ఆంధ్ర ప్రదేశ్

Red Zones in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో రెడ్ జోన్లో 11 జిల్లాలు, లాక్‌డౌన్‌ ఆంక్షలపై సడలింపుల నేపథ్యంలో జాబితాను విడుదల చేసిన కేంద్రం, దేశ వ్యాప్తంగా తగ్గిన హాట్‌స్పాట్‌ జిల్లాలు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలపై సడలింపులు (Lockdown Relaxation) ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Center) మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. రాష్టాల వారిగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని ఆరు జిల్లాలు, అలాగే ఏపీలో 5 జిల్లాలను రెడ్‌ జోన్లుగా (Telugu States Red Zones) గుర్తించింది.

Weather Alert: దక్షిణ అండమాన్‌లో అల్పపీడనం, రాగల 48 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం, వెల్లడించిన భారత వాతావరణ విభాగం

Hazarath Reddy

ఉత్తర సుమత్రా, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.6 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో దక్షిణ అండమాన్‌ సముద్రంలో (south Andaman Sea) అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల కోస్తాతీరంలో ఉరుములు, మెరుపులతో మోస్తరుగా వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడడానికి అవకాశం ఉంది.

AP Coronavirus Bulletin: 5 రోజుల్లో 142 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి, ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు, 1403కి చేరుకున్న మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 71 కరోనా కేసులు (AP Coronavirus Bulletin) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1403కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా కేఎస్‌ జవహర్‌రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 6497 శాంపిల్స్‌ను పరీక్షించగా 71 మంది కరోనా నిర్ధారణ (AP Coronavirus) అయిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 321 మంది డిశ్చార్జ్‌ కాగా, 31 మంది మృతిచెందారని తెలిపారు.

Polavaram Project Update: 2020లోనే ఆరు ప్రాజెక్టులు ప్రారంభం, పోలవరం సమీక్ష సంధర్భంగా ఏపీ సీఎంకు తెలిపిన అధికారులు, పనులు వేగవంతం చేయాలన్న వైయస్ జగన్

Hazarath Reddy

పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా గట్టిగానే అడుగులు వేస్తున్నారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పనులపై (Polavaram Project Works) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Lockdown Update: మే 4 నుంచి లాక్‌డౌన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అమలు, మరిన్ని సడలింపులు లభించే చాన్స్, సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వలస కూలీలు, విద్యార్థులకు ఇప్పటికే అనుమతి

Team Latestly

మరోవైపు దేశంలో కోవిడ్-19 విజృంభన కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 32 వేలకు చేరువైంది. ఈ దశలో మే 4 నుంచి కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్లు సమాచారం.....

AP Lockdown Relaxation Guidelines: ఏపీలో లాక్‌డౌన్ సడలింపు‌, సరికొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, పలు రంగాలకు మినహాయింపులు

Hazarath Reddy

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ (India Lockdown) విధించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మే 3 తర్వాత లాక్ డౌన్ పొడిగించాలా వద్దా అనే విషయంపై కేంద్రం నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్ సడలింపునకు (AP Lockdown Relaxation) సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం‌ (AP Govt) అదనపు గైడ్‌లైన్స్‌‌ను (fresh guidelines to lockdown relaxation) విడుదల చేసింది.

AP Coronavirus: బ్ర‌హ్మంగారి ఆరాధ‌న ఉత్స‌వాలు ర‌ద్దు, ఏపీలో తాజాగా 73 కరోనా కేసులు, మొత్తంగా 1014 యాక్టివ్‌ కేసులు, రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 73 కరోనా పాజిటివ్‌ కేసులు (AP positive cases) నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం ప్రకటించింది. బుధవారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 1332 కు చేరిందని వెల్లడించింది. తాజాగా 29 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 287కు చేరుకుంది.

New Academic Year: ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం, వర్సిటీలు వారానికి ఆరు రోజులు పని చేయాలి, యూజీసీకి పలు సిఫార్సులు చేసిన నిపుణుల కమిటీ

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus) నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ (Lockdown) కారణంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ స్తంభించిపోయాయి. పరీక్షలు, ఇతరత్రా కార్యక్రమాలు అన్నీ ఆగిపోయాయి. ఆగిపోయిన వాటిని నిర్వహించడంతో పాటు వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహణను ముగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరీక్షలపై నిపుణుల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌ (UGC)కు పలు సిపార్సులు చేసింది.

Advertisement

3rd Phase Free Ration Distribution: 3వ విడత ఉచిత రేషన్ ప్రారంభం, బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలకు లబ్ది, కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో (Lockdown) పేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) మరోసారి ముందుకొచ్చింది. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్‌ సరుకులను పంపిణీ చేసిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మూడో విడత కింద ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీని (3rd Phase Free Ration Distribution) ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.

Andhra pradesh Coronavirus: 258 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి, ఏపీలో 1,259కి చేరుకున్న కోవిడ్ 19 కేసులు, తాజాగా 82 కరోనా కేసుల నమోదు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh COVID-19) కొత్తగా మరో 82 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో ఏపీలో (Andhra pradesh) కరోనా కేసుల సంఖ్య 1,259కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 5,783 మందికి పరీక్షలు నిర్వహించగా 82 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 258 డిశ్చార్జి కాగా, 31 మంది మృతిచెందారు.

Jagananna Vidya Deevena: విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు, జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4వేల కోట్లకుపైగా విడుదల

Hazarath Reddy

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పలు పథకాలు ప్రవేశపెడుతున్న ఏపీ సీఎం జగన్ (ap cm ys jagan mohan reddy) మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి (Jagananna Amma Vodi), జగనన్న వసతి దీవెన (Jagananna Vasathi Deevena) పథకాలు ప్రవేశపెట్టిన జగన్ సర్కారు (AP Govt) నేడు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. దీన్ని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను (Fee reimbursement) ఒకేసారి అందజేయనున్నారు.

AP CM YS Jagan: లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు, కలిసికట్టుగా కరోనాని తరిమేద్దాం, జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమైపోతుంది, ప్రెస్ మీట్లో ఏపీ సీఎం వైయస్ జగన్ వెల్లడి

Hazarath Reddy

కరోనావైరస్ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ఏపీ సీఎం (AP CM YS Jagan Press Conference) రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లాక్‌డౌన్‌కు (AP Lockdown) సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలోనే అత్యధిక కరోనావైరస్‌ (Coronavirus) టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని, ప్రతి 10 లక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Andhra Pradesh COVID-19: ఏపీలో కొత్తగా 80 కేసులు నమోదు, 1177 కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 31 మంది మృతి, కారణం లేకుండా బయటకు వస్తే నేరుగా క్వారంటైన్‌కే..

Hazarath Reddy

ఏపీలో కరోనావైరస్ (AP Coronavirus) మహమ్మారి రోజురోజుకూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 80 కరోనా పాజిటివ్‌ కేసులు (AP COVID-19 Report) నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177 కు చేరిందని తెలిపింది. వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, 235 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

AP Government Employees Salaries: ఏప్రిల్‌ నెల వేతనాలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, కొన్ని శాఖల వారికి పుల్ జీతం, పెన్సనర్లకు 100 శాతం పేమెంట్, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

Hazarath Reddy

ఏపీలో లాక్‌డౌన్‌ (AP Lockdown) కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ నెల వేతనాలపై (AP Government Employees Salaries) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య కార్మికులకు 100 శాతం జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఉద్యోగులకు గత నెల మాదిరిగానే సగం జీతం చెల్లించనుంది.

AP Rain Update: 30న బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం, మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించిన అధికారులు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏప్రిల్ 30 నుంచి మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు (Kannababu) వెల్లడించారు.. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం (Andhra pardesh rains) ఉందని పేర్కొన్నారు.

AP Coronavirus Bulletin: వైసీపీ ఎంపీ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్, రాజ్‌భవన్‌ని వదలని కోవిడ్ 19, పేకాట ఆడిన వ్యక్తి నుంచి 25 మందికి కరోనావైరస్, శ్రీకాకుళం జిల్లాలో కరోనావైరస్ ల్యాబ్

Hazarath Reddy

తన కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కర్నూలు ఎంపీ (kurnool MP Dr Sanjeev Kumar) డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ తెలిపారు. కర్నూలు నర్సింగరావుపేటలో ఉన్న తన సోదరుల కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, వీరంతా రాష్ట్ర కోవిడ్‌ హాస్పిటల్‌ (కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి)లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా ఎంపీ తండ్రి, సోదరుడితో పాటు మరో నలుగురికి కరోనా సోకగా వీరంతా, క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

AP COVID-19 Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 81 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1,097 కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఆళ్ల నాని భరోసా

Team Latestly

శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4కు పెరిగాయని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. కరోనా కట్టడి కోసం శ్రీకాకుళం జిల్లాలోనే కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేశామని, ర్యాపిడ్ యాక్షన్‌, ట్రూనాట్‌ కిట్స్‌ ద్వారా పరీక్షలు చేస్తున్నామని ఆయన తెలిపారు.....

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి దాటిన కోవిడ్-19 కేసులు, తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా నుంచి నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసులు

Team Latestly

ఇంతకాలంగా ఒక్క కేసు కూడా నమోదు కాని శ్రీకాకుళం జిల్లాకు కూడా ప్రాణాంతక కరోనావైరస్ వ్యాప్తి చెందింది. తాజాగా శ్రీకాకుళం నుంచి 3 పాజిటివ్ కేసులు నమోదవడంతో జిల్లా వాసుల్లో కలకలం మొదలైంది......

Lockdown Relaxations: వైన్స్ షాపులు తెరుచుకోనున్నాయా? దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం. ఏవేవి తెరుచుకోనున్నాయి, ఏవి మూసి ఉండనున్నాయి, వేటికి అనుమతి లభించిందో తెలుసుకోండి

Team Latestly

రాష్ట్రాలలో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయబడిన అన్ని అన్ని రకాల అనవసర వస్తు-సేవల స్టోర్లు, నివాస సముదాయాల్లో, మరియు స్థానికంగా విక్రయించే దుకాణాలు, స్వతంత్రంగా ఉండే షాప్స్ లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. మునిసిపల్ కార్పొరేషన్లు మరియు మునిసిపాలిటీల పరిధికి వెలుపల ఉండే మార్కెట్ కాంప్లెక్సులు తెరవడానికి అనుమతించబడతాయి......

COVID-19 in AP: కొత్తగా 62 కేసులు, ఏపీలో 955కు చేరిన కోవిడ్ 19 బాధితుల సంఖ్య, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా కలవరం

Hazarath Reddy

ఏపీలో కొత్తగా మరో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో (Deadly COVID-19 in AP) ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 955కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా (Coronavirus) నుంచి కోలుకున్న 145 మంది డిశ్చార్జ్‌ కాగా, 29 మరణించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో 781 మంది చికిత్స పొందుతున్నట్టు చెప్పారు.

Advertisement
Advertisement