ఆంధ్ర ప్రదేశ్

Black Fungus: బ్లాక్ ఫంగస్‌ను అంటు వ్యాధుల జాబితాలో చేర్చాలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం, ఇప్పటికే నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించిన తెలంగాణ; బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఇలా ఉండొచ్చు

Team Latestly

బ్లాక్ ఫంగస్ కు చెందిన శిలీంద్ర కణాలు వాతావరణంలో ఉంటాయి. ఇవి చర్మంపై ఏవైనా తెగిన లేదా కాలిన లేదా మరేదైనా గాయం నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అనంతరం శరీరం లోపల మరియు చర్మంపైన కూడా ఇది అభివృద్ధి చెందుతుంది. కరోనా తీవ్రంగా ఉన్న వారిలో, కరోనా నుంచి కోలుకున్న...

AP Budget 2021-22: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశం, రూ. 2,29,779 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన, వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి

Team Latestly

తొలిసారి లింగ ప్రాతిపదికన బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్న మంత్రి బుగ్గన, ఈ ఏడాది బడ్జెట్‌లో మహిళలకు మరియు చిన్నారులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీరి కోసం బడ్జెట్‌లో రూ. 47,283 కోట్లు కేటాయించినట్లు తెలిపారు....

AP Budget Session 2021-22: నేడు సభ ముందుకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, కరోనా దృష్ట్యా కేవలం ఒకరోజు మాత్రమే చర్చ మరియు ఆమోదం, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ

Team Latestly

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ. 2.30 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. గురువారం ఉదయం 11 గంటల తర్వాత ఈ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు...

AP Covid Report: ఏపీలో కరోనా కేసులపై భారీ ఊరట, తాజాగా 24,819 మంది కోలుకుని డిశ్చార్జ్, కొత్తగా 23,160 మందికి కోవిడ్ పాజిటివ్, 24 గంటల్లో 106 మంది మృతి

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 1,01,330 కరోనా పరీక్షలు నిర్వహించగా 23,160 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.అదే సమయంలో 24,819 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా.. ఏపీలో ఇప్పటివరకు 14,98,532 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 12,79,110 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,736 మంది చికిత్స పొందుతున్నారు.

Advertisement

Black Fungus Treatment: సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, బ్లాక్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు, వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

కరోనా రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, తాజాగా బ్లాక్‌ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌) (Mucormycosis) చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు (Black Fungus to Aarogyasri Scheme) జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Andhra Pradesh: సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను ప్రాంభించిన ఏపీ సీఎం, ప్రభుత్వాస్పత్రులను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపిన వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను ప్రారంభించారు. నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రుల్లో సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు.

Operation Muskaan: ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ పోలీసులు, కార్యక్రమం కోసం రూ .10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేసిన ఏపీ ప్రభుత్వం, అనాధ పిల్లల శ్రేయస్సు కోసం ఖర్చుపెట్టనున్న ఏపీ పోలీస్ శాఖ

Hazarath Reddy

ఏపీ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని లైవులోకి తీసుకువచ్చారు. కరోనావైరస్ కారణంగా తల్లిదండ్రులు / సంరక్షకులను కోల్పోయిన అనాథ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించిన #APPolice రాష్ట్రవ్యాప్తంగా #ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ .10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేసింది.

Obscene Videos On YCP MP: ఎంపీ విజయసాయి రెడ్డిపై అసభ్యకర వీడియోలు, ఇద్దర్ని అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

Hazarath Reddy

సోషల్ మీడియాలో (social media) రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పై అసభ్యకర పదజాలంతో పలు వీడియోలు (Obscene Videos On YCP MP) అప్‌లోడ్‌ చేసిన ఇద్దరు వ్యక్తులను గుంటూరు అరండల్‌పేట పోలీసులు (Guntur Police) అరెస్టు చేశారు.

Advertisement

AP Budget Session 2021: రేపు అసెంబ్లీకి రానున్న పూర్తి స్థాయి బడ్జెట్, 2021–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం

Hazarath Reddy

కరోనావైరస్ ఉధృతి నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి బడ్జెట్‌ సమావేశాలను (AP Budget Session 2021) గురువారం ఒక్కరోజే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

AP Curfew Timings: ఏపీలో కర్ఫ్యూ టైమింగ్స్ మార్పు ఏమీ లేదు, ఇప్పుడు ఉన్న మాదిరిగానే కర్ఫ్యూ సడలింపులు, తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు, హెచ్చరించిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

Hazarath Reddy

కర్ఫ్యూ సమయంలో ఎలాంటి మార్పులు (Curfew Timings in AP) చేయలేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ సర్కార్ హెచ్చరించింది.

Telangana Extends Lockdown: తెలంగాణలో మే 30 వరకు లాక్‌డౌన్ పొడగిపు, నిబంధనలు యధాతథం.. ఈనెల భేటీ కావాల్సిన రాష్ట్ర మంత్రివర్గం రద్దు!

Vikas Manda

AP Covid Update: గుడ్ న్యూస్..ఏపీలో కొత్తగా 21,274 మంది డిశ్చార్జ్, తాజాగా 21,320 కరోనా కేసులు నమోదు, 99 మంది మృతితో 9,580కు చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 21,320 కరోనా కేసులు (new Covid-19 cases) నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 99 మంది మృతి (Covid Deaths) చెందారు. ఇప్పటివరకు కరోనాతో 9,580 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 14,75,372కి కరోనా కేసులు (AP Covid Cases) చేరాయి.

Advertisement

Raghurama Krishnam Raju case: రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ముగ్గురు ఆర్మీ వైద్యుల బృందం, జ్యుడిషియల్‌ అధికారిని నియమించిన తెలంగాణ హైకోర్టు, వైద్య పరీక్షలను వీడియో తీస్తున్న అధికారులు

Hazarath Reddy

నరసపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్‌ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ నాగార్జునను హైకోర్టు నియమించింది.

YSR Matsyakara Bharosa: వైఎస్సార్‌ మత్స్యకార భరోసా మూడో ఏడాది నిధులు విడుదల, మత్స్యకారుల అకౌంట్లలో రూ. 10 వేలు నేరుగా జమ, 1,19,875 కుటుంబాలకు రూ.119,87,50,000 మేర లబ్ధి

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్‌ మత్స్యకార భరోసా (YSR Matsyakara Bharosa) మూడో ఏడాది నిధులను విడుదల చేసింది. మంగళవారం ఉదయం.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు.

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 18,561 పాజిటివ్ కేసులు నమోదు, 17,334 మంది రికవరీ.. కరోనాతో మరో 109 మంది మృతి

Team Latestly

గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 3,152 కోవిడ్ కేసులు నమోదు కాగా.. విశాఖపట్నం నుంచి 2,098, అనంతపూర్ నుంచి 2,094 కేసుల చొప్పున నమోదయ్యాయి....

MP Raghu Rama Case: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణరాజు, జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు సుప్రీంకోర్టు ఆదేశాలు, వైద్య ఖర్చులను మొత్తం రఘురామకృష్ణరాజే భరించాలని సూచన

Hazarath Reddy

రఘురామకృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.రఘురామ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగానే రఘురామకృష్ణరాజుకు (Raghu Rama Krishnam Raju) వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జ్యుడీషియల్‌ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు (TS High Court) సుప్రీంకోర్టు (Supreme court of India) సూచించింది.

Advertisement

AP Curfew Extension: ఏపీ సీఎం సంచలన నిర్ణయాలు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్‌ చికిత్స, ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు, కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు

Hazarath Reddy

ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ (AP Curfew Extension) ఉండాలని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని ఆయన పేర్కొన్నారు.

MP Raghu Rama Case: రఘురామ బెయిల్ పిటిషన్‌.. శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం తరపు న్యాయవాది దవే

Hazarath Reddy

సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ బి. ఆర్. గవాయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. మధ్యాహ్నం ఒంటి గంటకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. బెయిల్ పిటిషన్‌పై (MP Raghu Rama Krishnam Raju bail petition ) సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

Andhra Pradesh Covid: ఏపీ సర్కారు కీలక నిర్ణయం, కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు సాయం, ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లుకు ఆదేశాలు

Hazarath Reddy

కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు సాయం అందించనున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిడ్‌ కారణంగా మరణించే వారి అంత్యక్రియల ఖర్చుల కోసం చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసింది.

Raghu Rama Krishna Raju Case: రఘురామకృష్ణరాజును రమేష్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించిన హైకోర్టు, గుంటూరు జైలుకు నరసాపురం ఎంపీ, జైల్లోని పాత బిల్డింగ్ మొదటి సెల్‌లో 3468 నంబర్ కేటయింపు

Hazarath Reddy

పీ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును (Raghu Rama Krishna Raju Case) గుంటూరు జిల్లా జైలుకు తరలించడం తెలిసిందే. రఘురామకృష్ణరాజుకు రిమాండ్ ఖైదీ నెంబరు 3468 కేటాయించారు.

Advertisement
Advertisement