ఆంధ్ర ప్రదేశ్
AP Corona Update: ఏపీలో ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి, 11వేలు దాటిన కోవిడ్-19 కేసులు సంఖ్య, నాలుగు జిల్లాల్లో వేయి దాటిన కరోనా కేసులు
Hazarath Reddyఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను (AP Corona Update) రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. గత 24 గంటల్లో 605 కేసులు (COVID-19 cases) నమోదు అయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 570 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 34 మంది, విదేశాలకు చెందిన వారు ఒకరు ఉన్నారు. మొత్తం 10 మంది చనిపోగా.. కర్నూల్ జిల్లాకు చెందిన వారు నలుగురు, కృష్ణా జిల్లాకు చెందిన వారు నలుగురు, గుంటూరులో ఒకరు, విశాఖలో ఒకరు మృతి (Corona Virus Deaths) చెందారు.ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11, 489 కేసులు నమోదు కాగా, 6147 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 5196 మంది డిశ్చార్జ్ అయ్యారని రికార్డులు చెబుతున్నాయి. మొత్తం 146 మంది చనిపోయారు.
YSRCP MLA Sudhakar: కరోనా భారీన మరో వైసీపీ ఎమ్మెల్యే, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ, ఐసోలేషన్‌ వార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు
Hazarath Reddyకరోనా వైరస్‌ సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, పోలీసుల నుంచి రాజకీయ నాయకుల దాకా ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మం‍త్రులు, పోలీస్ అధికారులు, డాక్టర్లు కోవిడ్ 19 ( COVID-19) భారీన పడ్డారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడగా..తాజాగా ఏపీలో మరో ఇద్దరు కరోనావైరస్ (Coronavirus) భారీన పడ్డారు. మొన్నటికి మొన్న విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కే శ్రీనివాసరావు (YCP S.Kota MLA Kadubandi Srinivasa Rao) ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారు.
Rabi Crop Insurance: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, రూపాయి కడితే మొత్తం బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది, పెండింగ్‌లో ఉన్న రబీ పంటల బీమా కోసం రూ.596.36 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కారు
Hazarath Reddyఏపీ ప్రభుత్వం (AP Govt) మరోసారి రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకునే దిశగా అడుగులు వేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra pradesh CM YS Jagan) గత సర్కారు పెండింగ్ లో పెట్టిన రబీ బీమా పంట సొమ్మును (Pending Rabi Crop Insurance) రైతులకు చెల్లించారు. 2018 రబీ పంటల బీమా సొమ్ముకు (Crop Insurance) గానూ ఏపీ ప్రభుత్వం రూ. 596.36 కోట్లను విడుదల చేసింది.
AP New Sand Policy: పేదలకు ఉచితంగా ఇసుక సరఫరా, ఇసుక కొరతపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, ఇకపై ఎడ్లబళ్లపై, ట్రాక్టర్లపై సొంత అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకువెళ్లవచ్చు
Hazarath Reddyపరిపాలనులో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇసుక పాలసీలో (Andhra Pradesh sand policy)పలు సవరణలు చేసి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇక నుంచి సొంత అవసరాలు, పేదల గృహ నిర్మాణం, సహాయ పునరావాస ప్యాకేజీలకు (weaker sections) ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చని స్పష్టం చేసింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది.1,2,3 ఆర్డర్‌ రీచ్‌లలో మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పింది. ఇసుక విధానంపై స్పష్టతనిస్తూ..అనుమతి ఉన్న రిచుల్లో ఎడ్లబళ్లపై సొంత అవసరాలకు ఉచితంగా తీసుకెళ్లొచ్చని, ట్రాక్టర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
AP UG,PG Exams Update: ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కాలేదు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నాం, విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి
Hazarath Reddyఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు (AP UG, PG Exams) రద్దయ్యాయని గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి విదితమే. అయితే దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Andhra Education Minister Adimulapu Suresh) క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి పరీక్షల (10th Exams) మాదిరి యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దన్న ప్రశ్న ఉత్పన్నమే కాలేదని స్పష్టం చేశారు.
AP coronavirus Report: ఏపీలో తాజాగా 553 కరోనా కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 10,884 కు చేరిన కేసుల సంఖ్య, రికార్డుస్థాయిలో కోవిడ్-19 పరీక్షలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 553 కరోనా పాజిటివ్‌ కేసులు (AP coronavirus Report) నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 19,085 సాంపిల్స్‌ను పరిశీలించగా 553 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,884 కు చేరింది. ఇప్పటివరకు ఏపీలో రికార్డుస్థాయిలో 7,69,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఏపీ నుంచి 8783 కేసులు, 1,730 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి
AP High Court: ఈ నెల 28 వరకు ఏపీ హైకోర్టు విధులు నిలిపివేత, సర్క్యులర్‌ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్‌, ఉద్యోగులపై పలు నిబంధనలు విధించిన న్యాయస్థానం
Hazarath Reddyకోవిడ్‌-19 (COVID-19) నేపథ్యంలో ఈ నెల 28 వరకు ఏపీ హైకోర్టు విధులు (AP High Court regular work) నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, విజయవాడ మెట్రో పాలిటన్‌ కోర్టుల విధులను సస్పెండ్‌ చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు రిజిస్ట్రార్‌ గురువారం ఈ మేరకు సర్క్యులర్‌ జారీ చేశారు. కాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ఆదేశాల మేరకు.. కరోనా కట్టడికి తమ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, సందర్శకుల విషయంలో న్యాయస్థానం ఇటీవల కఠిన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
TDP MLA Atchannaidu: ఏసీబీ కస్టడీకి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురు డైరక్టర్లు, మూడు రోజుల పాటు వీరిని విచారించనున్న ఏసీబీ
Hazarath Reddyఈఎస్ఐ నిధుల దుర్వినియోగం ( ESI scam) కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని (TDP MLA Atchannaidu) మరో అయిదుగురిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం (ACB Court) బుధవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను.. ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Animal Health Cards in AP: ఏపీ ప్రభుత్వం మరో సంచలన పథకం, మూగ జీవాల కోసం వైఎస్సార్‌ పశు సంరక్షణ స్కీం, మూగజీవాలకు ఆరోగ్య రక్షణ కార్డులు మంజూరు
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ ప్రజా సంక్షేమంతో పాటు మూగ జీవాల రక్షన కోసం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా మూగప్రాణులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల యజమానులు, పెంపకం దారులకు ఆసరాగా నిలిచేందుకు వైఎస్సార్‌ పశుసంరక్షణ పథకానికి (YSR Pasu Samrakshana Scheme) శ్రీకారం చుట్టారు.
MP Raghu Rama Krishna Raju: అనుకున్నదే జరిగింది, ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు పార్టీ నుంచి షోకాజ్ నోటీస్, ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
Hazarath Reddyఈ మధ్య ఏపీలో హాట్ టాఫిక్ గా మారిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Kanumuru Raghu Rama Krishna Raju) వివాదానికి ఎవైసీపీ పార్టీ చెక్ పెట్టే దిశగా ఎట్టకేలకు అడుగులు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు (MP Raghu Rama Krishna Raju) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) బుధవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
AP's Coronavirus Report: ఏపీలో 10 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, తాజాగా 497 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో 10,331కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyఏపీలో కరోనా కేసులు పదివేల మార్కును దాటాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 497 కరోనా కేసులు (Coronavirus cases) నమోదవగా, ఈ వైరస్‌ బారినపడినవారిలో 10 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య (AP's Coronavirus Report) 10,331కి చేరగా, 129 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 5,423 యాక్టివ్‌ కేసులు ఉండగా, మరో 4779 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 12 మంది ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు 37 మంది, రాష్ర్టానికి చెందినవారు 448 మంది ఉన్నారు.
Distribution of House Rails: వైఎస్సార్ పుట్టిన రోజున ఏపీ సీఎం భారీ గిఫ్ట్, పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyఏపి సిఎం వైయస్ జగన్‌ మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ‘స్పందన’ కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో (AP CM Video Conference) మాట్లాడారు. జూలై 8న దివంగత సిఎం వైఎస్ఆర్ జయంతి (YS Rajasekhara Reddy Birthday) రోజున పేదలకు ఇళ్ల పట్టాలను (Distribution of House Rails) ఇవ్వాలని నిర్ణయించారు. 29-30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని.. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని జగన్‌ అన్నారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు.
Telugu States RTC Meeting: తెలంగాణకు ఏపీ నుంచి బస్సులు ఇప్పట్లో కష్టమే, రెండు రాష్ట్రాల ఆర్టీసీ కీలక భేటీ వాయిదా, మళ్లీ భేటీ ఎప్పుడు అనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
Hazarath Reddyకరోనా వైరస్ లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులు ( inter state bus services) తిరిగి ప్రారంభమవుతాయని భావించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం హైదరాబాద్‌లో జరగాల్సిన కీలక భేటి (Telugu States RTC Meeting) కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం అయ్యాయి. ఇందులో భాగంగానే గతవారం విజయవాడలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు (AP Telangana RTC Higher Official Meeting) సమావేశమై అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చించుకున్నారు.
YSR Kapu Nestham: రూ.15 వేలు నేరుగా అకౌంట్లోకి, వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని లాంచ్ చేయనున్న ఏపీ సీఎం, 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు రూ.354 కోట్లు జమ
Hazarath Reddyపరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకెళ్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS jagan) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చుకుంటున్నారు. హామీల్లో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ (YSR Kapu Nestham) అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan Mohan Reddy) రంగం సిద్ధం చేశారు.
AP Degree Exams Cancelled: ఏపీలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు, ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం, డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు నేరుగా పై తరగతులకు ప్రమోట్
Hazarath Reddyకరోనావైరస్‌ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా పరీక్షలు నిర్వహించకుండానే (AP Degree Exams Cancelled) పాస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది! విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సెలర్లు, రెక్టార్లు, రిజిస్ట్రార్లతో మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యూజీ, పీజీ కోర్సుల పరీక్షలు, అకడమిక్‌ క్యాలెండర్‌పై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సంప్రదాయ కోర్సులు, ప్రొఫెషనల్‌ కోర్సులన్నింటి పరీక్షలు (UG / PG Semester Exams) రద్దు చేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చారు.
New Districts in AP: ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు! జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో కొత్త జిల్లాల అంశాన్ని ప్రస్తావించిన ఏపీ సీఎం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన
Hazarath Reddyఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు (New Districts in AP) ఏర్పడబోతున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ (Chief Minister YS Jagan Mohan Reddy) ఈరోజు క్లారిటీ ఇచ్చినట్లుగా వార్తలు అందుతున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) మాట్లాడుతూ... ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నుంచి ఈ మాట రాగానే అలర్ట్ అయిన అధికారులు తమ వైపు నుంచి కసరత్తును ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
AP Coronavirus: ఏపీలో ఒక్కరోజే 8 మంది మృతి, తాజాగా 407 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు, ఏపీలో 9834కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 407 కరోనా పాజిటివ్‌ కేసులు (AP coronavirus) నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 20,369 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 462 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గడిచిన 24 గంటల్లో 129 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా 8 మంది మరణించారు.
Nimmagadda Meeting with BJP Leaders: మీటింగ్ మతలబు అదేనా?, బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోటల్లో రహస్య భేటీ, సుప్రీంకోర్టులో విచారణలో నిమ్మగడ్డ తొలగింపు అంశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ (Nimmagadda Ramesh Kumar) వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో (Kamineni Srinivasa Rao) రమేష్‌ కుమార్‌ ఇటీవల ఓ హోటల్లో భేటీ కావడం (Nimmagadda Meeting with BJP Leaders) సంచలనం సృష్టిస్తోంది.హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌‌లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి ముగ్గురి భేటీ జరిగినట్టుగా సీసీటీవీ పుటేజీ (CCTV Footage) బయటకు వచ్చింది. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగినట్లుగా ఆ సీసీ టీవీ పుటేజీలో తెలుస్తోంది. దీనికి సంబంధిన వీడియో రికార్డులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Prepaid Meters Policy: ఏపీలో రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్, త్వరలో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు తీసుకువచ్చే ప్రయత్నాలు, ఏపీ విద్యుత్ శాఖ కొత్త వ్యూహం
Hazarath Reddyఏపీలో ప్రతి నెలా కరెంట్ బిల్లులు వసూలు చేయడం విద్యుత్‌ శాఖకు (AP Electricity Department) తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో ఈపీడీసీఎల్‌ (EPDCL) కొత్త వ్యూహాలను అన్వేషిస్తోంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే నెలరోజుల్లో ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్‌ మీటర్లు (Prepaid Meters Policy) అమర్చడానికి ఏపీ విద్యుత్ శాఖ రెడీ అవుతోంది. భుత్వ శాఖలు, ప్రైవేటు సెక్టార్‌కు సంబంధించి బకాయిలు కోట్లలో పేరుకుపోతున్న నేపథ్యంలో ఈ విధానం ద్వారా బకాయిలకు తావులేకుండా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
AP MLA Tests Positive for COVID-19: ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి కరోనా, శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ
Hazarath Reddyకరోనా వైరస్‌ సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, పోలీసుల నుంచి రాజకీయ నాయకుల దాకా ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మం‍త్రులు, పోలీస్ అధికారులు, డాక్టర్లు కోవిడ్ 19 భారీన పడ్డారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడగా..తాజాగా ఏపీలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేకు (YCP S.Kota MLA) కూడా కరోనా వైరస్ సోకింది. ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే (Srungavarapukota MLA) శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.