ఆంధ్ర ప్రదేశ్
Drinking Water to TN: తమిళనాడు రాష్ట్ర ప్రజల దాహార్థి తీర్చనున్న తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుకు తాగునీరు ఇవ్వడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకారం, ఏపీ సీఎం జగన్‌తో సంప్రదింపులు
Vikas Mandaరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమిళనాడు అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. అయితే ఎన్ని టీఎంసీలు కేటాయించాలి, నీటి పంపిణీపై సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత దీనిపై అడుగు ముందుకు పడనుంది....
AP IPS Transfers and Promotions: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులు, స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగన్ సర్కారు కీలక నిర్ణయం
Hazarath Reddyమరికొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థలు జరగనున్న వేళ వైయస్ జగన్ సర్కారు (YS Jagan Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, ఇంటిలిజెన్స్‌తో పాటూ మరికొన్ని కీలక స్థానాల్లో మార్పులు, చేర్పులు (AP IPS Transfers) చేస్తూ ప్రభుత్వం (Government of Andhra Pradesh) ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది.
Polavaram Project: పోలవరంపై కేంద్రం తీపికబురు, 2021కల్లా పూర్తి చేస్తామని తెలిపిన కేంద్ర మంత్రి షెకావత్, వందశాతం పోలవరం ప్రాజెక్ట్‌ ఖర్చును కేంద్రమే భరిస్తుందని వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీపి కబురు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం (Polavaram Construction) 2021 డిసెంబర్‌నాటికల్లా పూర్తవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ (Gajendra singh shekhawat) చెప్పారు.
IMR AG Meets AP CM: కడపలో మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ ప్రతిపాదన, సహకరించాలని ఏపీ సీఎం జగన్‌ను కలిసిన ఐఎంఆర్‌ ఏజీ కంపెనీ ప్రతినిధులు, ఎలాంటి సహకారానికైనా సిద్ధమన్న ఏపీ సీఎం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఆ దిశగా ఏపీ సర్కారు (AP Govt) కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్‌ జిల్లాలో (YSR Kadapa) మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ పెడతామంటూ ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ (IMR AG) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు (IMR Company Representatives) గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని (YS Jagan Mohan Reddy) కలిసారు. వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.
Amaravati Metro Rail Corporation: జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, విశాఖలో అమరావతి మెట్రో రైల్ కార్యాలయం, డీపీఆర్‌ల రూపకల్పనకు కొటేషన్ల ఆహ్వానం, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ మున్సిపల్ శాఖ
Hazarath Reddyవిశాఖపట్నంను ( Visakhapatnam) పరిపాలన రాజధానిగా నిర్ణయించాక ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (Amaravati Metro Rail Corporation) ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ జగన్ సర్కారు (YS Jagan Govt) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
Uttarakhand: ఏపీ బాటలో ఉత్తరాఖండ్, అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేసిన సీఎం రావత్, వేసవి రాజధానిగా గైర్సైన్‌, రాష్ట్ర రాజధానిగా డెహ్రాడూన్‌, న్యాయ రాజధానిగా నైనిటాల్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ బాటలో ఇప్పుడు మరో రాష్ట్రం కూడా నడుస్తోంది. ఉత్తరాఖండ్‌కు ఇకపై మూడు రాజధానులు ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత త్రివేంద్ర సింగ్ రావత్, బడ్జెట్ సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రాష్ట్ర రాజధానిగా డెహ్రాడూన్, న్యాయ రాజధానిగా నైనిటాల్ ఉండగా, ఇకపై వేసవి రాజధానిగా గైర్సైన్ ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో ఉత్తరాఖండ్ సైతం మూడు రాజధానులతో ముందుకు దూసుకుపోనుంది.
TDP Leader Suicide Attempt: కర్నూలు టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం, పార్టీ పట్టించుకోలేదంటూ ఆవేదన, గతంలో కర్నూలు మేయర్‌గా సేవలందించిన బంగి అనంతయ్య
Hazarath Reddyకర్నూలు టీడీపీ సీనియర్ నేత బంగి అనంతయ్య (TDP leader Bangi Anantaiah) తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Coronavirus Scare: కరోనావైరస్ ప్రభావంతో హైదరాబాద్ - మహేంద్రాహిల్స్ కాలనీలో స్కూళ్లకు సెలవులు, మైండ్ స్పేస్ ఐటీ పార్క్ పాక్షికంగా మూసివేత
Vikas Mandaనెలరోజుల క్రితం దుబాయిలో హాంకాంగ్ కు చెందిన కంపెనీ ప్రతినిధులను కలవడం ద్వారా వారి నుంచి ఇతడికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరులో 2 రోజులు ఆఫీసుకు వెళ్లడంతో పాటు వైరస్ నిర్ధారణ అయి గాంధీ ఆసుపత్రిలో చేరేంత వరకు సుమారు వారం రోజుల పాటు కాలనీలోనే ఉన్నాడు. దీంతో.....
West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం, కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా పోడూర మండలం జగన్నాధపురం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి నరసాపురం కాలువలోకి దూసుకెళ్లడంతో (Car Fell Into Canal) ముగ్గురు చనిపోయారు. బాధితులు కారులో నరసాపురం మచ్చసిరి నుంచి రాజమహేంద్ర వరం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
COVID-19 Outbreak in HYD: హైదరాబాద్‌లో మరో 36 మందికి కరోనావైరస్ లక్షణాలు? ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని వెల్లడించిన వైద్యాధికారులు, 104 హెల్ప్‌లైన్ నెంబర్ ప్రారంభం
Vikas Mandaరాష్ట్ర వాతావరణానికి కరోనావైరస్ మనుగడ సాధించే అవకాశం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విస్తృత సాయం కోరుతున్నట్లు తెలిపారు. నగరప్రజలకు అందుబాటులో ఉంచేందుకు 50 వేల మాస్కులను తెప్పించనున్నారు. కరోనావైరస్ కోసం ప్రత్యేకంగా 104 హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా ప్రారంభించారు.....
Spandana Program: ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ, వచ్చే నెల 1వ తేదీన 2 గంటల్లోగా పెన్షన్ల పంపిణీ పూర్తి, స్పందన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్, ఏపీలో మళ్లీ ఎన్నికల కోలాహలం
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఏం జగన్ (AP CM YS Jagan) కీలక నిర్ణయాలతో ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు.పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధి అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.
AP CM Jagan on NPR: మోదీ ప్రభుత్వానికి సున్నితంగా ఎదురెళుతున్న ఏపీ సీఎం, మైనారిటీల్లో అభద్రతాభావం.. ఎన్‌పీఆర్‌పై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి
Vikas Mandaమోదీ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఎన్‌పిఆర్ లో కొన్ని ప్రశ్నలుగా తల్లిదండ్రుల జన్మించిన ప్రదేశం, ఆధార్ నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, మొబైల్ ఫోన్ నంబర్, ఓటరు ఐడి నంబర్, మాతృభాష తదితర వివరాలు ఉన్నాయి.అయితే వీటిపై సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కార్ ఏర్పడక ముందు 2010లో ఉన్నట్లుగానే జనాభా రిజిస్టర్‌ను అప్‌డేట్ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరుతున్నారు....
AP Local Body Polls: స్థానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టిన సీఎం జగన్, నెల రోజుల్లోగా ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే జైలుకే అని హెచ్చరిక
Vikas Mandaస్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. మూడు రాజధానుల అంశం, ప్రభుత్వ ఇతర నిర్ణయాలను ప్రతిపక్షం, ముఖ్యంగా చంద్రబాబు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన పాలనకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేస్తున్న సందర్భంలో, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఏమాత్రం గెలిచే అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ఆధిపత్యం సాధించి
COVID-19: తెలంగాణలో ఉండే పొడి వాతావరణంలో కరోనావైరస్ మనుగడ సాధించలేదు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది, వెల్లడించిన మంత్రివర్గ ఉపసంఘం
Vikas Mandaఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్ మాట్లాడుతూ తెలంగాణలో ఉండే వేడి, పొడి వాతావరణంలో వైరస్ సజీవంగా ఉండే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. కరోనావైరస్ ఎక్కువగా తేమ మరియు చల్లని ప్రదేశాలలో వ్యాప్తి చెందుతుంది. తెలంగాణలో అలాంటి వాతావరణమే లేదు.....
COVID-19 in India: తెలంగాణలో కరోనావైరస్ కేసుతో రెండు రాష్ట్రాల ఆందోళన, అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు
Vikas Mandaబాధితుడు బెంగళూరు నగరంలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత నెలలో ఆఫీస్ పని మీదే దుబాయ్ వెళ్లిన ఆ యువకుడు అక్కడే కరోనావైరస్ బారిన పడినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత బాధితుడు నేరుగా ఫిబ్రవరి 19న దుబాయి నుంచి ముందుగా బెంగళూరు నగరానికి వచ్చాడు. అక్కడే తన ఆఫీసులో రెండు రోజుల పాటు పనిచేసి, ఆ తర్వాత సెలవుపై హైదరాబాద్ వచ్చాడు. అతడు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఏసీ బస్సులో ప్రయాణించాడు.....
Mukesh Ambani Meets AP CM: గంటన్నరపాటు ముఖేష్ అంబానీతో ఏపీ సీఎం చర్చలు, సీఎం అయిన తరువాత తొలిసారి అంబానీతో మీటింగ్, పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) భేటీ ముగిసింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో (CM’s Camp Office) దాదాపు గంటన్నర పాటు సీఎం జగన్‌తో అంబానీ బృందం చర్చలు జరిపింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరు చర్చించారు.
TTD Budget 2020-21: టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.3309 కోట్లు, గతేడాది కంటే రూ.66 కోట్లు అధికం, ఆమోదం తెలిపిన పాలక మండలి
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) 2020-21 బడ్జెట్ కు (TTD Budget 2020-21) ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు తిరుమలలోని (Tirumala) అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సమావేశంలో పలు అభివృద్ధి పనులు, ఆలయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. బడ్జెట్‌లో ముఖ్యంగా హిందూ ధర్మప్రచారం, భక్తుల సౌకర్యాలు, దేవాలయ నిర్మాణాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతలకు ప్రాధాన్యం ఇచ్చారు.
Father Kills Two Daughters: ఇద్దరు కూతుళ్లని తండ్రి చంపేశాడు, కడప జిల్లాలో దారుణ ఘటన, బావిలో నుంచి మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు, పరారీలో నిందితుడు
Hazarath Reddyఏపీలోని వైయస్సార్ కడప (YSR Kadapa) జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఘోరం జరిగింది. ఓ కసాయి తండ్రి ఇద్దరు కూతుళ్లను బావిలోకి తోసి (Father Kills Two Daughters) చంపేశాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయాల్సిన ఆ తండ్రి పిల్లల్ని చంపేయడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
Google Pay: రూ.3 వేలు పంపిస్తే లక్ష రూపాయలు అకౌంట్లో పడ్డాయి, గూగుల్ పే నుంచి లక్ష రూపాయల స్క్రాచ్ కార్డు, ఊహించని నగదు చూసి షాక్ తిన్న అనంతపురం కుర్రాడు
Hazarath Reddyప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేలో (Google pay) ఎవరైనా డబ్బులు ట్రాన్సఫర్ చేస్తే రివార్డు (scratch card) కింద మనకు ఎంతో కొంత డబ్బులు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామందికి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తుంది. అయితే అనంతపురంలోని ఓ యువకుడికి గూగుల్ పేలో జాక్ పాట్ తగిలింది. గూగుల్‌ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఆ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది.
AP CM Polavaram Tour: సీఎం హోదాలో 2వ సారి పోలవరానికి వైయస్ జగన్, ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే, పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు..
Hazarath Reddyఏపీ (Andhra Pradesh) సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరానికి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రి (Chief Minister YS Jagan Mohan Reddy) హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను (Polavaram Project) ఏరియల్‌ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.