తెలంగాణ

Rammohan Naidu: నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద త్వ‌ర‌లోనే విమానాశ్ర‌యం, మ‌రికొన్ని ప్రాంతాల్లోనూ కొత్త ఎయిర్ పోర్టులు నిర్మిస్తామ‌న్న రామ్మోహ‌న్ నాయుడు

VNS

నాగార్జున సాగర్‌తో(Nagarjuna Sagar) పాటు మరికొన్ని విమానాశ్రయాల (Airports )ఏర్పాటుకు కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడు(Minister Rammohan Naidu) వెల్లడించారు. వీటితో పాటు శ్రీకాకుళం, దగదర్తిలో, కుప్పం వద్ద కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

CM Revanth Reddy America Tour: సత్పలితాన్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్,భారీగా పెట్టుబడులు, హైదరాబాద్‌లో అమెజాన్ ఏఐ ఆధారిత డేటా సెంటర్

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ సత్ఫలితాన్నిస్తోంది. అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్ టీం వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి పెట్టుబడులను పెట్టాల్సిందిగా కోరుతుండగా వారి నుండి మంచి స్పందన వస్తోంది. తాజాగా అమెజాన్ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించేందుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ప్రకటించింది.

Telangana Rain Alert: తెలంగాణ‌కు రెండు రోజుల పాటూ భారీ వ‌ర్ష సూచ‌న, హైద‌రాబాద్ తో పాటూ ప‌లు జిల్లాల్లో అల‌ర్ట్

VNS

తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు (Telangana Rain Alert) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపపనాల (Mansoon) కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

KTR On Amara Raja Battery: తెలంగాణ నుండి తరలిపోతున్న పరిశ్రమలు, కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టమని కామెంట్

Arun Charagonda

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు గల్లా జయదేవ్‌కు చెందిన అమర రాజా కంపెనీ ముందుకొచ్చింది. అయితే తాజాగా అమరరాజా సంస్థ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించటంపై స్పందించడం కేటీఆర్ ఇది చాలా బాధాకరమన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దు అని, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్‌కు నష్టం రాకుండా రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

Advertisement

Telangana Shocker: రిపేర్‌కు ఇచ్చిన ఫోన్ ఇవ్వలేదని బ్లెడ్‌తో కోసుకున్న వ్యక్తి, ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన, ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

రిపేర్ కు ఇచ్చిన ఫోన్ తిరిగి ఇవ్వడం లేదని ఓ వ్యక్తి బ్లెడ్ తో చేయి కోసుకున్నాడు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రమేష్ మేస్త్రి పని నిమిత్తం జగిత్యాలకు వచ్చాడు...ఇటీవల తన ఫోన్ పాడవడంతో షాప్ లో రిపేర్ కి ఇచ్చాడు. అయితే సెల్ పాయింట్ యాజమాని ఫోన్ తిరిగి ఇవ్వడం లేదని బ్లెడ్ తో చేయి కోసుకున్నాడు.స్థానికులు గమనించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.

Sitarama Project: వీడియో.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్, స్విచ్ ఆన్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్‌, 15న ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. పుసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. ట్రయల్ రన్ స్విచ్ ఆన్ చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, తుమ్మలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Shamshabad Airport: షూలో రూ. కోటి బంగారం, దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడి షూలో బయటపడ్డ బంగారం, పట్టుకున్న డీఆర్ఐ అధికారులు

Arun Charagonda

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. దుబాయ్ నుండి హైదరాబాద్‌కి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. షూలో పెట్టుకుని బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: హైదరాబాద్ లో నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ముగ్గురికి తీవ్రగాయాలు.. వీడియో వైరల్

Rudra

హైదరాబాద్ లోని నార్సింగిలో మై హోమ్ అవతార్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారును వేగంగా వచ్చిన టిప్పర్ ఒకటి డీకొట్టింది.

Advertisement

Telangana Cyber Police: ముంబై సైబర్ క్రైం పోలీస్‌ పేరుతో సైబర్ మోసం, 13 రాష్ట్రాల్లో నేరాలు, మోసగాడిని వలవేసి పట్టుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

Arun Charagonda

ముంబై సైబర్ క్రైం పోలీస్‌గా నటిస్తున్న సైబర్ నేరగాన్ని వల వేసి పట్టుకుంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. విశాఖపట్నంకు చెంది 39 ఏళ్ల షేక్ ఖలీల్ ముంబై సైబర్ క్రైం పోలీస్ అధికారిగా నటిస్తూ తప్పుడు ఆరోపణలతో డబ్బులు దోచుకోవడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు.

Robbers Attack On Narsapur Express:నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌పై దొంగల రాళ్లదాడి, రైల్వే బోగిల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం, లాక్ చేసి ఉండటంతో వెనుదిరిగిన దొంగలు..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి ప్రయత్నించారు దొంగలు. నర్సాపూర్ రైలుపై రాళ్లు రువ్వి, B1, S11, S12 కోచ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కోచ్‌ల డోర్లు లాక్ చేసి ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు రైల్వే పోలీసులు.

Nalgonda: నల్లగొండలో త్రాగు నీటిలో వానపాములు, ఈ నీటిని ఎలా త్రాగాలని స్థానికుల ఆందోళన, ఎనమిది నెలలుగా వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయలేదని మండిపాటు

Arun Charagonda

నల్లగొండలో త్రాగు నీటిలో వానపాములు కలకలం రేపాయి. నల్లగొండ - నకిరేకల్ నియోజకవర్గంలోని కట్టంగూరు మండల కేంద్రంలో త్రాగు నీటిలో వానపాములు వచ్చాయి. వాటర్ ట్యాంకును ఎనిమిది నెలలుగా శుభ్రం చేయలేదని.. ఈ నీరు మేము తాగేదెలా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Telangana Youth Congress Elections: నేతలందరి టార్గెట్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌పైనే, ఆసక్తిక రంగా యూత్ కాంగ్రెస్‌ ఎన్నికలు, బహిరంగంగానే బల్మూరికి ఓటేయొద్దని చెబుతున్న ఎమ్మెల్యేలు, గెలిచేది ఎవరో!

Arun Charagonda

తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ నేతలంతా నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్ష పదవులకు గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ విద్యార్థి, యువజన సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం అనవాయితీ.

Advertisement

Sircilla Viral Video: ఇదేందయ్యా.. మగవాళ్లను మాత్రమే కాలితో తన్నుతూ దాడి చేస్తున్న కాకులు.. సిరిసిల్ల బస్టాండ్ లో ఘటన

Rudra

సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలో ఆశ్చర్యకరమైన ఘటన కనిపిస్తున్నది. బస్టాండ్ సమీపంలోని కట్ట మైసమ్మ గుడి వద్ద అక్కడ తిరుగుతున్న మగవాళ్ల పై మాత్రమే కొన్ని కాకులు దాడి చేస్తున్నాయి.

Tungabhadra Dam Gate Chain Snaps: అలర్ట్.. భారీ వరదకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు.. గత 70 ఏండ్లలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.. తెగిన గేట్ మార్గం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద.. ఏపీలోని మంత్రాలయం, నందవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

Rudra

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణానదిలో వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహ తీవ్రతకు కర్ణాటకలోని హోస్పేట్‌ లో ఉన్న తుంగభద్ర డ్యామ్‌ 19వ గేటు కొట్టుకుపోయింది.

Sitarama project: ఆదివారం సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్,15న పంప్‌హౌస్‌లు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, భారీ బహిరంగసభ

Arun Charagonda

ఈనెల 15న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి సీతారామ ప్రాజెక్ట్ లోని మూడు పంప్ హౌస్ లు. ఈ ఆదివారం ట్రయిల్ రన్ కు ఏర్పాట్లు చేశారు. పంప్ హౌజ్ ల ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీతారామ ప్రాజెక్ట్ కు 67 TMC నీటి కేటాయింపులకు ప్రతిపాదనలు చేశారు.

CM Revanth Reddy: స్టాన్ ఫర్డ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాటిలైట్ సెంటర్ ఏర్పాటును చేయాలని కోరిన రేవంత్

Arun Charagonda

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగుతోంది. తన పర్యటనలో భాగంగా వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు రేవంత్. తాజాగా స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్‌ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో భాగస్వామ్యం కావాలని కోరారు

Advertisement

Khammam: నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బెదిరింపు, హోటల్‌ యజమానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

Arun Charagonda

ఖమ్మంలోని ఓ హోటల్ యజమానికి నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బెదిరింపులు కలకలం రేపాయి. మమతా రోడ్డులోని కింగ్ దర్బార్ హోటల్ యాజమానిని బెదిరించిన నలుగురు దుండగులు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కి సమాచారం అందించిన హోటల్ యజమాని. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి సీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు.

Hyderabad Road Accident: ఆగి ఉన్న బైక్‌ను కారుతో ఢీకొట్టిన మహిళ, ఓ వ్యక్తికి తీవ్రగాయాలు, హిమాయత్ నగర్‌లో రోడ్డు ప్రమాదం, వీడియో వైరల్

Arun Charagonda

హైదరాబాద్ హిమాయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా థార్ వాహనాన్ని నడిపి ఆగి ఉన్న బైకర్ ను ఢీకొట్టింది మహిళ. ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Bandi Sanjay About KTR: త్వరలో జైలుకు కేటీఆర్, బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం వార్తలు పుకార్లేనన్న బండి సంజయ్‌

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. మీడియాతో మాట్లాడిన కేటీఆర్...కేటీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి గురించి అందరికీ తెలుసని తెలిపారు.

Nalgonda Police: రోడ్ రోలర్‌తో బైక్ సైలెన్సర్లు నుజ్జునుజ్జు, 80 ద్విచక్ర వాహనాల మాడిఫై చేసిన సైలెన్సర్స్ ను ద్వంసం చేసిన పోలీసులు

Arun Charagonda

భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అధిక శబ్దం కలిగించే 80 ద్విచక్ర వాహనాల మాడిఫై చేసి సైలెన్సర్స్ ద్వంసం చేశారు పోలీసులు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement