తెలంగాణ
Corona in TS: తెలంగాణలో కొత్తగా 324 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు నిర్ధారణ , ప్రస్తుతం రాష్ట్రంలో 5,325 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గత 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,62,526కి చేరుకుంది.
TS High Court: జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరించిన హైకోర్టు, రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేత, నేడు బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు వెలువరించనున్న సీబీఐ కోర్టు
Hazarath Reddyఅక్రమాస్తుల ఆరోపణల కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు (TS High Court) నిరాకరించింది. ఈ మేరకు పిటిషన్ల బదిలీ కోరుతూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను (Rebal MP raghurama petition) కొట్టివేసింది.
Saidabad Rape Case: సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు, రంగంలోకి ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నిందితుడిని వెతుకుతున్న 15 పోలీస్ టీం బృందాలు, దేశ దిమ్మరిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన హైదరాబాద్ పోలీసులు
Hazarath Reddyతెలంగాణలో కలకలం రేపిన సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో (Saidabad Rape Case) నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే 10 బృందాలను ఏర్పాటు చేయగా.. తాజాగా మరో ఐదు స్పెషల్ టీంలను పోలీస్‌ అధికారులు (Hyderabad police) నియమించారు.
Hyderabad Metro: కరోనా ప్రభావంతో నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మెట్రో, నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని పేర్కొన్న సీఎం కేసీఆర్, ప్రభుత్వం తన బాధ్యతగా మెట్రోను ఆదుకుంటుందని హామి
Team Latestlyపూర్వాపరాలను పరిశీలించి ఏ విధానం అవలంభించడం ద్వారా మెట్రోకు పూర్వవైభవాన్ని తీసుకురాగలమో అవగాహన కోసం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు...
Telangana: ఈనెల 16న తెలంగాణ కేబినేట్ సమావేశం, కీలక అంశాలపై చర్చ; రాష్ట్రంలో కొత్తగా 336 కోవిడ్19 కేసులు నమోదు, 5 వేలకు పైబడి ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyఅసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు మరియు దళిత బంధు పథకంపై కూడా కేబినెట్ చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ పథకం పైలట్ ప్రాతిపదికన మరో నాలుగు మండలాల్లో అమలు చేయబడుతుందని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ అధికారికంగా ఆమోదించనుంది....
Hyderabad Ganesh Immersion: హుస్సేన్ సాగర్‌లో పీఓపీ గణేష్ నిమజ్జనాలపై హైకోర్ట్ నిరాకరణ.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం, ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం నిర్ణయించిన సీఎం
Team Latestlyహుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఒకవేళ సుప్రీం కూడా నిరాకరిస్తే అప్పుడు పరిస్థితి ఏంటనే దానిపై ప్రభుత్వ వర్గాలు చర్చిస్తున్నట్లు సమాచారం...
Dalit Bandhu Scheme: నలుదిక్కులా దళితబంధు అమలు, మరో నాలుగు మండలాలకు పథకం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడి
Team Latestlyహుజూరాబాద్, వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పు దిక్కున ఉన్న మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలం...
Ganesh Idol Immersion: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం కుదరదు, తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyగణేశ్‌ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. నిమజ్జనంపై (Ganesh Idol Immersion) తీర్పును సవరించేందుకు ఏసీజే జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ వినోద్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
Special Vaccination Drive: రోజుకు 3 లక్షల మందికి టీకాల పంపిణీ, రాష్ట్రంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం; తెలంగాణలో ప్రస్తుతం 5 వేల పైబడి ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసులు
Team Latestlyగడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 249 కోవిడ్19 కేసులు నమోదు కాగా, ఇద్దరు కరోనాతో మరణించారు. ఇక మహమ్మారి నుంచి మరో 313 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,258 ఆక్టివ్ కేసులు...
'No to Paddy Sowing': ఇకపై వరి వేయడం అంటే ఉరి వేసుకోవటమే, ఈ యాసంగి నుంచి రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సీఎం కేసీఆర్ సమీక్షలో వ్యక్తంఅయిన అభిప్రాయం, కేంద్రం వద్ద 5 ఏళ్లకు సరిపడ వరి నిల్వలు
Team Latestlyరాష్ట్ర ప్రభుత్వంపై గత యాసంగిలో సేకరించిన ధాన్యం వల్ల సుమారు రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు వివరించారు. వీటన్నింటి దృష్ట్యా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరు శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది....
TS Weather Report: తెలంగాణలో 3 రోజులు పాటు భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyబంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని (TS Weather Report) హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రం భీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల అతిభార్షీ వర్షాలు కురువవచ్చని వెల్లడించింది.
Hyderabad Shocker: అనాథని చేరదీస్తే..డబ్బు కోసం ప్రియుడితో కలిసి పెంపుడు తల్లిని చంపేసిన కసాయి కూతురు, హైదరాబాద్‌లో దారుణ ఘటన, నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyతమ దేశం ,తమ మతం కాకున్నా.. అనాథను సొంత కూతురిలా ఆదరించి..పెంచి పెద్దచేసిన ఓ విదేశీయురాలు అదే యువతి చేతిలో దారుణంగా హత్యకు (French woman killed by adopted daughter) గురైంది. ప్రేమ పెళ్లి కాదన్నందుకు, అడిగిన డబ్బు ఇవ్వనందుకు పెంపుడు తల్లిని ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి ఓ యువతి హత్య చేయించి.. కటకటాల పాలైంది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 296 కరోనా కేసులు, వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 74 తాజా కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 69,833 కరోనా పరీక్షలు నిర్వహించగా, 296 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 74 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 29, వరంగల్ అర్బన్ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై తెగబడిన కామాంధుడు, దారుణంగా అత్యాచారం చేసి హత్య, నిందితుడు ఇంట్లో చిన్నారి మృతదేహం, నిందితుడిని ఉరి తీయాలని స్థానికులు డిమాండ్‌
Hazarath Reddyభాగ్యనగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో దారుణం (Hyderabad Shocker) చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే యువకుడు లైంగిక దాడి చేసి హత్యకు (Six-year-old raped, killed) పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారి అదృశ్యమైంది. అర్ధరాత్రి 12 గంటలకు నిందితుడు రాజు ఇంట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది
Corona in TS: తెలంగాణలో కొత్తగా 220 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 71 కొత్త కేసులు, 5,351 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 51,004 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 71 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 17, ఖమ్మం జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి.
Hyderabad Ganesh Utsav: హైదరాబాద్‌లో ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు, ఖైరతాబాద్‌లో పంచముఖ రుద్ర గణపతిగా కొలువుతీరిన బడా గణేశ్, తొలి పూజ నిర్వహించిన గవర్నర్
Team Latestlyప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ మహా గణపతి (బడా గణేష్) భక్తుల కోసం కొలువుదీరాడు. ఈ సారి శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిగా స్వామి దర్శనమిస్తున్నాడు. 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద కుడి వైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి...
Ganesh Chaturthi 2021 Wishes: సమస్త జగత్తు గణమయం.. గణపతికి ఘనస్వాగతం! ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా పూజా సమయం విశేషాలు తెలుసుకోండి, వినాయక చవితి శుభాకాంక్షలు పంచుకోండి
Team Latestlyగణేష్ చతుర్థి లేదా వినాయక చవితి అనేది హిందూ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. హిందువులు ప్రతి కార్యానికి ముందు గణపతికి మొదట పూజ నిర్వహించడం అనవాయితి, తాము చేయదలిచిన పనులను నిర్విఘ్నంగా జరిగేందుకు ఆ గణనాథుడి ఆశీస్సులు అందుకుంటారు....
Ganesh Chaturthi Guidelines: తెలంగాణలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనాలపై రాష్ట్ర హైకోర్ట్ ఆంక్షలు, హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం, కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం
Team Latestlyరోడ్లకు అడ్డంగా గణేష్ మంటపాలను ఏర్పాటు చేయవద్దు, ఉత్సవాల్లో నిర్వహించే డిజే లాంటి కార్యక్రమాలపై నియంత్రణ ఉండాలి, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి శబ్దాలు వినిపించకుండా చూడాలని పోలీస్ శాఖను హైకోర్ట్ ఆదేశించింది...
Vaccines Drone Delivery: తెలంగాణలో డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీకి నేటి నుంచి ట్రయల్స్; రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 329 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5,497గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyకరోనా లాక్డౌన్ మనుషుల మధ్య దూరాన్ని పెంచగా, కొత్త కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు ఆద్యంపోసింది. ఇందులో భాగంగా నేరుగా ఇంటి వద్దకే ఔషధాలు , వ్యాక్సిన్‌ల పంపిణీ కోసం డ్రోన్ డెలివరీ ట్రయల్స్ గురువారం నుండి తెలంగాణలోని...