ఆంధ్ర ప్రదేశ్

Heat Wave Warning: వడగాడ్పుల ముప్పు, ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశం, ఈ మూడు రోజులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వడగాడ్పుల ముప్పు పొంచి ఉందని తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ ఎండలు భగ్గుమంటాయని (Heat Wave Warning) తెలిపింది. ఈ నెల 25వ తేదీ ఉదయం రోహిణి కార్తె ప్రవేశించనుంది.

Indian Railways: ప్రారంభమైన రైల్వే బుకింగ్స్, జూన్ 1న పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్ రైళ్లు, సాధారణంగానే టికెట్ ధరలు, జనరల్‌ కోచ్‌ల్లోనూ రిజర్వుడ్‌ సీట్లు

Hazarath Reddy

వచ్చే నెల 1 నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు గురువారం ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. టికెట్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ (IRCTC Website) లేదా యాప్‌ (APP) ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి. కౌంటర్లు బంద్‌ ఉంటాయి. నాన్‌ ఏసీతోపాటు ఏసీ కోచ్‌లనూ (AC And Non AC) కూడా నడుపనున్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఏపీ (TS And AP) నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు ఉన్నాయి.

AP&TS Water Dispute: 203 జీవోపై స్టే విధించిన ఎన్‌జీటీ, పోతిరెడ్డిపాడు,రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తాత్కాలిక బ్రేక్, తెలంగాణ ప్రాజెక్టులపై డీపీఆర్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన కృష్ణా బోర్డు

Hazarath Reddy

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(NGT) స్టే విధించింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని ఎన్జీటీ (National Green Tribunal) ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

APSRTC: రేపు ఉదయం 7గంటలకు తొలి బస్సు సర్వీస్, 1683 బస్సులు రోడ్డు మీదకి, బస్సులు తిరగనున్న నేపథ్యంలో వివరాలను వెల్లడించిన ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌

Hazarath Reddy

లాక్ డౌన్ (Lockdown) కారణంగా డిపోలకే పరిమితం అయిన ఆర్టీసీ బస్సులు (APSRTC) ఇప్పటికే తెలంగాణలో పునఃప్రారంభమయ్యాయి. రేపటి నుంచి ఏపీలో పరుగులు పెట్టనున్నాయి. డిపోల్లో ఉన్న బస్సులను శుభ్రం చేసే కార్యక్రమం కొనసాగుతోంది. గత 58 రోజులుగా డిపోలకే బస్సులు పరిమితం కావడంతో... వాటి ఇంజిన్ కండిషన్ ను చెక్ చేస్తున్నారు.

Advertisement

TikTok Addiction: విజయవాడలో విషాదం, టిక్‌టాక్ వద్దన్నందుకు భార్య ఆత్మహత్య, తల్లి లేని చోట ఉండలేనంటూ కొడుకు ఆత్మహత్య

Hazarath Reddy

విజయవాడలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా టిక్ టాక్ వ్యసనం (TikTok Addiction) ఇద్దరి ప్రాణాలను తీసింది. విజయవాడలోని (Vijayawada) జక్కంపూడి జేఎన్ యూఆర్ఎం కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య అదే పనిగా టిక్ టాక్ వీడియోలు (TikTok Videos) చేస్తుండడం పట్ల విసుగుచెందాడు. టిక్ టాక్ వీడియోలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ, భర్త మందలింపును తీవ్రంగా పరిగణించిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది.

Doctor Sudhakar Case: ట్విస్టులతో సాగుతున్న డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్, సుధాకర్ వాగ్మూలాన్ని రికార్డు చేయాలన్న హైకోర్టు, కేసును వెనక్కి తీసుకోవాలన్న ఐఎంఎ, ఆది నుంచి ఏం జరిగింది..?

Hazarath Reddy

ఆసుపత్రికి వెళ్లి సుధాకర్ వాగ్మూలాన్ని రికార్డు చేయాలని విశాఖ సెషన్స్ జడ్జిని హైకోర్టు (AP High Court) ఆదేశించింది. రేపు సాయంత్రంలోగా వాగ్మూలాన్ని హైకోర్టులో సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌తో పాటు వీడియో క్లిపింగ్స్‌ను కూడా పిటిషనర్ తరుపు న్యాయవాదికి ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. రేపు సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

AP Corona Update: నా బలం మీరే,మీపైనే పూర్తి నమ్మకం, రాబోయే రోజుల్లో కరోనా భారీన పడని వారు ఉండరేమో.., అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీ సీఎం సమీక్ష, ఏపీలో తాజాగా 68 కేసులు నమోదు

Hazarath Reddy

నేను ప్రతిసారీ చెప్తున్నాను నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే. మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించాం. పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను. అందుకే మీరే మా బలమని చెప్తున్నాను. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

AP Lockdown 4: యూకే నుంచి విజయవాడకు చేరుకున్న 143మంది ప్రవాసాంధ్రులు, విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు, వందే భారత్ మిషన్ 2లో భాగంగా ఏపీకి రానున్న 13 విమానాలు

Hazarath Reddy

కరోనావైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ (Vande Bharat Mission) కింద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో లండన్ నుండి ప్రవాసాంధ్రులు ముంబై చేరుకుని అక్కడ నుండి ఈ రోజు ఉదయం గన్నవరం విమానశ్రాయానికి (gannavaram airport) చేరుకున్నారు. యూకే ( united kingdom) నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు మొత్తం 156మంది ప్రవాసాంధ్రులు చేరుకున్నారు.

Advertisement

Schools Reopen in AP: ఏపీలో ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ 19 లాక్‌డౌన్‌ (Covid-19 Lockdown) కారణంగా మూత పడిన స్కూళ్లు ఆగస్టు 3 నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ (AP CM YS jagan) ప్రకటించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు (nadu nedu scheme) కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. విద్యావ్యవస్థలో నూతన మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందని, కలెకర్ట్‌లు అందరూ సమష్టిగా పని చేయాలని సూచించారు.

Ranganayakamma: జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఫేక్ పోస్టులు, 60 ఏళ్ల బామ్మపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు, నేరం రుజువైతే మూడేళ్ళు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం

Hazarath Reddy

సోషల్‌ మీడియా పుణ్యమా అని వైరల్ ఏదో..? రియల్ ఏదో..? తెలియని పరిస్థితి నెలకొంటుంది.. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా పనిగట్టుకునొ కొన్ని సృష్టించి వైరల్‌గా చేస్తే.. కొందరు తెలిసి తెలియక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఒక్కోసారి వారిని చిక్కుల్లో నెడుతున్నాయి. కాగా ఏపీ ప్రభుత్వానికి (AP Govt) వ్యతిరేకంగా సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ లు షేర్ చేసిన వృద్ధురాలిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

TS-AP Water Dispute: మలుపులు తిరుగుతున్న నీటి వివాదం, రాయలసీమకు గోదావరి మిగులు జలాలు తీసుకుపొమ్మన్న కేసీఆర్, మా నీళ్లను మేము వాడుకుంటామని స్పష్టం చేసిన ఏపీ సర్కారు

Hazarath Reddy

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచడం కోసం ఏపీ సర్కారు (AP Govt) జీవో జారీ చేయడం.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి (TS-AP Water Dispute) దారి తీసిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేసీఆర్ సర్కారు ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రం పాలయ్యే గోదావరి నీళ్లు సీమకు తరలించడంలో తప్పేం లేదని, రాయలసీమకు (Rayalaseema) నీళ్లు ఎందుకు పోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. తెలిసీ తెలియక మాట్లాడేవారి గురించి తాను పట్టించుకోనన్నారు.

AP CM YS Jagan Review: ఏపీలో బస్సు సర్వీసులపై తాజా మార్గదర్శకాలు, వలస కార్మికుల తరలింపు తరువాతే బస్సులు ప్రారంభం, లాక్‌డౌన్ సడలింపులపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ 4 (Lockdown 4) కొనసాగుతూ కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19 (COVID 19) నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ సడలింపులపై సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Advertisement

COVID-19 in AP: కరోనాని జయించిన 9 నెలల చిన్నారి, ఏపీలో 2339కి చేరిన కోవిడ్-19 కేసులు, ఐసీఎంఆర్‌ సవరించిన మార్గదర్శకాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 57 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో (COVID 19 in AP) కరోనా బారిన పడిన వారి సంఖ్య 2339కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,739 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ( AP Coronavirus Report) 57 మందికి పాజిటివ్‌ నిర్దారణ అయిందని తెలిపింది. ఈ రోజు ఒక్కరోజే 69 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారని, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కోరి చొప్పున మృత్యువాత పడ్డారని పేర్కొంది. కాగా, ఇ‍ప్పటి వరకు 1596 మంది వైరస్‌ బారినుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 691మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మొత్తం 52మంది మరణించారు.

Nellore Child Labour Issue: ఆరేళ్ల చిన్నారితో గది శుభ్రం, తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీకి ఆదేశాలు

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారి గదిని శుభ్రం చేస్తుండగా, కొందరు పోలీసులు అక్కడే నిలుచుని చూస్తూ ఉండడం మీడియాలో కనిపించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఆ చిన్నారి గదిని శుభ్రం చేస్తుండగా (Nellore Child Labour Issue) ఖండించకుండా చూస్తూ ఉండటంతో ఇది ఇంకా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ (AP DGP Gautam Sawang) ఘటనపై స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు.

#AmphanCyclone: పెను తుఫానుగా మారిన అంఫాన్, ఒడిశాకు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు, రేపు తీరం దాటే అవకాశం, ఒడిశా, బెంగాల్‌కు పొంచి ఉన్న ముప్పు, ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

Hazarath Reddy

పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అంఫాన్‌' తుఫాన్‌ (Cylcone Amphan) మహాతుఫానుగా (super cyclone) మారినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఈ తుఫాను తాకిడికి గంటకు 200 కిమీవేగంతో పెనుగాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. బుధవారం మధ్యాహ్నానికి ఇది అతి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడి, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఎన్డీఆర్‌ఎఫ్‌ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ ( NDRF chief SN Pradhan) తెలిపారు.

APSRTC: ఏపీలో రవాణాకు బస్సులు సిద్ధం, ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపిన రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఏపీలో 2,282కి చేరిన కోవిడ్ 19 కేసులు

Hazarath Reddy

ఏపీలో ప్రజా రవాణాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం (AP CM YS Jagan) తీసుకుంటారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని (Transport Minister Perni Nani) తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో బస్సులు తిరిగేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్‌డౌన్‌ (Lockdown) నేపథ్యంలో కేంద్ర నిబంధనలు, రాష్ట్రంలో పరిస్థితుల అనుగుణంగా బస్సులు నడుపుతామని తెలిపారు.

Advertisement

Andhra Pradesh: శ్రీవారి దర్శనం ఇప్పట్లో లేనట్లే, ఏపీలో మే 31 వరకు దేవాలయాల్లోకి భక్తులకు నో ఎంట్రీ, ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయాల్లోకి ఈ నెల 31 వరకు భక్తులకు ప్రవేశముండబోదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల నేపధ్యంలో లాక్ డౌన్ (Lockdown) కాలపరిమితిని మే నెల 31 వ తేదీ వరకు పొడిగించినందున రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు (AP minister Vellampalli Srinivas Rao) వెల్లడించారు. అంటే గతంలో ఇచ్చిన ఆదేశాలే అప్పటివరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

AP COVID-19 Report: ఏపీని వణికిస్తున్న కోయంబేడు మార్కెట్, కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ అక్కడివే, ఏపీలో 2,282కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య (AP COvid-19 Report) 2,282కి చేరింది. ఈ వైరస్‌ వల్ల రాష్ట్రంలో (Andhra Pradesh) ఇప్పటివరకు 50 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ప్రస్తుతం 705 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1,527 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Cyclone Amphan: ఉగ్రరూపం దాల్చిన అంఫాన్ తుఫాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు భారీ వర్ష ముప్పు, ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నఅంఫాన్‌ తుపాన్‌ (Cyclone Amphan) ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మ. 2.30 గంటలకు అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 930 కిమీ దూరంలోనూ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 1,080 కిమీ దూరంలో, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ నైరుతి దిశగా 1,200 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Telangana: తెలంగాణలో 1551కి పెరిగిన కోవిడ్-19 కేసులు, ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం ఆకస్మిక భేటీ, లాక్‌డౌన్ 4.0 తాజా మార్గదర్శకాలపై చర్చ

Team Latestly

సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఈరోజు రాత్రి వరకు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రం కంటే ఒకడుగు ముందుంటున్న కేసీఆర్, ఇంతకుముందే తెలంగాణలో లాక్డౌన్ ను మే 29 వరకు విధించారు. మరి ఇప్పుడు కేంద్రం మే31 వరకు విధించిన నేపథ్యంలో అక్కడితో ముగిస్తారా....

Advertisement
Advertisement