ఆంధ్ర ప్రదేశ్
Posani Krishna Murali Case: పోసాని కృష్ణమురళికి బెయిల్, ఓబులవారిపల్లి పీఎస్‌లో నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేసిన కడప మొబైల్ కోర్టు
Hazarath Reddyప్రముఖ నటుడు,వైసీపీ నేత, రచయిత పోసాని కృష్ణమురళికి కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. ఇక్కడ నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది.
Lady Aghori: షాకింగ్ వీడియో ఇదిగో, అఘోరీగా మారబోతున్నానంటూ బాంబు పేల్చిన బీటెక్ విద్యార్థిని, లేడీ అఘోరీ అమ్మలాగా అఘోరినై ఆడపిల్లల్ని రక్షిస్తానని వెల్లడి
Hazarath Reddyఆఘోరి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమెతో పాటు ఓ బీటెక్ విద్యార్థిని కూడా ఉంది. నేను అఘోరీగా మారబోతున్నానంటూ ఆ బీటెక్ విద్యార్థిని బాంబు పేల్చింది. ఇకపై అమ్మే నాకు అన్ని.. నేను అఘోరీ అమ్మలాగా అఘోరి అవుతా.. ఆడపిల్లలను రక్షిస్తానంటూ ఆ వీడియోలో బీటెక్ విద్యార్థిని చెప్పుకొచ్చింది.
Konidela Nagababu:ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు, హాజరైన కూటమి నేతలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు.
Kailasagiri Fire Accident: వీడియో ఇదిగో, విశాఖ కైలాసగిరిలో భారీ అగ్నిప్రమాదం. చెత్త తగలబడటంతో భారీగా పొగ, ఒక్కసారిగా బెంబేలెత్తిన టూరిస్టులు
Hazarath Reddyవిశాఖపట్నంలోని కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ చెత్త తగలబడటంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో, కైలాసగిరిపై ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. విశాఖలోని కైలాసగిరిపై శుక్రవారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం (Kailasagiri Fire Accident) జరిగింది.
Viveka Murder Case: వివేకా హత్య కేసు, ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన, వీడియో ఇదిగో..
Hazarath Reddyవివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం. ఇప్పటికి ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారు.
Andhra Pradesh: అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య... పరీక్ష రాసివచ్చి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??
Rudraనుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? అంటూ పుణె జిల్లా జడ్జి ఓ మహిళను ప్రశ్నించారు.
Singer Kalpana Clarification: స్ట్రెస్ వల్లే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను.. నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవు.. సింగర్ కల్పన సంచలన వీడియో
Rudraసింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకొన్నట్టు వార్తలు రావడం కలకలం రేపాయి. భర్త, కూతురుతో విభేదాలే దీనికి కారణమని విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Rudraఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తితో కొనసాగుతున్నది. ఆలయ నిర్వహణకు టీటీడీ పేరిట ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అయితే జిల్లాల పరిధిలోనే ఫ్రీ బస్సు.. జిల్లా దాటితే ఛార్జీల మోతే.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి
Rudraసూపర్ సిక్స్ పథకాల పేరిట గత ఏడాది టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ పథకంలో కీలకమైన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ స్కీం ఇంకా అమల్లోకి రాలేదు.
Janasena Kiran Rayal: వీడియో ఇదిగో, లైంగిక ఆరోపణల వివాదంపై స్పందించిన జనసేన నేత కిరణ్ రాయల్, మా ఇద్దరి మధ్య ఆ సంబంధం మాత్రమే ఉందని వెల్లడి
Hazarath Reddyతనపై వచ్చిన లైంగిక ఆరోపణల వివాదంపై తాజాగా జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన విషయాలు వెల్లడించారు. తనకు, లక్ష్మీరెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని, అంతకుమించి మరొకటి లేదని వివరించారు. తనపై ఎవరు కుట్ర చేశారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతా అని తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ అన్నారు.
Nandipura Peetadhipathis Meet Jagan: వీడియో ఇదిగో, వైఎస్ జగన్‌ను కలిసిన నందీపుర పీఠాధిపతులు, 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహా భూమిపూజకు రావాలని ఆహ్వానం
Hazarath Reddyతాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమిపూజకు ఆయనను ఆహ్వానించారు.
Posani Krishna Murali Case: పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, క్వాష్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా
Hazarath Reddyప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం పోలీసులను గురువారం ఆదేశించింది
CM Chandrababu on Hindi Language: హిందీ భాష నేర్చుకుంటే తప్పేంటి ? సీఎం స్టాలిన్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై విమర్శలు గుప్పించారు. కేవలం మూడు భాషలు కాదు, బహుళ భాషలు ఎందుకు ఉండకూడదు? నేను 10 భాషలను ప్రోత్సహిస్తాను అని చెప్పుకొచ్చారు.
Eluru Road Accident: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం, సిమెంట్‌ను లారీని వెనక నుంచి ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, 20 మందికి గాయాలు
Hazarath Reddyఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం (Eluru Road Accident) జరిగింది
Andhra Pradesh: అనంతపురం జిల్లాలో పరువు హత్య.. కూతురిని ఉరేసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి, వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఘాతుకం
Arun Charagondaఅనంతపురం జిల్లాలో పరువు హత్య జరిగింది . కూతురిని ఉరేసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించారు తండ్రి. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని కూతురిని చంపేశారు తండ్రి.
CM Chandrababu Meets HM Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ, అమరావతి, పోలవరం తదితర అంశాలపై చర్చ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లను కలిశారు. ఏపీకి చెందిన పలు అంశాలపై వారితో చర్చించారు.
Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్
Hazarath Reddyఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 11 సీట్లు వచ్చిన వాళ్లకు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లడం బెటర్ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం... పవన్ కార్పొరేటర్ కు తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని జగన్ ఇవాళ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే
CM Chandrababu Delhi Visit: ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు, ఓ శుభకార్యానికి హాజరుకానున్న ఏపీ ముఖ్యమంత్రి, రాత్రికి విశాఖపట్నంకు తిరిగి ప్రయాణం
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీక పర్యటనలో భాగంగా దేశ రాజధానికి చేరుకున్నారు. ఢిల్లీలో ఓ శుభకార్యానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి సీఎం చంద్రబాబు రానున్నారు. 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు.