ఆంధ్ర ప్రదేశ్
YSR Zero Interest Loan Scheme: అమల్లోకి వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పథకం, ఏపీ సీఎం వైయస్ జగన్ మరో సంచలన నిర్ణయం, ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ
Hazarath Reddyడ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ (YS Jagan Govt) తీపి కబురు అందించింది. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( AP CM YS Jagan Mohan Reddy) అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని (YSR Zero Interest loan scheme) సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
AP DGP Gowtham Sawang: పోలీస్ శాఖ సాంకేతిక బృందానికి డీజీపీ అభినందనలు, నిఘా కోసం అత్యంత అధునాతన టెక్నాలజీ వాడుతున్నామన్న దామోదర్ గౌతం సవాంగ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ సాంకేతిక బృందానికి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( DGP gowtham sawang) అభినందనలు తెలిపారు. కరోనా వైరస్‌ (Coronavirus) నుంచి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) సారధ్యంలో పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) వచ్చిన వారి కదలికలను దేశంలోనే తొలిసారిగా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో (Geo-fencing app) అనుసంధానం చేశామన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,478 మందిపై ఇరవై ఎనిమిది రోజుల పాటు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు.
Andhra Pradesh Coronavirus: దడపుట్టిస్తున్న కర్నూలు, గుంటూరు, రెండు జిల్లాల్లోనే 48.7 శాతం కేసులు, తాజాగా 80 కొత్త కేసులు నమోదు, ఏపీలొ 893కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి (Covid-19 pandemic in AP) విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ( andhra pradesh) గత 24 గంటల్లో 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య (AP COVID-19) 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో 48.7 శాతం కేసులు నమోదయ్యాయి.
Supreme Court Judgment: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు, తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీంకోర్టు, అప్పటి నియామకాల్లో జోక్యం చేసుకోబోమంటూ వెల్లడి
Hazarath Reddyషెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో (scheduled areas) రిజర్వేషన్లు 50 శాతం మించరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని (Telugu states) షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు నూరు శాతం గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఇప్పటివరకు జరిగిన నియామకాలకు రక్షణ ఇస్తున్నామని, ఏపీ, తెలంగాణలో ఇదేరీతిలో పునరావృతమైతే ఇప్పటివరకు జరిగిన వాటికి కూడా రక్షణ ఉండదని హెచ్చరించింది.
AP English Medium: ఇంగ్లీష్ మీడియం కావాలా..వద్దా?, తల్లిదండ్రుల్లారా మీరే తేల్చుకోండి, పేరంట్స్ అభిప్రాయం తెలుసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు
Hazarath Reddyగత కొన్ని రోజుల క్రితం ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం (English Medium in Govt Schools) అమలు చేస్తూ జగన్ సర్కారు ఇచ్చిన జీవోలను హైకోర్టు (AP High Court) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు సంబంధించి హైకోర్టు ఆదేశాల అమలుపై ఏపీ సర్కార్ (AP Government)దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
AP Corona Pandemic: పలమనేరులో ఉప్పు వ్యాపారికి కరోనా, ఏపీలొ 813కు చేరిన కరోనా కేసులు, ఏపీ వాలంటీర్లకు రూ.50 లక్షల బీమా సదుపాయం
Hazarath Reddyవాలంటీర్ల పనితీరుకు గానూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి రూ.50 లక్షల భీమా సదుపాయం కల్పించేందుకు సిద్ధమైంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీ రాజ్ శాఖకు మంగళవారం సర్క్యులర్‌ జారీ చేసింది. గ్రామ, వార్డు వలంటీర్లకూ 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ' ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది.
AP Coronavirus: 24 గంటల్లో 35 కొత్త కేసులు, ఏపీలో 757కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 22కు చేరిన మృతుల సంఖ్య, ఏపీలో రోజురోజుకూ పెరుగుతున్న పరీక్షా సామర్థ్యం
Hazarath Reddyఏపీలో కరోనా వైరస్‌ (AP Coronavirus) రోజు రోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 35 పాజిటివ్‌ కేసులు (COVID19 positive cases) నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కు చేరింది. కరోనా (Coronavirus) మహమ్మారితో ఇవాళ మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో కోలుకుని 96 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాపై తాజా కేసులకు సంబంధించిన బులిటెన్‌ను ప్రభుత్వం (AP Govenment) విడుదల చేసింది.
AP Lockdown Violation: ఏపీలో లాక్‌డౌన్ ఉల్లంఘన, ఎమ్మెల్యే రోజాకు పూలతో స్వాగతం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనావైరస్ రోజు రొజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ (Nationwide Lockdown) విధించిన విషయం విదితమే. అలాగే దాన్ని మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కూడా లాక్ డౌన్ (Coronavirus lockdown) పటిష్టంగా అమలు చేస్తోంది. అయితే ఎంత పటిష్టంగా అమలు చేసినా అక్కడక్కడా లాక్ డౌన్ ఉల్లంఘనలు (AP Lockdown Violation) జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా (YSRCP MLA Roja) లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారు. లాక్ డౌన్ పై ఆమె వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
AP Police Tweet: సత్తెనపల్లి యువకుడి మరణంపై ఏపీ పోలీస్ ట్వీట్, సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ డి.రమేష్ సస్పెండ్, కేసు నమోదు చేసిన విచారణకు ఆదేశించిన డీజీపీ
Hazarath Reddyగుంటూరు జిల్లా సత్తెనపల్లిలో (sattenapalli) పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ యువకుడు ఘటన సోమవారం ఆందోళనకు దారి తీసింది. దీనిపై మంగళవారం ట్విటర్‌ ద్వారా ఏపీ పోలీసులు వివరణ ఇచ్చారు. గుంటూరు రూరల్ జిల్లాలో జరిగిన దురదృష్టకర సంఘటనలో షేక్ మహ్మద్ గౌస్ మరణించారు. ఈ సంఘటనలో పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. చెక్ పోస్ట్ వద్ద మృతుడిని ఆపిన సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ డి.రమేష్ సస్పెండ్ చేశామన్నారు.
New Judges for AP & TS High Court: ఏపీకి, తెలంగాణకు కొత్త జడ్జీలు, నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం, వీరిలో ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఒకరు
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం నలుగురు పేర్లను సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఏపీ రాష్ట్ర హైకోర్టుకు (Andhra Pradesh High Court) కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు (New Judges in AP & TS) రానున్నారు. అలాగే తెలంగాణ హైకోర్టుకు (Telangana High Court) ఒక జడ్జీ రానున్నారు.
States Share: రాష్ట్రాల పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,892 కోట్లు మరియు తెలంగాణకు రూ. 982 కోట్లు మంజూరు
Team Latestlyదేశంలో COVID-19 మహమ్మారి కారణంగా ఉత్పన్నమవుతున్న విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఎలాంటి కోతలు లేకుండా అందజేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది....
AP COVID-19 Bulletin: కర్నూలు, గుంటూరులో పెరుగుతున్న కేసులు, ఏపీలో తాజాగా 75 కొత్త కేసులు, 20కి చేరిన మరణాల సంఖ్య, రాష్ట్రంలో 722కి చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కరోనా(Covid-19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా (Coronavirus Cases) బాధితుల సంఖ్య 722కు చేరుకుంది. వీరిలో 92 మంది డిశ్చార్జ్‌ కాగా, 20 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కోవిడ్‌-19 కేసులకు సంబంధించిన బులెటిన్‌ను (AP COVID-19 Bulletin) విడుదల చేసింది. కర్నూలు జిల్లా 174 కేసులతో టాప్‌లో ఉండగా.. 149 కేసులతో గుంటూరు తర్వాతి స్థానంలో ఉంది.
Chandrababu Naidu Birthday: టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు, కరోనా నేపథ్యంలో సాదాసీదాగా మాజీ ముఖ్యమంత్రి బర్త్‌డే వేడుకలు, విషెస్ చెప్పిన ఏపీ సీఎం జగన్, పలువురు రాజకీయ ప్రముఖులు
Hazarath Reddyటీడీపీ (TDP) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టిన రోజు వేడుకల్ని హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. అత్యంత సాదాసీదాగా ఈ వేడుకలు జరిగాయి. పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబుకు సోషల్ మీడియాలో (HBD CBN) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుకు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. చంద్రబాబు ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరారు. కాగా ట్విట్టర్ లో #HBDPeoplesLeaderCBN అంటూ హ్యాష్ ట్యాగ్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.
PM Phone Call to AP CM: ఏపీ సీఎంకు ప్రధాని ఫోన్, కరోనా నివారణ చర్యలపై చర్చ, ఏపీలో నేటి నుంచి లాక్‌డౌన్ సడలింపు, మార్గదర్శకాలు ఏంటో ఓసారి తెలుసుకోండి
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు (AP CM YS Jagan) ఫోన్‌ చేశారు. కోవిడ్‌ –19 నివారణకు (covid 19 Preventive Measures) తీసుకుంటున్న చర్యలపై ఇద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలను సీఎం ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో వైరస్‌ నివారణకు, వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్న అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
Andhra Pradesh Coronavirus: కర్నూలులో డేంజర్ బెల్స్, ఒక్కరోజే 26 కరోనా కేసులు, ఏపీలో 647కు చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, రెండు వారాల తరువాత విశాఖజిల్లాలో మరో కరోనా కేసు
Hazarath Reddyఏపీలో కరోనా (AP Coronavirus) విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు (Corona Positive cases)సంఖ్య 647కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు (Kurnool) జిల్లాలో 26, కృష్ణాలో 6, తూర్పు గోదావరిలో 5, అనంతపురంలో 3, గుంటూరులో 3, విశాఖపట్నంలో ఒక కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్‌ అధికారి ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు.
Andhra Pradesh: ఏపీలో 572కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, కర్నూలులో మరణించిన డాక్టర్ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్
Team Latestlyకర్నూలు జిల్లాలో ఒక్కరోజులోనే కొత్తగా 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో 6 కేసులు కూడా ఇటీవల కరోనాతో మరణించిన ఓ ప్రైవేట్ డాక్టర్ కుటుంబ సభ్యులవే కావడం గమనార్హం. వీరితో పాటు కర్నూలులోని సర్వజన హాస్పిటల్ లో పనిచేసే ఓ మహిళా డాక్టర్ కు కూడా కరోనావైరస్ సోకింది.....
AP CM Got Corona Test: ఏపీ సీఎం వైయస్ జగన్‌కు కరోనా టెస్ట్, నెగెటివ్‌గా నిర్ధారణ, దక్షిణ కొరియా నుండి రాష్ట్రానికి లక్ష పరీక్షా కిట్లు, 10 నిమిషాల్లోనే కరోనా ఫలితం
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) పరీక్షలు (AP CM Got Corona Test) చేయించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్‌ (rapid test kit) ద్వారా డాక్టర్లు పరీక్ష నిర్వహించారు. పరీక్షలో కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. దక్షిణ కొరియా (South Korea) నుంచి రాష్ట్రానికి లక్ష కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను ప్రత్యేక చార్టర్‌ విమానంలో ఇవాళ తీసుకొచ్చారు. ర్యాపిడ్‌ టెస్టు కిట్ల ద్వారా 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితం తేలనుంది.
Guntur COVID-19: క్వారంటైన్‌కు గుంటూరు డాక్టర్లు, మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనావైరస్ పాజిటివ్, ఏపీలో 534కు చేరిన కేసుల సంఖ్య
Hazarath Reddyగుంటూరులో 122 కేసులు నమోదయ్యాయి. తాజాగా గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు (Guntur Doctors in Quarantine) తరలించారు.ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురి రిపోర్ట్‌ వచ్చింది. అందులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
AP CM Jagan Review on COVID-19: ఏపీ సర్కారు కీలక నిర్ణయం, క్వారంటైన్ పూర్తి చేసుకున్న బాధితులకు రూ.2 వేలు, కడప నుంచి 13మంది డిశ్చార్జ్
Hazarath Reddyజగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందులో భాగంగా క్వారంటైన్ (Quarantine) పూర్తి చేసుకున్నవారికి రూ.2వేలు ఆర్థికసాయం అందించనుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పౌష్టికాహారం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఆర్థికసాయం ఇవ్వనుంది. అలాగే రానుపోను చార్జీల కోసం మరో రూ.600 ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
COVID-19 Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా, తెలంగాణలో 700కు చేరిన కరోనా కేసులు, ఏపీలో 534కు చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా (COVID-19 in Telugu States) విసురుతోంది. రెండు రాష్ట్రాల్లో రోజు రోజుకు అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కేసులు సంఖ్య పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఒక్కరోజులోనే అనూహ్యంగా కొత్త కేసులు పెరిగిపోయాయి.