ఆంధ్ర ప్రదేశ్
YV Subba Reddy Covid: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వైసీపీ నేత, హైదరాబాద్ అపోలోలో చేరిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
Hazarath Reddyఏపీలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (YV Subba Reddy tests positive for coronavirus) అయింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి (TTD chairman YV Subba Reddy) పాల్గొన్నారు. దీంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 12న వైవీ సుబ్బారెడ్డి తల్లి జన్మదినం జరిగింది. ఆ వేడుకల్లోనూ ఆయన పాల్గొని తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
Guntur Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం, కాల్వలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి, చనిపోయిన వారిని ధర్మపురి వాసులుగా గుర్తించిన పోలీసులు
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Guntur Road Accident) జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో (Car Falls into Canal) నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా జ‌గిత్యాల (Jagtial) జిల్లా ధ‌ర్మపురికి చెందిన‌వార‌ని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారు జామున రొంపిచర్ల - సుబ్బయ్యపాలెం మధ్య తంగేడుపల్లి వద్ద చోటు చేసుకుంది.
Caste & Religion Column Removed: ఏపీ సర్కారు మరో సంచలన నిర్ణయం, స్కూలు అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని అన్ని స్కూళ్లకు ఆదేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్‌పై కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని (Caste & Religion Column Removed) ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (Director of School Education) ఆదేశాలు జారీ చేశారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల కుల, మత వివరాలను (Caste & Religion) రిజిష్టర్‌లో నమోదు చేస్తున్నట్టు సమాచారం రావడంతో స్పందించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాటిని వెంటనే తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు.
Kanaka Durga Flyover Inauguration: దేశంలో మూడో ప్రాజెక్టు, బెజవాడ వాసుల కష్టాలను తీరుస్తూ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన
Hazarath Reddyబెజవాడ నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ (Kanaka Durga Flyover Inauguration) నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ( Nitin Gadkari), ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు (AP CM ys jagan Mohan Reddy) శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమం (Virtual Inauguration) ద్వారా ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. అనంతరం రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు.
CM YS Jagan Letter Row: సీఎం వైయస్ జగన్ లేఖ ప్రకంపనలు, చర్యలు తీసుకోవాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా డిమాండ్‌, ఢిల్లీ లాయర్ ఇంటిపై ఐటీ దాడులు, 217 కోట్ల రూపాయలు స్వాధీనం
Hazarath Reddyసుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) రాసిన లేఖపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ (Prashant Bhushan), మరికొందరు దీనిని సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
APSRTC Special Buses: దసరా నేపథ్యంలో 1,850 ప్రత్యేక సర్వీసులకు ఏపీఎస్ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్, తెలంగాణతో ఇంకా కొలిక్కిరాని చర్చలు, జోరు పెంచిన ప్రైవేటు ఆపరేటర్లు
Hazarath Reddyరానున్న దసరా పండగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులు (APSRTC will operate 1,850 special buses) నడపనుంది. అక్టోబర్ 15 నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్‌ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది .
Kanakadurga Flyover: కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం నేడే, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా లాంచ్, తీరనున్న విజయవాడ వాసుల కష్టాలు
Hazarath Reddyవిజయవాడ వాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ (Vijayawada Kanakadurga Flyover) నేటి నుంచి అందుబాటులోకి రానుంది. కనదుర్గ ఫ్లై ఓవర్ ను వర్చ్యువల్ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Union Minister nitin gadkari), ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Vijayawada Shocker: ఉన్మాదిలా మారిన యువకుడు, ప్రేమించలేదని కత్తితో యువతిపై దాడి, తర్వాత ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, ఉన్మాద చర్యలను ఉపేక్షించేది లేదని తెలిపిన హోం మంత్రి సుచరిత
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో భయంకరమైన సంఘటన (Vijayawada Ghastly Incident) చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తనతో వచ్చేందుకు తిరస్కరించడాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. ఆమె ఇంటికి నేరుగా వెళ్లి ఆ మెను కత్తితో పొడిచి నిర్దాక్షిణ్యంగా (man attacked a girl with knife) చంపేశాడు. తరువాత అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి (suicide attempt) పాల్పడ్డాడు.
AP's COVID19 Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో మరో 4038 మందికి పాజిటివ్, మరో 5622 మంది రికవరీ, రాష్ట్రంలో 40,047గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyరాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 7.71 లక్షలు దాటినా, ఆక్టివ్ కేసులు 40 వేలలోనే ఉండటం ఊరట కలిగించే విషయం. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,767 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 4,038 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది...
CM KCR Emergency Review: తెలంగాణలో వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష, నష్ట నివారణ చర్యలు మరియు కేంద్రాన్ని సహాయం కోరే అంశాలపై చర్చ
Team Latestlyరాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై, తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకొని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు...
COVID19 in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో మరో 3892 మందికి పాజిటివ్, మరో 5050 మంది రికవరీ, రాష్ట్రంలో 41,669గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyనిన్నటి నుండి ఈరోజు వరకు మరో 5,050 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 7,19,477 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 41,669 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...
Shobha Naidu Passed Away: కూచిపూడి దిగ్గజ నృత్యకారిణి శోభా నాయుడు అనారోగ్యంతో కన్నుమూత, సంతాపం ప్రకటించిన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య మంత్రులు
Team Latestlyహైదరాబాద్‌లోని 40 ఏళ్ల ప్రస్థానం గల కూచిపుడి ఆర్ట్ అకాడమీకి శోభా నాయుడు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. దేశవిదేశాలకు చెందిన సుమారు 1,500 మందికి పైగా విద్యార్థులకు ఆమె శిక్షణ ఇచ్చారు. కూచిపూడిలో శోభా నాయుడు చేసిన సేవలకు గానూ 2001లో భారత ప్రభుత్వం ఆమెను...
AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 4622 మందికి పాజిటివ్, 5715 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 42,855గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyదేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుతున్నాయి, ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైరస్ ఇంకా తొలగిపోలేదని ప్రజలను హెచ్చరించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని గుర్తుచేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే...
Andhra Pradesh Shocker: ప్రేమించలేదని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు, అతను నిప్పటించుకున్నాడు, కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఉన్మాది దారుణ ఘటన
Hazarath Reddyప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడమే కాకుండా ప్రేమించలేదన్న కోపంతొ ఉన్మాది (Andhra Pradesh Shocker) ఓ యువతిపై పెట్రోల్ పోసి సజీవదహనం (Estranged Lover Burns Woman) చేశాడు. ఆ యువతి తన ప్రేమను నిరాకరించడంతో పాటు పోలీసులకు పిర్యాదు చేసిందని కసితో రగిలిపోయి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన సోమవారం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
Heavy Rains Lash AP: కాకినాడలో తీరం దాటిన వాయుగుండం, విజయవాడలో విరిగిన కొండ చరియలు, భారీ వర్షాలకు ఏపీలో ఇద్దరు మృతి, విశాఖలో ఒడ్డుకు కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్‌ మర్చంట్‌ వెసల్‌ నౌక
Hazarath Reddyసోమవారం రాత్రి నుంచి వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains Lash AP) కురిశాయి. విశాఖపట్నం, విజయవాడలో వర్ష సంబంధిత సంఘటనల్లో ఇద్దరు మరణించగా, విశాఖపట్నంలో ఒక కార్గో షిప్ కొట్టుకుపోయింది. ఐఎండి (IMD) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం మంగళవారం ఉదయం 6:30 గంటల నుండి ఉదయం 7:30 గంటల మధ్య కాకినాడ సమీపంలో తీరం (depression crosses coast near Kakinada) దాటింది. ఇది తీరం దాటిన తరువాత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Rs 5 Lakh Compensation for Journalists: ఏపీ సర్కారు కీలక నిర్ణయం, కోవిడ్ పోరులో మరణించిన జర్నలిస్టులకు రూ.5 లక్షల పరిహారం, హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైయస జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) మరో కీలక నిర్ణయ తీసుకున్నారు. కరోనా క్లిష్ట సమయంలోనూ ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. కరోనా వైరస్‌పై పోరులో మరణించిన ప్రతి జర్నలిస్ట్‌కు రూ.5 లక్షల పరిహారం (Rs 5 Lakh Compensation for Journalists) చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (Indian Journalist Union) అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని మంగళవారం మీడియా ముందు వెల్లడించారు.
Visakha Guest House: విశాఖ అతిథి గృహానికి రాజధానికి ఎలాంటి సంబంధం లేదు, హైకోర్టుకు స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం, అన్ని వ్యాజ్యాలపై విచారణ నవంబర్‌ 2కి వాయిదా
Hazarath Reddyఏపీ సుందర నగరం విశాఖపట్నంలో నిర్మించ తలపెట్టిన అతిథి గృహానికి (Visakhapatnam guest house) రాజధానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అది స్వతంత్ర నిర్ణయమని, అతిథి గృహ నిర్మాణంపై గతంలో ఇచ్చిన యథాతథస్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ హైకోర్టును అభ్యర్థించారు
Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు, వాయుగుండం నేడు తీరం దాటే అవకాశం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు
Hazarath Reddyబంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు (Heavy Rains in Telugu States) కురుస్తున్నాయి. తెలంగాణతో పాటు రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) పలు చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (West Central Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నేడు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖ-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
AP's COVID19 Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 3,224 మందికి పాజిటివ్, రాష్ట్రంలో నమోదైన 7.58 లక్షల కేసుల్లో కేవలం 43 వేల కేసులు మాత్రమే ఆక్టివ్
Team Latestlyఉభయ గోదావరి జిల్లాల్లో కొవిడ్ తీవ్రత గతంలో కంటే తగ్గినప్పటికీ కొత్తగా నమోదయ్యే కేసులు ఎక్కువగా ఇక్కడి నుంచే ఉంటున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా నుంచి 547 కేసులు నమోదయ్యాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 489 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
Slandering Posts on Judges: జడ్జీలపై అనుచిత పోస్టులు, కేసును సీబీఐకి అప్పగించిన ఏపీ హైకోర్టు, సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వానికి సూచన, రాజధాని అమరావతిపై విచారణ నవంబర్ 2కు వాయిదా
Hazarath Reddyఇటీవల సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అవాంఛనీయ రీతిలో వ్యాఖ్యలు (Slandering Posts on Judges) చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టు (AP High Court) అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసును సీబీఐకి (CBI) అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. సామాజిక మాధ్యమాలలో ఇటీవల జడ్జీలను దూషించిన వారిపై కూడా.. ఎఫ్‌ఐఆర్‌ (FIR) నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.