తెలంగాణ
Telangana: భర్త వేరే మహిళతో..భరించలేక ఆత్మహత్య చేసుకున్న భార్య, జడ్చర్ల మండలంలో విషాదకర ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyభర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో మనోవేదనకు గురైన భార్య వారం కిందట ఇంట్లోనే గడ్డిమందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది.
Warangal: కాలేజీ హాస్టల్లో గొడవ, కోపంతో విద్యార్థిని భవనంపై నుంచి తోసేసిన తోటి విద్యార్థులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి, ఆందోళన చేపట్టిన విద్యార్థులు, మృతుని తల్లిదండ్రులు
Hazarath Reddyతెలంగాణలో వరంగల్ జిల్లా నర్సంపేటలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న గొడవ (Clash between hostel students) కాస్త ముదిరి ఒకరి ప్రాణం తీసింది. గొడవలో రెండో అంతస్తు నుంచి విద్యార్థిని తోసేయడంతో అతను మృతి ( death of 18-year-old) చెందాడు.
Cyclone Gulab: ఏపీని తాకనున్న గులాబ్ సైక్లోన్, గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్, రేపు కళింగపట్నం సరిహద్దులో తీరం దాటనున్న గులాబ్, దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) తుపాను హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ తుపానుకు పాకిస్తాన్ సూచించిన ‘గులాబ్‌’గా (Cyclone Gulab) పేరుపెట్టారు.
CM KCR Delhi Tour: ఢిల్లీలో బిజీగా సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి, కృష్ణా, గోదావరి జలాల అంశంపై భేటీలో చర్చ
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ లో (CM KCR Delhi Tour) ఉన్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సమావేశమయ్యారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌.. మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో శనివారం భేటీ (Telangana CM KCR meets Gajendra Singh Shekhawat) అయ్యారు.
Telangana Rains: తెలంగాణలో మూడు రోజల పాటు భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం, తీవ్ర వాయుగుండంగా మారిన అల్ప పీడనం
Hazarath Reddyతెలంగాణలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy rains likely in Telangana) ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండంగా మారిందని పేర్కొంది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 239 కరోనా కేసులు, తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, 239 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 17, నల్గొండ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి.
Telangana Assembly Monsoon Session 2021: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, వెంటనే వాయిదా.. ఈ సమావేశాల్లో దళిత బంధు ప్రధాన ఎజెండా, మూడెకరాల భూమిపై ప్రభుత్వాన్ని నిలదీసే ఆలోచనలో ప్రతిపక్షాలు
Team Latestlyప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలైనటు వంటి నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగాలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. త్వరలో హుజూరాబాద్ ఉపఎన్నిక...
Hidden Camera: హైదరాబాద్‌ రెస్టారెంట్‌లోని మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా, చూసి షాక్ తిన్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు, నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Team Latestlyమహిళల వాష్‌రూమ్‌లో రికార్డింగ్ మోడ్ స్విచ్ ఆన్ చేసిన రహస్య కెమెరాను ఓ మహిళా కస్టమర్ గుర్తించింది. వాష్‌రూమ్‌లోని ఓవర్‌హెడ్ షెల్ఫ్‌లో దాచిన కెమెరాను గుర్తించిన ఆమె వెంటనే దీనిపై రెస్టారెంట్ యాజనమాన్యాన్ని నిలదీయడంతో పాటు జూబ్లీహిల్స్ పోలీసులకు...
Warangal Shocker: రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్త, తట్టుకోలేక మర్మాంగాలు కోసి హత్య చేసిన భార్య, వరంగల్ జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణ వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రతి రోజూ తాగొచ్చి భర్త వేధిస్తున్నాడని ఓ భార్య నిద్ర పోతున్న భర్తను దారుణంగా హత్య (Woman kills alcoholic husband) చేసింది. ఈ అమానుష ఘటన వరంగల్ జిల్లా (Warangal), మరిపెడ మండలంలో జరిగింది.
Tollywood Drug Scandal Row: టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు, మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ సిటీ కోర్టు
Hazarath Reddyటాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణకు సంబంధించి మంత్రి కేటీఆర్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆదేశించింది. రేవంత్‌పై కేటీఆర్‌ దాఖలు చేసిన పరువునష్టం దావాపై మంగళవారం విచారణ జరిపిన అనంతరం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Corona in Telangana: కొత్తగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72 కేసులు, గత 24 గంటల్లో తెలంగాణలో 244 మందికి కోవిడ్
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,505 కరోనా పరీక్షలు నిర్వహించగా, 244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72 కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 19, నల్గొండ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 18, ఖమ్మం జిల్లాలో 17 కేసులను గుర్తించారు.
Heavy Rains in Hyd: భారీ వర్షాలకు వణికిన హైదరాబాద్, సైదాబాద్‌ కృష్ణానగర్‌ వరద నీటిలో గుర్తు తెలియని మృతదేహం, అస్తవ్యస్తమైన జనజీవనం, నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological dept) ప్రకటించింది. దీంతోపాటు రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం (Heavy rains predicted) ఉందని వెల్లడించింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 208 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 49 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 45,274 కరోనా పరీక్షలు నిర్వహించగా, 208 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 49 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 20, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, ఖమ్మం జిల్లాలో 12, మంచిర్యాల జిల్లాలో 11 కేసులు వెలుగు చూశాయి.
Moinabad Shocker: ఒక్క ముద్దిస్తే రూ. 25 వేలు ఇస్తా, 5 నెలలు రెంట్ కడతా, ఆర్‌ఎంపీ మహిళా డాక్టర్‌ను వేధించిన పేషెంట్, నిర్భయ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణలో దారుణ ఘటన చోటు (Moinabad Shocker) చేసుకుంది. ఆర్‌ఎంపీ వైద్యురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగా వేధించిన ఓ వ్యక్తిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన ఘటన (Patient Sexual Harassment on RMP Woman Doctor) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో చోటుచేసుకున్నది.
White Challenge Row: చర్లపల్లి బ్యాచ్‌తో నేను టెస్టులు చేసుకుంటే నా గౌరవం తగ్గుతుంది, మీ రాహుల్ గాంధీ రెడీనా.. సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్, ముందు సీఎం కేసీఆర్‌ లై డిటెక్టర్‌ టెస్టుకు సిద్ధం కావాలన్న రేవంత్ రెడ్డి
Hazarath Reddyకాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో రేవంత్‌ వైట్‌ ఛాలెంజ్‌ (white challenge) పేరిట మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌.. రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) సవాలు విసిరారు.
Corona in TS: తెలంగాణలో అత్యంత తక్కువగా 173 కేసులు నమోదు, ఒకరు మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 5,005 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో గడచిన 24గంటల్లో 35,160 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 173 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,94,564కి చేరింది.
TSRTC MD Sajjanar: ఆర్టీసీ బస్సులో వినాయకుడు ప్రతిమతో వీసీ సజ్జనార్, గణేశుడిని నిమజ్జనానికి తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyగణేశ్‌ నిమజ్జనం (immersion of Ganesh idols) సందర్భంగా ఆర్టీసీ బస్సులోనే వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Road Accidents in TS: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది మంది మృతి, నలుగురికి తీవ్ర గాయాలు, నల్గొండ జిల్లా, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాద ఘటనలు
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో (Road Accidents in TS) ఎనిమిది మంది మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Hyderabad: తాళి కట్టిన తరువాత డబ్బు, నగలతో వధువు పరార్, వరుడు నచ్చలేదని అందుకే నా లవర్‌తో లేచిపోతున్నానంటూ అమ్మమ్మకు ఫోన్, ఆందోళనకు దిగిన పెళ్లి కొడుకు తరపు బంధువులు
Hazarath Reddyభాగ్యనగరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిఖా పూర్తయిన నిమిషానికే ఓ పెళ్లి కూతురు భర్త ఇచ్చిన మెహర్‌ (కానుకలు)ను తీసుకొని ప్రియుడితో కలిసి పరారైన సంఘటన (Bride runs away with lover) బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది.
Ganesh Visarjan 2021: సీఎం జగన్ కోసం.. రూ.18.90 లక్షలకు బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి, హైదరాబాద్‌లో వైభవంగా కొనసాగుతున్న గణేశుడి మహా శోభాయాత్ర
Hazarath Reddyగణేశుడి మహా శోభాయాత్రకు మహానగరం సిద్ధమైంది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(GHMC) పోలీసు, హెచ్‌ఎండీఏ, విద్యుత్తు సంస్థ, జలమండలి ఇలా అన్ని శాఖలు సమన్వయంతో వ్యహరించి ఏర్పాట్లు పూర్తి చేశాయి. హుస్సేన్‌సాగర్‌తోపాటు అతిపెద్ద 25 చెరువులు, 25 నిమజ్జన కోనేరుల్లో ఈ కార్యక్రమం (Ganesh Visarjan 2021) సాగుతుందని అధికారులు ప్రకటించారు.