ఆంధ్ర ప్రదేశ్
AP Corona Updates: ఏపీలో 13 లక్షలు దాటిన కరోనా టెస్టులు, తెనాలి ఎమ్మెల్యేకి కోవిడ్-19, లాక్‌డౌన్ ప్రకటించిన షార్‌, మానవత్వాన్ని మింగేస్తోన్న కరోనావైరస్
Hazarath Reddyరాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు (AP Coronavirus Tests) 13 లక్షల మార్కును అధిగమించాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 31,148 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షల సంఖ్య 13,15,532కి చేరింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం (Srihari kota SHAR) లాక్‌డౌన్‌ను ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు షార్ లాక్‌డౌన్ (SHAR Lockdown) కొనసాగనుంది. వాటర్, కరెంట్, ఫైర్ అవసరాలు మినహా అన్ని సేవలు బంద్‌కానున్నాయి.
AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో కల్లోలం, ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 50 వేలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య
Team Latestlyగత 24 గంటల్లో కొత్తగా మరో 5,041 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి. అయితే అందుకు తగినట్లుగా ఏపి సర్కార్ వైరస్ నిర్ధారణ పరీక్షలను కూడా భారీగా పెంచింది....
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్ స్థాయిలో 3,963 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే మరో 52 మంది మృతి, రాష్ట్రంలో 44 వేలు దాటిన కొవిడ్19 బాధితుల సంఖ్య
Team Latestlyరాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 52 కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. పలు జిల్లాల నుంచి పదుల సంఖ్యలో కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 586 కు పెరిగింది.
'Sanjeevani' Buses in AP: అరగంటలోనే కరోనా టెస్ట్ ఫలితం, ఏపీలో సిద్ధమైన సంజీవని వాహనాలు, అన్ని జిల్లాలకు అందుబాటులో.., ప్రారంభించిన పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణకు జగన్ సర్కారు టెస్టుల సంఖ్యను పెంచింది. ల్యాబ్‌లకు తోడు కొత్తగా సంజీవని వాహనాలను ('Sanjeevani' Buses in AP) ఏర్పాటు చేసింది. దీంతో అరగంటలోనే కరోనా టెస్టుల ఫలితం రానుంది. ఆర్టీసీ బస్సులను సంజీవని వాహనాలుగా మార్చి ఏపీలోని అన్ని జిల్లాలకు చేరవేశారు. విశాఖపట్నం జిల్లాలో ఐదు సంజీవని వాహనాలు (COVID-19 Sample Testing Buses) అందుబాటులోకి వచ్చాయి. బస్సుకు రెండు వైపుల నుంచి ఒకేసారి పదిమంది నమూనాలు సేకరించవచ్చు.
Mid-Day Meal Scheme in TS: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, ప్రభుత్వ జూనియర్‌,డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్‌ విద్యా సంవత్సరం
Hazarath Reddyఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Mid-Day Meal scheme in TS) పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో (government junior and degree colleges) డ్రాపవుట్స్‌ పెరిగిపోతున్నాయని కేసీఆర్‌ (CM KCR) అన్నారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు విద్యార్థులకు పౌష్ఠికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం (Mid-Day Meal scheme) పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల హాజరుశాతం పెరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
AP Covid-19 Report: ఏపీలో 40 వేలు దాటిన కరోనా కేసులు, తాజాగా 2,602 మందికి కోవిడ్-19 పాజిటివ్, 534కి చేరిన కరోనా మృతుల సంఖ్య
Hazarath Reddyఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేల మార్కు (AP Covid-19 cases) దాటింది. రాష్ట్రంలో కొత్తగా 42 మరణాలు సంభవించగా, కరోనా మృతుల సంఖ్య (Covid-19 Deaths) 534కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో మరో 2,602 మందికి పాజిటివ్ అని తేలింది. జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావరిలో అత్యధికంగా 643 కేసులు నమోదయ్యాయి. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,646కి చేరింది. తాజాగా 837 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 19,814 మంది చికిత్స పొందుతున్నారు.
Face Masks in AP: ఇకపై మాస్క్ తప్పనిసరి, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్, ముస్కాన్‌ కోవిడ్‌–19కు విశేష స్పందన, నెల 20వ తేదీ వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ కోవిడ్‌–19 కార్యక్రమం
Hazarath Reddyఏపీలో కరోనావైరస్ కట్టడికి ఆంక్షలు మరింత కఠినంగా అమలు కానున్నాయి. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమాయాల్లో మాస్కు ధరించటాన్ని తప్పనిసరి (Face Masks in AP) చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు (AP Govt Issued Orders) జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సూచించిన నిర్దేశిత ప్రమాణాల్లో భాగంగా ఫేస్ మాస్కు, ముఖం కప్పుకునేలా కవర్ ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశిలిచ్చింది.
Eluru Man Death: నాన్నా నీకు నెగిటివ్ అంటూ కొడుకు అరుపులు..కరోనా పాజిటివ్ అని భ్రమపడి కుప్పకూలిన తండ్రి, ఏలూరులో విషాద ఘటన
Hazarath Reddyఏపీలో ఏలూరులో విషాదం చోటు (Eluru Man Death) చేసుకుంది. తండ్రికి కోవిడ్-19 (Coronavirus) సోకలేదనే విషయాన్ని కొడుకు బిగ్గరగా అరిచి చెప్పడంతో (felt wrongly Covid 19 Results) భయపడిన తండ్రి అక్కడికక్కడే కుప్పకూలాడు, సమీపంలోనే ఉన్న వైద్య సిబ్బంది చికిత్స చేసేందుకు అతన్ని అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్టు నిర్దారించారు.
Old Man Commit Suicide: మహిళల మానసిక వేధింపులతో వృద్ధుడు ఆత్మహత్య, సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడిన లక్ష్మీపతిరావు, ఏపీలో తణుకులో విషాద ఘటన
Hazarath Reddyఏపీలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పక్క వారు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారనే బాధతో అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్యకు (Old Man Commit Suicide) పాల్పడ్డాడు. ఈ మానసిక వేధింపులు, అలాగే పోలీసులతో పోరాడే శక్తి నాకు లేదంటూ సూసైడ్‌ నోట్‌ (suicide note) రాసి మరీ బలవన్మరణానికి పాల్పడిన తీరు (84 year old man committed suicide) అక్కడి వాసులను కలచివేస్తోంది. దీనికి ప్రధాన కారణం అపార్టుమెంటు కమిటీ సభ్యులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేయడమేనని అయిదు పేజీల సూసైడ్‌ నోట్‌‌లో ఆ వృద్ధుడు రాసాడు.
TN Police Money Seized Issue: ఆ రూ.5 కోట్లు మావే, వైసీపీ నేతకు ఎలాంటి సంబంధం లేదు, బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు వివరణ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో ఫార్చ్యునర్ వాహనంలో దొరికిన రూ. 5 కోట్ల 22 లక్షలు (TN Money Smuggling Issue) తనవేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు (Gold Businessman Nallamalli Balu) ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఏ రాజకీయపార్టీకి, నాయకులకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా కొనుగోలు చేయలేకపోయామని చెప్పారు. సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించి నగదు విడిపించుకుంటామని బాలు చెప్పారు.
AP Coronavirus: ఏపీలో 24 గంటల్లో 40 మంది మృత్యువాత, రాష్ట్ర వ్యాప్తంగా 38,044కి చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 19,393 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్
Hazarath Reddyఏపీలో గత కొన్నిరోజులుగా మరణాల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో ఈ ప్రమాదకర వైరస్ (AP Coronavirus) బారినపడి 40 మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో 8 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు.
YSR Aarogyasri Scheme: ఆస్పత్రి ఖర్చు రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి, ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలు, జనగవరి 3 నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అమలు
Hazarath Reddyఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను (YSR Aarogyasri scheme expansion services) ప్రారంభించారు. వైద్య ఖర్చులు రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ ( YSR Aarogyasri Scheme) పరిధిలోకి తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan)ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేసి తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 3 నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో అమల్లోకి తీసుకు రానున్నారు.
APSRTC: ఇకపై బస్సులోనే టికెట్లు, గ్రౌండ్‌ బుకింగ్‌కు పుల్ స్టాప్ పెట్టే యోచనలో ఏపీఎస్ఆర్టీసీ, గ్రౌండ్‌ లెవల్ బుకింగ్ ద్వారా కలెక్షన్‌ బాగా తగ్గిపోవడమే ప్రధాన కారణం
Hazarath Reddyఆర్టీసీలో ఇప్పటిదాకా కొనసాగిస్తున్న గ్రౌండ్‌ బుకింగ్‌కు బ్రేక్‌ పడబోతోంది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడిపింది. మే 21 నుంచి గ్రౌండ్‌ బుకింగ్‌ ద్వారా ప్రయాణీకులను బస్సు ఎక్కించి వారి గమ్యాలకు చేర్చే ప్రక్రియను చేపట్టారు. అయితే గ్రౌండ్‌ బుకింగ్‌ ప్రక్రియ ద్వారా కలెక్షన్‌ బాగా తగ్గిపోయింది. ఈ ప్రక్రియ ద్వారా బస్సులు సకాలంలో నడిపించలేకపోతున్నారు. బస్సులలో ప్రయాణీకులు ఆయా బస్టాండు కేంద్రాల నుంచి టికెట్స్‌ ఇచ్చి ఎక్కించడం వల్ల బస్సులు రాకపోకలు తీవ్రమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. గంటకు చేరాల్సిన బస్సు ఒకటిన్నర గంటకుపైగా సమయం పడుతోంది.
Balineni Srinivasa Reddy: ఆ డబ్బు నాదైతే ఎంక్వయిరీ వేయించండి, వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ రంగు పులుముకున్న రూ. ఐదు కోట్ల వ్యవహారం
Hazarath Reddyతమిళనాడు, ఆంధ్ర సరిహద్దులో కారులో పట్టుబడిన రూ. ఐదు కోట్ల వ్యవహారం ఏపీలో రాజకీయ రంగు పులుముకుంది. తమిళనాడు రిజిస్ట్రేషన్‌కు చెందిన ఆ కారుపై వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (YSRCP MLA Balineni Srinivasa Reddy) స్టిక్కర్ ఉండటం అందులో పట్టుబడిన ముగ్గురు ఒంగోలు (Ongloe) వాసులు కావడంతో ఆ సొమ్ము ఆయనదేనన్న ప్రచారం జరుగుతోంది. కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉండగా.. డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు దొరికిపోయారు కానీ.. అసలైన ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారని చెబుతున్నారు. వారిలో ఓ బంగారం వ్యాపారి.. మరో రాజకీయ నాయకుడి కుమారుడు ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
Heavy Rains Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, అలర్ట్ చేసిన విశాఖ వాతావరణ కేంద్రం, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా నమోదైన వర్షపాతం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల‌పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains Alert) ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్ర‌స్తుతం ఝార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీట‌ర్ల నుంచి నుంచి 7.6 కి.మి. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. సముద్ర తీరంలో ఏర్పడిన గాలుల కలయిక (షియర్‌ జోన్‌) ప్రభావంతో ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
AP Cabinet Key Decisions: మహిళలకు నాలుగు విడతల్లో రూ.75 వేలు, ఇందుకోసం నాలుగేళ్లలో రూ. 6163.59 కోట్లు కేటాయింపు, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ (Andhra Pradesh cabinet meeting) కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి (AP Cabinet) బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ (New Districts Formation Committee) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక దేశ చరిత్రలోనే తొలిసారి 9,712 వైద్యుల పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది.
AP Coronavirus Report: ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 2,432 కరోనా కేసులు నమోదు, రాష్ట్ర వ్యాప్తంగా 35,451కి చేరుకున్న మొత్తం కోవిడ్-19 కేసులు, కరోనాతో అనంతపురం సీఐ మృతి, తిరుపతిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో కేసులు తొలిసారిగా 2 వేల మార్కును (2,000 COVID-19 cases in a single day) దాటాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 2,432 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య (AP Coronavirus Report) 35,451కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మొత్తం 22,197 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,412 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్టు స్థాయిలో 12,17,963 శాంపిల్స్‌ను పరీక్షించారు.
New Districts Formation Committee: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, అధ్యయన కమిటీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం, మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయం
Hazarath Reddyఏపీ మంత్రి మండలి సమావేశం (Andhra Pradesh cabinet Meeting) ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ ఏర్పాటుపై (New Districts Formation Committee) మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు (new districts) అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది.
AP CM YS Jagan Review: ఏపీ సీఎం మరో సంచలన నిర్ణయం, కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేల ఆర్థిక సాయం, ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (Chief Minister YS Jagan Mohan Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనావైరస్ ఏపీలో కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కరోనావైరస్ (Coronavirus) సోకిన కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కోవిడ్‌ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
APSRTC: లాక్‌డౌన్ కాలంలో రిజర్వేషన్ చేసుకున్న వారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త, రీఫండ్ చేసుకునేందుకు మ‌రోమారు అవ‌కాశం, ఈనెల 29 వరకు గడువు
Hazarath Reddyలాక్‌డౌన్ కాలంలో (Lockdown) రిజర్వేషన్ చేసుకొని గ‌డువులోగా టికెట్ ర‌ద్దు చేసుకోలేని వారికి ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) శుభ‌వార్త చెప్పింది. వారు రీఫండ్ చేసుకునేందుకు మ‌రోమారు అవ‌కాశం ఇస్తున్న‌ట్లు పేర్కొంది. ఇందుకోసం ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కాన్సిలేషన్ పాలసీని (APSRTC Ticket Cancellation) సవరించింది. టికెట్ల‌కు న‌గ‌దు తిరిగి ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు ముమ్మ‌రం చేసింది. ఇందులో భాగంగా మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మ‌ధ్య రిజ‌ర్వేష‌న్ చేసుకున్న వారికి సైతం అవ‌కాశం క‌ల్పిస్తూ తాజాగా నిర్ణ‌యం తీసుకుంది.