ఆంధ్ర ప్రదేశ్

AP Inter Reverification Results 2020 Declared: ఏపీ ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల సమాచారం

Hazarath Reddy

AP ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు 2020 (AP Inter Reverificaiton Results 2020 Declared) వెలువడ్డాయి. BIEAP 2 వ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం AP ఇంటర్ రివెరిఫికేషన్ ఫలితాలను ( Re-verification Results) 2020 అధికారికంగా ప్రకటించింది. అధికారిక సమాచారం ప్రకారం, BIEAP ఇంటర్ రివెరిఫికేషన్ ఫలితాలు 2020 మరియు AP ఇంటర్ రీకౌంటింగ్ ఫలితాలు 2020 ఈ రోజు ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ప్రచురించబడ్డాయి. AP ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితం 2020 కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్ లోకి లాగిన్ అవ్వడం ద్వారా వారి వివరణాత్మక ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

COVID-19 in AP: కరోనాతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మృతి, ఏపీలో తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 కేసులు, తాజాగా 7,822 కరోనా కేసులు నమోదు

Hazarath Reddy

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (Former Bhadrachalam MLA Sunnam Rajaiah) కరోనాతో మృతి చెందారు. స్వగ్రామం వీఆర్‌పురం మండలం సున్నం వారి గూడెంలో రాజయ్య తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించగా...చికిత్స పొందుతూ రాజయ్య మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రచాలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు ఆయన సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

CM Jagan Raksha Bandhan Greetings: నా ప్రియమైన అక్కాచెల్లెమ్మలకు శుభాభినందనలు, ట్విట్టర్ ద్వారా రాఖీ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం, గవర్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్

Hazarath Reddy

రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు (CM Jagan Raksha Bandhan Greetings) తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్‌ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వదినం అని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో రాఖీ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.

Andhra Pradesh e-Pass: ఏపీకి వచ్చేవారికి ఇకపై నో కండీషన్స్, ఆటోమేటిక్ ఈ పాస్ సిస్టంను ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు, స్పందనలో నమోదు చేసుకుంటే తక్షణమే ఈ పాస్

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా అన్‌లాక్‌ 3.0 (Unlock 3) ప్రారంభమైంది. ఆగస్టు 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే కేంద్రం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిబంధనలు ( AP Border) సడలించారు. కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ (Lockdown) కొనసాగుతుందని.. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్ రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలిగించింది. అలాగే మరికొన్ని నిబంధనల్ని కూడా సడలించింది. రాష్ట్రాల్లో కూడా ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. కొన్ని నిర్ణయాలు మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించారు.

Advertisement

AMRDA Replacing APCRDA: ఏపీసీఆర్‌డీఏ కనుమరుగు, దాని స్థానంలో 11 మందితో ఏఎంఆర్‌డీఏ ఏర్పాటు, కమిషనర్‌గా పి.లక్ష్మీనరసింహం, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీసీఆర్‌డీఏ (APCRDA) స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని (Amaravati Metropolitan Region Development Authority (AMRDA)) ప్రభుత్వం 11 మందితో ఏర్పాటు చేసింది. చైర్‌పర్సన్‌గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన లేదా పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నియమిస్తూ తరువాత ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

Visakhapatnam Crane Collapsed: రూ. 50 లక్షల నష్టపరిహారం, శాశ్వత ఉద్యోగం, రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఎల్‌ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం, క్రేన్‌ ప్రమాదంపై కేసు నమోదు, దర్యాప్తు

Hazarath Reddy

విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డులో (Hindustan Shipyard Ltd) శనివారం క్రేన్‌ కూలిన దుర్ఘటనలో (Visakhapatnam Crane Collapsed) 10 మంది ఉద్యోగులు, కార్మికులు మృతిచెందిన విషయం విదితమే. వీరి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఎల్‌ యాజమాన్యంతో ఆదివారం జరిపిన చర్చలు ఫలించాయి. క్రేన్‌ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం (Rs 50 lakh ex-gratia) మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, హెచ్‌ఎస్ఎల్‌ సీఎండీ శరత్‌బాబు సంయుక్తంగా ప్రకటించారు.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 9,276 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 50 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో 12 వేలకు పైగానే డిశ్చార్జ్

Team Latestly

నిన్నటి నుండి ఈరోజు వరకు అత్యధికంగా 12,750 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 76,614 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 72,188 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...

Vishakhapatnam: విశాఖపట్నంలో ఘోర ప్రమాదం, భారీ క్రేన్ కూలి 10 మంది దుర్మరణం, అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్ జగన్

Team Latestly

ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమయ్యే తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు...

Advertisement

Rain Alert in Telugu States: తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, ఆగస్టు 4న‌ అల్పపీడనం ఏర్పడే అవకాశం, వెల్లడించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

రానున్న‌ మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాలో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు (Rain Alert in Telugu States) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో (Telangana) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు వెల్ల‌డించారు.

AP Coronavirus Update: ఆ ఏడు జిల్లాల్లోనే 90 వేలకు పైగా కేసులు, ఏపీలో మరో 10376 కొత్త కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 1,38,038కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య, 1,349కి పెరిగిన మృతుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలోని 13 జిల్లాలకు గానూ ఏడు జిల్లాల్లోనే 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో ఇప్పటిదాకా 14,699 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో ఇప్పటిదాకా 10,379 కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ గోదావరిలో ఇప్పటిదాకా 20,395 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఇప్పటిదాకా 14,669 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో ఇప్పటిదాకా 16,847 కేసులు నమోదయ్యాయి.విశాఖపట్నంలో ఇప్పటిదాకా 10,765 కేసులు నమోదయ్యాయి. వెస్ట్ గోదావరిలో ఇప్పటిదాకా 12,310 కేసులు నమోదయ్యాయి

Nimmagadda Ramesh Kumar: వివాదాల నడుమ ఏపీ ఎస్ఈసీగా మళ్లీ నిమ్మగడ్డ నియామకం, అర్థరాత్రి ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి నియామకం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను (Nimmagadda Ramesh Kumar) పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం (AP Govt) గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (Governor Biswabhushan Harichandan) పేరుతో ఈ ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు.

AP Decentralisation Bill: మూడు రాజధానులకు సై, రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

Hazarath Reddy

ఏపీలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు (AP Decentralisation Bill) గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. దీంతోపాటుగా సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా ఆయన (governor biswabhusan harichandan) ఆమోదించారు. దీంతో.. ఇప్పటివరకూ ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి ఇక నుంచి శాసన రాజధానిగా మారనుంది. ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు మారనున్నాయి. వికేంద్రీకరణ బిల్లును 3 వారాల క్రితం జగన్ సర్కార్ గవర్నర్‌కు పంపింది. ఇప్పుడు.. గవర్నర్ ఆమోదించడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినట్టయింది.

Advertisement

Vidya Varadhi Mobile Vehicles: ఏపీలో సరికొత్త పథకం, విద్యా వారధి మొబైల్‌ వాహనాలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం, ప్రతి జిల్లాలోని విద్యార్థులకు వీటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారధి మొబైల్‌ వాహనాలు (Vidya Varadhi Mobile Vehicles) అందుబాలోకి తీసుకు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. విద్యా వారధి మొబైల్‌ వాహనాలను మంత్రి సురేష్‌ (Education Minister Adimulapu Suresh) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో విద్యకు దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో సప్తగిరి ఛానెల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

RS 5000 to Plasma Donors: ప్లాస్మా ఇస్తే రూ.5వేల ప్రోత్సాహక నగదు, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఏపీ సీఎం వైయస్ జగన్‌, ప్రతి ఆస్పత్రిలో బ్లాక్‌ బోర్టులో బెడ్ల వివరాలు ఉండాలని ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే వారికి రూ.5 వేల ప్రోత్సాహక నగదు (Five Thousand for Plasma Donors) అందజేస్తామని ప్రకటించింది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో (CM Office) కరోనా వైరస్ నిర్మూలన, ఆస్పత్రుల్లో వైద్యం, విద్యావ్యవస్థ, నాడు-నేడుపై (AP CM YS Jagan review meeting) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ప్లాస్మా థెరపీపై అవగాహన కల్పించాలని సీఎం తెలిపారు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సాహించాలి. ప్లాస్మా ఇచ్చేవారికి 5వేల రూపాయలు ఇవ్వండి. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుంది’ అని సీఎం జగన్ తెలిపారు.

Kurichedu Sanitizer Deaths: కురిచేడులో శానిటైజర్ తాగి పది మంది మృతి, విషాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌

Hazarath Reddy

ప్రకాశం జిల్లా కురిచేడులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కురిచేడులో శానిటైజర్‌ తాగిన ఘటనలో పది మంది మృతిచెందారు. నిన్న అర్ధరాత్రి ముగ్గరు మరణించగా, శుక్రవారం మరో ఏడు మంది మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు భిక్షాటన చేసే వ్యక్తులు కాగా, మరో ఆరుగురు గ్రామస్తులు ఉన్నారు. చనిపోయిన వారిని అనుగొండ శ్రీను బోయ(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60), కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65), బాబు (40), ఛార్లెస్‌ (45), అగస్టీన్‌ (47) గా గుర్తించారు.

English Medium Row: ఇంగ్లీష్ మీడియానికే కట్టుబడి ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ,యూకేజీ విద్య అమలు, మీడియాతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్

Hazarath Reddy

ఇప్పటికీ ఇంగ్లీషు మీడియం స్కూళ్లకే కట్టుబడి ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ (Education Minister Adimulapu Suresh) స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంపై (National Education Policy (NEP) ఆయన స్పందించారు. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) మార్గదర్శకాలను పరిగణనలోనికి తీసుకొనే తాము విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. 97శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం (English Medium) కావాలన్నాన్నారు.

Advertisement

BJP on AP Capital: రాజధానిని మార్చుకోండి, కేంద్రం రాజధాని మార్పు విషయంలో జోక్యం చేసుకోదని తెలిపిన ఏపీ బీజీపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

Hazarath Reddy

ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (BJP AP President Somu Veerraju) స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు (Capitals) ఏర్పాటు చేస్తున్నారని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల (State Govt)నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ప్రజలను మభ్యపెడుతూ.. కథలు చెప్పారని విమర్శించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు.

Water War: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోం! నదీ జలాల వాటాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష, తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని తీర్మానం

Team Latestly

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసి తీరాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించించింది....

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 30 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో 70 వేలకు పైగానే టెస్టుల నిర్వహణ

Team Latestly

గడిచిన ఒక్కరోజులో భారీ స్థాయిలో 70, 068 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు 18,90,077 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది....

Krishna Water Tussle: ఏపీ- టీఎస్ నీటి పంచాయితీలో మరో మలుపు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను నిలిపివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశాలు

Team Latestly

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని అక్రమంగా మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి విరుద్దమైందని చెబుతూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.....

Advertisement
Advertisement