ఆంధ్ర ప్రదేశ్

COVID-19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 15 కొత్త కేసులు నమోదు, రాష్ట్రంలో 329కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య, ఇకపై గంటలోపే వైరస్ నిర్ధారణ ఫలితాలు తెలిసేలా అందుబాటులోకి టెస్టింగ్ కిట్లు

Vikas Manda

విశాఖపట్నంలోని మెడ్ టెక్ జోన్ (Med Tech Zone) కరోనావైరస్ నిర్ధారణ కిట్లను (Testing Kits) అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. సుమారు 500 టెస్టింగ్ కిట్ లను సీఎం జగన్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.....

IRCTC Suspends Bookings: ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం, ఏప్రిల్ 30 వరకు రైల్వే టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్ రద్దు, రైల్వే నిర్ణయంతో లాక్‌డౌన్ పొడిగింపుపై పరోక్ష సంకేతాలు వచ్చినట్లేనా..?

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) దాని కట్టడికి చర్యలను తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. మార్చి 24 నుంచి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ (India Lockdown) విధించిన సంగతి తెలిసిందే. అది ఈ నెల 15తో ముగిసిపోనుంది. ఆ తర్వాత రైళ్లు, విమానాలు తిరుగుతాయని భావిస్తున్నవారికి ఇండియన్ రైల్వే (Indian Railways) ఝలక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

AP CM YS Jagan Review: ఏపీలో కరోనా కేసులు తగ్గే అవకాశం, కరోనా నివారణ చర్యలపై సమీక్షలో సీఎంకి తెలిపిన అధికారులు, ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టి పెట్టాలని తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

రాష్ట్రంలో కరోనావైరస్ (coronavirus on AP) ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో కరోనా నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి (Special Chief Secretary KS Jawahar Reddy), ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు.

COVID-19 Under YSR Aarogyasri: ఉచితంగా మెరుగైన వైద్యం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా, మొత్తం 15 రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి.., ఏపీలో 304కి చేరిన కరోనా కేసులు

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా మహమ్మారి ( Coronavirus in Andhra Pradesh) రోజురోజుకు విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS jagan) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి (YSR Aarogyasri) కరోనా వైద్య సేవ‌ల‌ను తీసుకొస్తూ ఏపీ స‌ర్కార్ (AP Govt) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

COVID-19 in India: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 354 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు, భారతదేశంలో 4,421 దాటిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, ఇప్పటివరకు 114 మరణాలు నమోదైనట్లు వెల్లడి

Vikas Manda

భారతదేశంలోనే మొట్టమొదటి కరోనావైరస్ కేసులను నమోదు చేసి, గత వారం వరకు కూడా మహారాష్ట్రతో సరి సమానంగా నిలిచిన కేరళ రాష్ట్రం ఇప్పుడు పరిస్థితులను కొంతవరకు మెరుగుపరుచుకుంది. ఇక్కడ కొత్తగా వచ్చే COVID-19 కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇప్పటివరకు కేరళలో 387 కేసులు నమోదయ్యాయి. అటు తరువాత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ మరియు రాజస్థాన్.....

Corona Cases in AP: మళ్లీ 14 కొత్త కేసులు, ఏపీలో 266కి చేరుకున్న కరోనావైరస్ కేసులు, ఇద్దరు మృతి, ఐదుగురు రికవరీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) తాజాగా మరో 14 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు (Corona Cases in AP) నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 266కు చేరింది. కొత్తగా నమోదైన 14 కేసుల్లో విశాఖలో 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఐదుగురు కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి (Coronavirus Deaths) చెందారు.

COVID-19 in AP: కర్నూలులో కరోనా కల్లోలం, ఒక్కరోజే 26 కేసులు, ఏపీలో 252కు చేరిన కరోనా కేసులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాన మంత్రి మోదీ ఫోన్

Hazarath Reddy

కరోనా మహమ్మారి విలయతాండవానికి ఇరు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి.మొదట్లో ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు (COVID-19 in AP) అంతలా లేకున్నప్పటికీ నిజాముద్దీన్ ఘటన వల్ల ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు (AP Corona cases) ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో కొత్తగా మరో 26 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 252 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

AP Medi-Tech Zone: కరోనా కట్టడిపై అలుపెరగని పోరు, ఏపీలో కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ తయారీ, విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్‌లో తయారీ పనులు, త్వరితగతిన పనులు ప్రారంభించాలని కోరిన కేంద్రం

Hazarath Reddy

ఏపీలో పంజా విప్పుతున్న కోవిడ్ 19 (COVID-19) మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలకమైన వెంటిలేటర్లు మరియు కోవిడ్ -19 టెస్టింగ్ కిట్‌లను (COVID-19 Testing Kits) ఉత్పత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ మెడి-టెక్ జోన్ (AMTZ) ను ఉపయోగించుకోనుంది. కేంద్రం ఇప్పటికే 3,500 వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూనిట్ల సమీకరణ ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతుందని ఆంధ్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు మరియు వాణిజ్య) రజత్ భార్గవ తెలిపారు.

Advertisement

COVID-19 in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా, ఏపీలో 34, తెలంగాణలో 43 కొత్త కేసులు, అలర్ట్ అయిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా (COVID-19 in Telugu States) విసురుతోంది. రెండు రాష్ట్రాల్లో రోజు రోజుకు అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కేసులు సంఖ్య పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఒక్కరోజులోనే అనూహ్యంగా కొత్త కేసులు పెరిగిపోయాయి

COVID-19 in AP: ఏపీలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, 190కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు, బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి

Hazarath Reddy

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు (COVID-19 in AP) రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 16 కరోనా పాజిటివ్‌ కేసులు (positive cases) నమోదు కాగా తాజాగా మరో 10 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 190కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.

AP CM Jagan Video Message: కరోనా కాటుకు కుల, మత భేదాలు లేవు, మర్కజ్‌ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదు, ప్రధాని పిలుపును స్వీకరించాలన్న ఏపీ సీఎం

Hazarath Reddy

ఏపీలో రోజు రోజుకు కోవిడ్ 19 కేసులు (COVID-19 Cases In India) పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan) మీడియా ముందుకు వచ్చారు. విపత్కర పరిస్థితిలో సీఎం జగన్ ఏపీ ప్రజలకు వీడియో సందేశాన్ని (CM Jagan Video Message) ఇచ్చారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మర్కజ్‌ ఘటనకు (Delhi Nizamuddin Markaz) మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు (Coronavirus) కుల, మత బేదాలు లేవని సీఎం జగన్‌ చెప్పారు.

COVID-19 Deaths in AP: ఏపీలో రెండో కరోనా మరణం, చికిత్స పొందుతూ మృతి చెందిన హిందుపూర్ వాసీ, రాష్ట్రంలో 180కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో కోవిడ్ 19 (COVID-19) మహమ్మారి తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. తాజాగా కరోనా (coronavirus) మహమ్మారికి ఆంధ్రప్రదేశ్‌లో మరొకరు బలి (Second COVID-19 Death in AP) అయ్యారు. అనంతపురం జిల్లా హిందుపురానికి (Hindupur) చెందిన ముస్తాక్‌ ఖాన్‌ (56) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించారు.

Advertisement

PM Modi Telugu Tweet: తెలుగు సినీ హీరోలను మెచ్చుకున్న ప్రధాని, తెలుగులో ట్వీట్ చేసిన పీఎం మోదీ, వి కిల్ కరోనా..వి ఫైట్ విత్ కరోనా అంటూ కరోనాపై చిరంజీవి, నాగార్జున, ఇతర హీరోలు సాంగ్

Hazarath Reddy

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అధ్యక్షతన తెలుగు సినిమా నటులు మొత్తం ఒక్కొక్కరుగా ముందుకొచ్చి కరోనాను అంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓ పాటలో కూడా కనిపించారు. వి కిల్ కరోనా.. వి ఫైట్ విత్ కరోనా అంటూ వాళ్లు చేసిన ఈ పాట ఇప్పుడు ప్రధాని మోదీ (PM Narendra modi) వరకు వెళ్లింది. దీన్ని గుర్తించిన ఆయన తెలుగులో ట్వీట్ చేసారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో తొలి కోవిడ్-19 మరణం నమోదు, ఆలస్యంగా ధృవీకరించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ, మరొక వ్యక్తి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

Vikas Manda

ఏపీలో ఇప్పటివరకు 161 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా కరోనావైరస్ బారిన పడిన రాజమండ్రికి చెందిన యువకుడు ప్రస్తుతం పూర్తిగా కోలుకొని శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు.....

COVID-19 in Andhra Pradesh: తెలంగాణతో నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్న ఆంధ్రప్రదేశ్, కోవిడ్-19 కేసుల్లో దూకుడు, 161కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, దాదాపు రాష్ట్రం మొత్తం విస్తరించిన వైరస్

Vikas Manda

గురువారం వరకు 149 గా ఉన్న కేసులు, గత రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు మరో 12 కేసులు కొత్తగా రావడంతో సంఖ్య 161కి పెరిగిందని వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు నుంచి 8 ఉండగా, విశాఖ నుంచి 3 కేసులు నమోదయ్యాయి.....

COVID-19 in Telangana: తెలంగాణలో 15 జిల్లాలకు విస్తరించిన కరోనావైరస్ వ్యాప్తి, మరిన్ని జిల్లాల నుంచి కేసులు పెరిగే అవకాశం, 154కు చేరిన మొత్తం పాజిటివ్ కేసులు

Vikas Manda

నిజామాబాద్, నిర్మల్ మరియు భైంసా పట్టణాలు వైరస్ హాట్ స్పాట్ లుగా అధికారులు గుర్తించారు. నిర్మల్ జిల్లా నుంచి కనీసం 50 మంది వరకు నిజాముద్దీన్ మర్కజ్ సమావేశానికి వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు, 4 రోజులు కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు......

Advertisement

PM Narendra Modi Message: ఈ ఆదివారం ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి జ్యోతులు వెలిగించాలి, దేశ ప్రజలంతా మహా జాగరణ చేయాలి. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం

Vikas Manda

కోవిడ్-19కు వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకతాటిపై వచ్చి చేస్తున్న సమిష్టి పోరాటానికి సంఘీభావంగా ఈ ఆదివారం ఏప్రిల్ 05న రాత్రి 9 గంటలకు దేశంలోని ప్రతి ఇంటిలోని సభ్యులు వారి ఇంట్లోని విద్యుత్ దీపాలను ఆర్పివేసి గుమ్మం ఎదుట 9 నిమిషాల పాటు జ్యోతులను లేదా దీపాలను వెలిగించాలని కోరారు......

Tablighi Jamaat Row: తబ్లిఘి జమాత్‌కు హాజరైన విదేశీయుల వీసాల రద్దుతో పాటు బ్లాక్‌లిస్ట్ చేసిన కేంద్ర హోంశాఖ, నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ

Vikas Manda

మర్కజ్‌‌లో కరోనావైరస్ లక్షణాలు కలిగి ఉండి కూడా మతపరమైన సమ్మేళనంకు హాజరైన సుమారు 1,300 మంది అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన విదేశీ తబ్లిఘి జమాత్ కార్యకర్తలు ఆ సమ్మేళనంలో పాల్గొనడమే కాకుండా.....

PM Interaction with CMs: లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినతరం, అతిక్రమించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, కరోనా అనుమానితులపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు ప్రధాని సూచన

Vikas Manda

లాక్ డౌన్ యొక్క రెండవ వారంలో ప్రవేశించిన నేపథ్యంలో ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం అని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పట్నించి కరోనా అనుమానితులను వెతికి పట్టుకోవడం, పరీక్షలు నిర్వహించడం, ఐసోలేషన్ లో ఉంచడం, క్వారంటైన్లకు తరలిండంపైనే సీరియస్ గా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి దిశానిర్ధేషం చేశారు.....

Sri Sita Ramula Kalyanam: భ‌ద్రాద్రిలో రాములోరి కళ్యాణోత్సవం. నిరాడంబరంలోనే రమణీయంగా, కమనీయంగా సాగిన వేడుక, తొలిసారిగా భక్తులు లేకుండానే జరిగిన బ్రహ్మోత్సవం

Vikas Manda

శ్రీ రామ నవమిని పురస్కరించుకొని భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం గురువారం అత్యంత కన్నుల పండువగా జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో తొలిసారిగా భక్తజనం లేకుండానే రాములోరి బ్రహ్మోత్సవం నిర్వహించారు......

Advertisement
Advertisement