ఆంధ్ర ప్రదేశ్
Bulk Drug Park in AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ, కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగింత
Hazarath Reddyపరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ప్రజల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా జగన్ సర్కారు రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు (Bulk Drug Parks in AP) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పార్క్ ఏర్పాటు కోసం కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి (APIIC) అప్పగించింది. అదే విధంగా ప్రైవేట్ పార్టనర్‌ని గుర్తించే బాధ్యతను అప్పగించడం సహా ఐఐసీటీ, సీఎస్‌ఐఆర్‌లతో నాలెడ్జ్‌ పార్టనర్‌లుగా ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Father Deceased at Daughter Grave: కూతురుపై ఎనలేని ప్రేమ, సమాధి దగ్గరే ప్రాణాలు విడిచిన ఓ తండ్రి, మచిలీపట్నంలో గుండెను పిండేసే విషాద ఘటన
Hazarath Reddyకృష్ణా జిల్లా మచిలీపట్నంలో (Machilipatnam) కన్నీళ్లు పెట్టించే విషాద ఘటన జరిగింది. బిడ్డ మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి ఆమె సమాధి దగ్గరే ప్రాణాలు (Father Deceased at Daughter Grave) విడిచాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె అనారోగ్యంతో తనువు చాలించడంతో తట్టుకోలేని తండ్రి ఆమెనే తలుచుకుంటూ ప్రాణాలు విడిచాడు.
AP DGP Sawang VC: ఒక్క పోలీస్ తప్పు చేస్తే వ్యవస్థ మొత్తానికి చెడ్డపేరు, 76 వేల మంది పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ డీజీపీ దామోదర్ గౌతం సవాంగ్, కలిసి పనిచేద్దామని పిలుపు
Hazarath Reddyపోలీస్ వ్యవస్ధలో ప్రక్షాళన జ‌ర‌గాల‌ని, స‌మ‌స్య‌ల‌తో పోలీసు స్టేషనుకు వ‌చ్చే ప్రజలను గౌరవించాల‌ని ఏపీ డీజీపీ గౌత‌మ్ సవాంగ్ (AP DGP Damodar Goutam Sawang) అన్నారు. పోలీసు‌ శాఖలోని అన్ని అంతర్గత డిపార్ట్మెంట్లతో డీజీపీ బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్ (AP DGP Sawang Video Conference) నిర్వ‌హించారు. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 76 వేల మంది పోలీసు సిబ్బందితో నిర్వ‌హించిన ఈ కాన్ఫ‌రెన్స్‌లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై (Friendly Policing) అధికారులకు డీజీపీ దిశా నిర్దేశం చేశారు.
Woman Gang Raped: ఒంటరి మహిళపై గ్యాంగ్ రేప్, మరోచోట అన్నే కామాంధుడయ్యాడు, ఇంకోచోట తమ్ముడి కోసం కామాంధుడికి బలైన ఓ అక్క, బిడ్డ తలపై తుఫాకీ పెట్టి తల్లిపై అత్యాచారం
Hazarath Reddyతెలంగాణలో నిజామాబాద్ లో అర్దరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రికి వెళ్లి తిరిగివస్తున్న మహిళను 12 మంది గ్యాంగ్ రేప్ (Woman Gang Raped) చేసారు. వివరాల్లోకి వెళితే ...జిల్లాలోని ఎడపల్లి మండలానికి చెందిన ఓ మహిళ సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. బాధితురాలిని ఆమె సోదరి నిజామాబాద్ (Nizamabad) లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చింది. పని నిమిత్తం సోమవారం రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్ ( Nizamabad railway station) సమీపంలోకి వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న మహిళను విక్కీ అనే యువకుడు గమనించాడు. ఆమెతో మాట కలిపి సాయం చేస్తానని నమ్మించాడు. అక్కడ ఉన్న రెవెన్యూ భవన్ లోని ఖాళీ గదిలో మహిళ పై విక్కీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
AP Three Capitals: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ, హైకోర్టులో విచారణలో ఉన్నందున పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల స్టేటస్ కో అంశంపై జోక్యం చేసుకోలేమని వెల్లడి
Hazarath Reddyమూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో (Supreme Court) మరోసారి నిరాశే ఎదురయింది. పాలనా వికేంద్రీకరణ (Three capitals), సీఆర్డీఏ రద్దు చట్టాలపై (CRDA Repeal petition) ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ జరగ్గా.. పిటిషన్‌ను జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు (High Court) విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమంది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది.
Special Courts in AP: ఆడపిల్లల రక్షణ కోసం ఎనిమిది స్పెషల్‌ కోర్టులు, కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు, జిల్లా జడ్జి క్యాడర్‌తో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు, దిశ తరహాలో అవినీతి నిర్మూలనకు కొత్త బిల్లు
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు ( AP Govt) మహిళల రక్షణకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది స్పెషల్‌ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం (Government of Andhra Pradesh) ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల కేసులు (POSCO) విచారణ కోసం ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది. వందకు పైగా పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్న చోట కోర్టులు (Special Courts in AP) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.
Reverse Tendering Orders: పనులు రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ
Hazarath Reddyఅవినీతి నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం (Government of Andhra Pradesh) మరో కీలక నిర్ణయం తీసుకుంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో భాగంగా కోటి రూపాయలు దాటిన వస్తు, సేవల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ (Reverse Tendering) చేపట్టనుంది. వ్యాపార కొనుగోళ్లలో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా జగన్ సర్కారు (YS Jagan Govt) ఆదేశించింది. కోటి రూపాయల విలువదాటిన ప్రతీ లావాదేవీని రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టాలని, టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
Telugu States Covid Updates: తిరుపతి ఎమ్మెల్యే భూమనకు కరోనా, జగిత్యాల అడిషనల్‌ ఎస్పీ కోవిడ్‌తో మృతి, మహబూబాబాద్‌ కలెక్టర్‌కు కరోనా
Hazarath Reddyతిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar Reddy) కరోనావైరస్ బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు. జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణ మూర్తి (Jagtial Additional SP Dakshinamurthy) కరోనాతో మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు.
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 9,927 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3 లక్షల 71 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3460కు పెరిగిన కరోనా మరణాలు
Team Latestlyనిన్నటి నుండి ఈరోజు వరకు మరో 9,419 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,78,247 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో...
CM YS Jagan Review: శత్రువులు ఎక్కువ, అందుకే వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోంది, సమయం పట్టినా చివరకు న్యాయమే గెలుస్తుందని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, పలు అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఏపీలో జరుగుతున్న పరిణామాలు, కీలక పథకాలపై ఈ రోజు సమీక్ష సమావేశం (CM YS Jagan Review) నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ సహా వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇళ్ల పట్టాల సమీక్ష సంధర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ.. ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ (house pattas distribution) ప్రక్రియ త్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు
CM Jagan Video Conference: కరోనా చికిత్సకు ఎక్కువ రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు, ఆస్పత్రులు కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలని కోరిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఏపీలో కోవిడ్‌ చికిత్సలకు అధిక రేట్లు వసూలు చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. స్పందన కార్యక్రమంపై (AP CM YS Jagan) మంగళవారం సీఎం జగన్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దాని కంటే.. కోవిడ్‌ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలన్నారు. కోవిడ్ బాధితుడికి అరగంటలోగా బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని తెలిపారు. 104, 14410 కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
AP Weather Update: మరో అల్ప పీడనం, రానున్న మూడు రోజులు ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, మెరుపులతో కూడిన వాన, వెల్లడించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పేలా లేదు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు (Telugu states Rains) ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. అయితే, మరో మూడు రోజుల పాటు వర్షాలు (Heavy Rain Fall Alert) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వాన (Andhra Pradesh weather forecast) పడవచ్చని అటు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు.
Swarna Palace Incident: స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చెక్కును అందజేసిన రాష్ట్ర మంత్రులు, పరారీలోనే రమేష్ ఆస్పత్రి డైరక్టర్
Hazarath Reddyవిజయవాడ రమేష్ ఆస్పత్రి స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో (Swarna Palace Incident) మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికం సాయం అందజేసింది. రాష్ట్ర మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను (Rs 50 lakh ex gratia victims family) మంగళవారం అందజేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
AP Coronavirus: కరోనా నుంచి కోలుకుని ఏపీలో 2,68,828 మంది డిశ్చార్జ్, యాక్టివ్‌గా 89,516 కేసులు, తాజాగా 8,601 మందికి కరోనా, రాష్ట్రంలో మొత్తం 32,92,501కి చేరిన కరోనా టెస్టులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో గత 24గంటల్లో 54,463 కరోనా టెస్టులు చేయగా.. 8,601 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 86మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా గణాంకాల ప్రకారం.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,58,817కి పెరగగా.. ఇప్పటివరకు 3,368 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Adimulapu Suresh Covid 19: ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా, వాట్సాప్ స్టేటస్‌లో వెల్లడించిన ఆదిమూలపు సురేష్, తనను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచన
Hazarath Reddyఏపీలో సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ నేతలకు కూడా కరోనా బారీన పడుతున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా (AP Educational Minister Tests Corona Positive) నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని చెబుతున్నారు.
Husband-Wife Conflicts: భార్య-భర్తల మధ్య విభేదాలు, కృష్ణానదిలో దూకి డాక్టర్ ఆత్మహత్య, గోదావరి నదిలో దూకి మరొకరు ఆత్మహత్యా ప్రయత్నం, ఇంకో చోట భార్య నీటి కుంటలో దూకి కుమార్తెతో సహా ఆత్మహత్య
Hazarath Reddyచిన్న చిన్న గొడవలతో పచ్చని సంసారాలు కకావికలమవుతున్నాయి. సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడంతో ప్రాణాలు తీసుకుంటూ కుటుంబానికి వేదన మిగిలుస్తున్నారు. రోజు ఇలాంటి ఘటనలో ఎక్కడో ఓ చోట జరగుతూనే ఉన్నాయి. భార్య భర్తల మధ్య విభేధాలు (Husband-Wife Conflicts) తలెత్తితే ఆత్మహత్య శరణ్యమనే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. కొన్ని చోట్ల వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చును పెడుతున్నాయి.
Apex Council Meeting Postponed: నదీ జలాల వివాదం, మళ్లీ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ
Hazarath Reddyకృష్ణా, గోదావరి నదీ జల వివాదాలకు (water sharing issues) సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన ఈ నెల 25న నిర్వహించాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా (Apex Council Meeting Postponed) పడింది. ఈమేరకు కేంద్ర జలశక్తి శాఖ అధికారికంగా ప్రకటించింది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర జల సంఘం, కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏసీ మల్లిక్‌ లేఖలు రాశారు.
Interstate Travel Row: తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు, త్వరలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం, అధికారులకు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక సూచనలు..
Hazarath Reddyమరికొద్ది రోజుల్లో అన్‌లాక్ 3 ముగియనుండటంతో కేంద్రం అంతరాష్ట్ర సర్వీసులపై (Interstate Travel) కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. అన్‌లాక్ సీజన్ లో భాగంగా, ఏ రాష్ట్రాల మధ్య కూడా ప్రయాణికులకు ఆటంకాలు కల్పించవద్దని, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలు కల్పించాలని కేంద్రం ఆదేశించింది. ఇందులొ భాగంగా తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య బస్సులను తిరిగి పునరుద్దరించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ (APSRTC And TSRTC) అధికారుల మధ్య త్వరలో హైదరాబాద్‌లో చర్చలు (Interstate-travel discussions) జరుగనున్నాయని వార్తలు వస్తున్నాయి.
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7,895 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3,53,111కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3282కు పెరిగిన కరోనా మరణాలు
Team Latestlyనిన్నటి నుండి ఈరోజు వరకు మరో 7,449 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,60,087 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 89,742 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ...
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3,45,216కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3189కి పెరిగిన కరోనా మరణాలు
Team Latestlyరో 8,593 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,52,638 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 89,389 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...