు విడుదల, మూడు కోర్సుల్లోనూ మహిళలే మొదటి ర్యాంకులు, నేటి నుంచి ఏపీ పీజీసెట్‌–2021 పరీక్షలు

Hazarath Reddy

ఏపీలో న్యాయ కళాశాలల్లో 3, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌ బీ, 2 ఏళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి గ త నెల 22న నిర్వహించిన ఏపీ లాసెట్‌–2021 ఫలితాలను (AP LAWCET Result 2021) ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తిరుపతిలో గురువారం విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ లాసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

AP High Court: అమూల్‌ ఒప్పందంతో మీకేం పని, రఘురామను ప్రశ్నించిన ఏపీ హైకోర్టు, పూర్తి స్థాయిలో విచారణ జరుపతామని వెల్లడి, రుణఒప్పందాలపై వేసిన మరో పిల్‌పై విచారణ నవంబర్ 15కు వాయిదా

Hazarath Reddy

అమూల్‌ విషయంలో ప్రభుత్వ నిర్ణయం వల్ల మీరే విధంగా నష్టపోతారని నిలదీసింది. ఫలానా విధంగానే ప్రభుత్వం వ్యవహరించాలని ఎలా శాసిస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని తెలి పింది. తదుపరి విచారణను నవంబర్‌ 29కి వాయిదా వేసింది

Advertisement

Pattabhi Shifted to Rajahmundry Jail: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి, 14 రోజుల రిమాండ్ విధించిన మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు, బెయిల్‌పై ఉన్నా ఆంక్షలు పాటించలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టులో వాదనలు

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్టు (DP Leader Pattabhi Arrested) చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పట్టాభిని మచిలీపట్నం నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు (Pattabhi Shifted to Rajahmundry Jail) తరలించారు.

CM YS Jagan Review: రైతులకు జగన్ సర్కారు మరో శుభవార్త, అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల, జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ (CM Jagan VC) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై సమీక్ష (CM YS Jagan Review) నిర్వహించారు.

AP PGECET Results 2021: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల, ఫలితాలను sche.ap.gov.in, మనబడి ద్వారా చెక్ చేసుకోండి, ర్యాంక్ కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దానిపై పూర్తి సమాచారం మీకోసం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, AP PGECET ఫలితాలు 2021 ఈరోజు విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాన్ని అధికారిక వెబ్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in, మనబడి నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Pattabhi Arrested: నేడు పట్టాభిని కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు, గత రాత్రి ఆయన్ని అదుపులోకి తీసుకున్న విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు, అరెస్ట్‌కు ముందు వీడియో విడుదల చేసిన పట్టాభి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు (Pattabhi Arrested) చేశారు. ముఖ్యమంత్రిని దూషించినట్లుగా గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అందిన పిర్యాదు మేరకు పట్టాభిపై సెక్షన్‌ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్‌ విత్‌ 120(బి) కింద (క్రైం నంబర్‌.352/2021) కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement