తెలంగాణ
Telugu States Bypolls 2021: బద్వేల్ ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు, అధికార పార్టీకి పోటీగా రెండు జాతీయ పార్టీలు రంగంలోకి.., హుజూరాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు
Hazarath Reddyఏపీలోని కడపజిల్లాలో గత బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బద్వేలు బరిలో (Badvel bypoll on Oct 30) నామినేషన్‌ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్‌ ఉపసంహరణ అనంతరం పోటీలో (badvel ByElection) 15 మంది అభ్యర్థులు నిలిచారు.
KRMB: శ్రీశైలం, సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక కృష్ణా బోర్డు పరిధిలోకే, మాకు ఒకే అన్న ఏపీ, జల విద్యుత్ కేంద్రాలు అప్పగించబోమని స్పష్టం చేసిన తెలంగాణ,ఈ నెల 14 నుంచి గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లోకి రావడంపై సందిగ్ధత
Hazarath Reddyశ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుల పరిధిలోని 16 ఔట్ లెట్ కేంద్రాలను తన పరిధిలో చేర్చాలని నిర్ణయిస్తూ కృష్ణా నది నిర్వహణ బోర్డు (Krishna River Management Board) తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఈ నెల 14 నుంచి గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వస్తుందని కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ వెల్లడించింది.
Nizamabad: బీజేపీ కార్పొరేటర్ భర్త అక్రమ సంబంధం, చెప్పుతో కొట్టిన బాధితురాలి తల్లి, తమ కూతుర్ని కిడ్నాప్ చేశారంటూ నిందితుడి ఇంటి ముందు ఆందోళన, నిజామాబాద్ జిల్లాలో ఘటన
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో బీజేపీ నేత వివాహేతర సంబంధం తాజాగా వెలుగు చూసింది. తమ కూతురిని బ్లాక్ మెయిల్ చేసి వివాహేతర సంబంధం పెట్టుకుని మోసం చేశాడ‌ని బాధితురాలి త‌ల్లి వాపోయింది. బీజేపీ కార్పొరేట‌ర్‌ (Nizamabad bjp Corporator) భ‌ర్తను బాధితురాలి తల్లి కోపంతో చెప్పుతో కొట్టింది.
Disha Encounter Hearings: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పదమేంటో నాకు తెలియదు, నేను తెలుగు సరిగా మాట్లాడలేను, జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట హాజరైన వీసీ సజ్జనార్
Hazarath Reddyసైబరాబాద్‌ మాజీ పోలీస్‌ కమిషనర్ వీసీ సజ్జనార్‌ రెండో రోజు మంగళవారం జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ముందు హాజరయ్యారు. దిశ హత్యాచార కేసులో (Disha rape and murder Case) నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్న విషయం తనకు తెలియదని అప్పటి సైబరాబాద్‌ సీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ (Former Cyberabad commissioner V C Sajjanar) స్పష్టం చేశారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 183 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 40,354 కరోనా పరీక్షలు నిర్వహించగా, 183 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 20, ఖమ్మం జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి.
Nalgonda Tragedy: ఘోర విషాదం, రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, ఆ మరణాన్ని తట్టుకోలేక కొడుకు మృతదేహం వద్దనే కుప్పకూలిన తండ్రి, మిర్యాల గూడలో ఘటన
Hazarath Reddyతెలంగాణలో నల్గొండ జిల్లాలో విషాదం (Nalgonda Tragedy) చోటు చేసుకుంది. ఆ జిల్లాలో గుర్తుతెలియని వాహన రూపంలో వచ్చిన మృత్యువు ఆ కొడుకుని బలి తీసుకోగా, కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి కుప్పకూలి (Father dies of heart attack) పోయాడు.
Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు, జ్యుడీషియల్ కమిషన్ ముందుకు వీసీ సజ్జనార్, కేసులో కీలకం కానున్న సజ్జనార్‌ స్టేట్‌మెంట్‌
Hazarath Reddyదిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై (Disha Encounter) విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టు.. జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ను నియమించిన సంగతి విదితమే. దిశ’ హత్యాచారం నిందితులను సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌కు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్‌ విచారణ చేస్తోంది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 162 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,506 కరోనా పరీక్షలు నిర్వహించగా, 162 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 11, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి.
Justice Ahsanuddin Amanullah: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా, రేపు తెలంగాణహైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర ప్రమాణ స్వీకారం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా (Justice Ahsanuddin Amanullah) ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ( Andhra Pradesh High Court) లోని మొదటి కోర్టు హాల్లో పాట్నా హైకోర్టు నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లాచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణం చేయించారు.
Telangana Horror: వికలాంగుడిని కూడా వదలని కామాంధులు, రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి 5 మంది గ్యాంగ్ రేప్, ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులు, మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన
Hazarath Reddyతెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన (Telangana Horror) చోటు చేసుకుంది. ఓ మానసిక వికలాంగుడిపై ఐదుగురు కామాంధులు లైంగిక దాడికి (physically challenged person gang raped) పాల్పడ్డారు.అంతే కాకుండా ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఇందారంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Telangana Rains: భారీ వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, గద్వాల జిల్లాలో గోడ కూలి ఐదుగురు మృత్యువాత, మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
Hazarath Reddyగ్రేటర్‌ హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 23 సెంటీమీటర్ల వర్షపాతం (Telangana Rains) నమోదైంది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాలాలు, చెరువులు పొంగి పొర్లాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగంతోపాటు పోలీసు శాఖ అప్రమత్తమై.. ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టింది.
Corona in TS: తెలంగాణలో మరోసారి 200 లోపే కరోనా కేసులు, గత 24 గంటల్లో 190 మందికి పాజిటివ్, రాష్ట్రంలో ఇంకా 4,288 మందికి కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyతెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి చేరుకుంది. మరోసారి 200కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 42,166 కరోనా పరీక్షలు నిర్వహించగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Telugu Akademi FD Scam: తెలుగు అకాడమి నిధుల స్కాం, అసలు సూత్రధారి సాయికుమార్‌, వివరాలను వెల్లడించిన సీపీ అంజనీకుమార్, కేసులో ఇప్పటివరకు మొత్తం 10 మంది అరెస్ట్
Hazarath Reddyహైదరాబాద్ లోని తెలుగు అకాడమిలో నిధుల గోల్ మాల్ వ్యవహారం (Telugu Akademi FD Scam) గతకొద్ది రోజుల నుంచి సంచలనంగా మారిన సంగతి విదితమే. తాజాగా ఈ కేసులో (Telugu Akademi misappropriation case) కీలక పరిణామం చోటు చేసుకుంది.
Telangana: తెలంగాణలో బస్సు కారు ఢీ, అదుపుతప్పి లోయలో పడిన రెండు వాహనాలు, పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 11 మందికి గాయాలు
Hazarath Reddyమంథని నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి (1 dies, 16 Injured after TSRTC bus falls into gorge) దూసుకెళ్లాయి.
Transfer of 15 High Court Judges: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ అషానుద్దీన్ అమానుల్లా, తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌, 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
Hazarath Reddyపాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అషానుద్దీన్ అమానుల్లా (Justice Ahsanuddin Amanullah), అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిలహరిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ మంగళవారం కేంద్రం ఉత్తర్వులిచ్చింది. వీరితో కలిపి దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 15 మంది న్యాయమూర్తుల బదిలీకి (Transfer of 15 High Court Judges) రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 218 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,578 కరోనా పరీక్షలు నిర్వహించగా, 218 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, కరీంనగర్ జిల్లాలో 14, నల్గొండ జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.
TS Monsoon Session 2021: తెలంగాణలో 80 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్, వచ్చే బడ్జెట్‌లో దళితబంధు పథకానికి రూ.20వేల కోట్లు, అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం కేసీఆర్, శాసనసభ గురువారానికి వాయిదా
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ వేదికగాప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన (CM KCR announces mega recruitment drive) చేశారు. రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలిపారు.
TS Monsoon Session 2021: దళిత బంధు హుజూరాబాద్‌ కోసమే పెట్టలేదు, విపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయని కేసీఆర్ అసహనం, తెలంగాణలో కొనసాగుతున్న ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు
Hazarath Reddyదళిత బంధు హుజూరాబాద్‌ కోసం పెట్టలేదు. కరోనా కన్నా ముందే దళిత బంధు ఆలోచన చేశాం. కానీ కోవిడ్‌ వల్ల ఆలస్యమయ్యింది. దీనిపై విపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో (Telangana Assembly ) అసహనం వ్యక్తం చేశారు.