Makar Sankranti 2022: కోడిపుంజుకు కత్తి కట్టడం వచ్చా, అయితే ఒక్క రోజులోనే లక్షల్లో ఆదాయం, కోడి కత్తి వ్యాపారం వెనుక ఉన్న అసలు కథ ఇదే..

కొంత మంది చచ్చిన కోడిలో కొంత భాగం అడుగుతారు. మరి కొంత మంది డబ్బులు డిమాండ్ చేస్తారు.

Cock Fight (File Image)

భీమవరం, జనవరి 13 : సంక్రాంతి సీజన్ వచ్చింది అంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. వాటిని చూడటానికి విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. అందుకోసం ప్రత్యేక సెలవలు కూడా పెట్టుకుంటారు. ఎక్కడ ఉద్యోగం చేసినా సరే కోడి పందాలు అంటే చాలు వచ్చేస్తారు. దీనితో కోడి పందాలకు ఈ సీజన్ లో మంచి డిమాండ్ ఉంటుంది. భారీగా పందాలు కూడా కాస్తూ ఉంటారు. కోడి పందెం అంటే ఇప్పుడు కత్తి కట్టి వేయడం. పూర్వం కోడి పందాలు అంటే రెండు కోడి పుంజులు పోడుచుకున్నప్పుడు ఓడిపోయే పుంజు పారిపోతుంది. నిలబడిన పుంజు పందెంలో విజయం సాధించినట్టు. అయితే రాను రాను పద్ధతి మారిపోయింది. కాళ్ళకు కత్తులు కట్టడం మొదలుపెట్టారు.దీనితో కోడి ఓడిపోవడం కాదు చచ్చిపోవడం ఖాయం అన్నమాట.

ఈ కత్తులు ఎవరు పడితే వాళ్ళు కట్టలేరు. దానికి ప్రత్యేకంగా నిపుణులు కూడా ఉంటారు. వాళ్లకు శిక్షణ కూడా ఉంటుంది. సంక్రాంతి సమయంలో కోడి కత్తి కట్టే వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. కొంత మంది చచ్చిన కోడిలో కొంత భాగం అడుగుతారు. మరి కొంత మంది డబ్బులు డిమాండ్ చేస్తారు. పందెం ఓడినా గెలిచినా అతనికి డబ్బులు ఇవ్వాలి. మరి కొందరు అయితే గెలుపులో పది నుంచి 12 శాతం వరకు వాటా అడుగుతారు. అంటే ఉదాహరణకు ఒక పందెంలో లక్ష రూపాయలు గెలిస్తే అతడికి కనీసం 10 వేల నుంచి 15 వేల వరకూ ఆదాయం పొందే వీలుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif